Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పు చేయనివాడు గాడిద… ఇదొక అప్పానందలహరి…

May 6, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. ఆద్యంతమూ ఫుల్ కామెడీ సినిమా ఈ అప్పుల అప్పారావు . జంధ్యాల గారికి మాయాబజార్ సినిమా పాటలు ఎన్నో సినిమాలకు టైటిల్సుని ఇచ్చింది . ఇవివి విజయా వారి అప్పు చేసి పప్పు కూడు సినిమా నుండి ఏమయినా స్ఫూర్తి పొందారో ఏమో ! అప్పు చేసి పప్పు కూడు టైటిల్ సాంగులో రుణోపాఖ్యానం/అప్పోపాఖ్యానం గురించి ఉంటుంది .

అలాంటి టైటిల్ సాంగుని ఇవివి కూడా ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ మీద చక్కగా పెట్టారు . అప్పు చేయని వాడు గాడిదా అని రాగం ఎత్తుకుంటాడు . ముళ్ళపూడి వారి రుణానందలహరిని ఏకరువు పెట్టిస్తారు . బాగుంటుంది . సినిమా అంతా రాజేంద్రప్రసాద్ గోలే . ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాంలో పిసినారితనానికి పట్టం కడితే ఈ సినిమాలో అప్పiకు పట్టం కడతాడు .

Ads

ప్రముఖ హాస్య నటి రమాప్రభ సమర్పణలో వచ్చిన ఈ సినిమా కధను నేసిన, ప్రేక్షకులు మరచిపోలేని పాత్రలను సృష్టించిన ఇవివిని ప్రత్యేకంగా అభినందించాలి . బ్రహ్మానందం , ఐరన్ లెగ్ శాస్త్రి పాత్రలు . చిరంజీవి వీరాభిమాని పాత్రలో అన్నపూర్ణమ్మ , జైలు పక్షి పాత్రలో తనికెళ్ళ భరణి , ఏ అప్పారావు అంటే ఏ అప్పారావు అని విసిగించే పొట్టి ప్రసాద్ పాత్ర , జ్యోతిచిత్ర అమ్మే చిడతల అప్పారావు పాత్ర . జంధ్యాల గుర్తుకొస్తారు .

ఇన్ని చిత్రవిచిత్ర పాత్రల సృష్టి తర్వాత చెప్పుకోవలసింది డైలాగ్స్ రచయిత యల్ బి శ్రీరాం ఫౌండ్ పాత్రల పేర్లు . దాసరి రాఘవేంద్రరావు , రేలంగి రమణారెడ్డి , వాసిరెడ్డి రంగనాయకమ్మ , నాదెండ్ల అంజయ్య . ఇళ్ళ పేర్లతో అసలు పేర్లను కలిపి కొత్త పేర్లను తయారు చేయటం . గొప్ప ఇన్నొవేషన్ .

మా చిన్నప్పుడు ఓ మాట అనేవారు . ఏడుగురు అల్లుళ్ళతో కలిసి భోజనం చేస్తే కాశీకి వెళ్ళినంత పుణ్యం వస్తుందని . ఆ ఏడుగురి పెళ్ళిళ్ళు చేసేటప్పటికి ఆ తండ్రి అయిపోతాడు . ఈ సినిమాలో అయిదుగురు కూతుళ్ళ తల్లి రమాప్రభ పెద్ద కూతురు కానిస్టేబుల్ శోభన ఓ వ్యూహం పన్ని అప్పుల అప్పారావుకి వల వేసి ముగ్గులోకి దించి , మోసం చేసి రెండో కూతురితో పెళ్లి జరిపిస్తారు .

ఆ తర్వాత మిగిలిన ముగ్గురి పెళ్ళిళ్ళు కూడా జరిపితేనే విడాకులు అని చెప్పి నానా తిప్పలకు గురిచేసి బిడ్డల పెళ్ళిళ్ళు జరిపించుకుంటుంది రమాప్రభ . అప్పుడు అసలు సంగతి బయటపెడతారు . శోభన కూడా తన కూతురే అని . మరదళ్ళు అందరూ విశాల హృదయంతో బాలకృష్ణలాగా , మోహన్ బాబులాగా , చిరంజీవిలాగా , ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు సినిమాలో రాజేంద్రప్రసాద్ లాగా , వెంకటేశ్వర స్వామిలాగా శోభనను కూడా పెళ్లి చేసుకోమని వెంటపడతారు . అంత మంది అడిగితే సున్నిత మనస్కుడయిన ఏ పురుషుడు కాదనగలడు ! శోభనను కూడా పెళ్ళి చేసుకోవటంతో సినిమా శుభాంతం అవుతుంది .

ఈ సినిమాలో పాటలు కూడా ప్రత్యేకమే . రాజన్- నాగేంద్ర సంగీత దర్శకత్వంలో వేటూరి , భువనచంద్ర , సాహితి , జొన్నవిత్తుల వ్రాసిన పాటలు సరదాగా ఉంటాయి . రంభ హో రంభ హో , రా రా ఓ గాంగ్ లీడర్ అంటూ సాగే రెండు రీమిక్స్ & పేరడీ పాటలు ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తుతాయి .

ఓసి నా సుబ్బలక్ష్మి రావే రావే , మూడో దెబ్బ కొట్టాక భామ నా ఎదలోన పొంగింది ప్రేమ , తొలి నైటు డ్యూయెట్ల చిత్రీకరణ జనరంజకంగా ఉంటాయి . బాలసుబ్రమణ్యం , జానకమ్మ , శైలజ , చిత్ర , శుభ- రాధిక శ్రావ్యంగా పాడారు .

ప్రధాన పాత్రల్లో రమాప్రభ , సింధుజ , బాబూమోహన్ , మల్లిఖార్జున రావు , జయలలిత , సుత్తి వేలు , జె వి సోమయాజులు , ఆలీ , బ్రహ్మానందం , ఐరన్ లెగ్ శాస్త్రి , తనికెళ్ళ భరణి , అన్నపూర్ణమ్మ , లతాశ్రీ  తదితరులు నటించారు .

ఔట్ డోర్ షూటింగ్ విజయవాడలో జరిగిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . అప్పుడప్పుడు టివి చానల్సులో కూడా వస్తూ ఉంటుంది . An excellent hilarious entertainer .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎర్ర రాజకీయాలకు కొరుకుడుపడని కొయ్య… కేరళ కొత్త ముఖ్యమంత్రి…
  • మనోభావాల యూనివర్శిటీ… విభిన్న కోర్సులకు అడ్మిషన్ల నోటిఫికేషన్…
  • బాధితురాలిని బజారుకు లాగడం పక్కా నేరం, అనైతికం…!!
  • ఎటూ మొగ్గు లేదు.., ఎవరికీ వత్తాసు లేదు – సీఎం రేవంత్ పరిణతి…
  • కాసింత నువ్వుల నూనె… ఓ నల్ల రిబ్బన్ ముక్క… కాసిన్ని నల్ల నువ్వులు…
  • ‘‘నా స్టార్‌డమ్ ఎంత అల్పమైందో నాకప్పుడు అర్థమైంది’’
  • ప్రతీక్ యాదవ్..! ములాయం చిన్న కొడుకు కథ కూడా ఓ సినిమా స్క్రిప్టే..!!
  • … ఇప్పుడైతే పోలీసుల మనోభావాలు దెబ్బతినేవేమో…!!
  • బుల్డోజర్ జస్టిస్… మజ్లిస్ నేతకు దెబ్బ… నేరస్తులకు షెల్టరిస్తే ఇల్లే ఉండదు..!
  • ఎంతసేపూ పూరేకలు విచ్చుకోవడంపైనేనా వేటూరి దృష్టి..!?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions