Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అందరూ ఈ అందమైన ఆడదెయ్యం ప్రేమలో పడిపోతున్నారు… ఎవరామె..?

February 5, 2026 by M S R

.

సర్వం మాయ సినిమా చూసినవాళ్లు అలా అలా అనుకోకుండానే ఆ సినిమాలో ఓ అందమైన దెయ్యంతో ప్రేమలో పడిపోతున్నారు… ఆ కేరక్జరైజేషన్ మాత్రమే కాదు… ఆ పాత్రలోకి అచ్చంగా దూరిపోయిన నటి ప్రతిభ  కూడా మరో కారణం…

ఆమె పేరు రియా శిబు… ఇప్పుడు జనం ఆమెను డెలూలు క్వీన్ అంటున్నారు… ఆ సినిమాలో దెయ్యం పాత్ర పేరు డెలూలు..! ఆమె ఎవరా అని ఆరా తీస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు…

Ads

ఆమెది కేరళలోని తిరువనంతపురం… వయస్సు 21… అవును, ఈ వయస్సుకే మస్తు పాపులర్ అయిపోయింది… తండ్రి శిబు థమీన్స్ ఓ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్… తమ్ముడు హ్రిదు హరూన్ కూడా నటుడే… సినిమా కుటుంబం నుంచి వచ్చింది…

నిజానికి ఆమె రెగ్యులర్ నటి కాదు… లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ చదివాక, తండ్రి సినిమా ప్రాజెక్టుల్లో పనిచేయడం స్టార్ట్ చేసింది… అవును, ఆమె నిర్మాత… అదీ ఒక్క మలయాళమే కాదు… హిందీ, తమిళం కూడా… ముంబైకర్, థగ్స్, ముర, వీరధీరశూరన్ (2) సినిమాలకు నిర్మాత ఆమే…

దెయ్యం

నిర్మాతగా మాత్రమే కాదు, ఆమె సోషల్ మీడియాలో యమ యాక్టివ్… రీల్స్, ఫ్యాన్ ఆర్ట్, మీమ్స్, సంభాషణలు… ఎప్పుడూ ట్రెండింగ్… లక్షల కొద్దీ ఫాలోయర్లు, ఫ్యాన్స్… 2024లో కప్ అనే సినిమాలో నటిగా చేసింది…

సర్వం మాయ నిర్మాత- దర్శకులు అడగ్గానే పాత్ర నచ్చి చేసేసింది… మరో సినిమా అతిరది కూడా ప్రోగ్రెస్‌లో ఉంది… అటు నిర్మాతగా, ఇటు నటిగా ఇంకొన్ని మంచి ప్రాజెక్టులు చేయాలి రియా… ఆల్ ది బెస్ట్…

రియా శిబు



వీర ధీర శూరన్ ప్రమోషనల్ కార్యక్రమంలో హీరో విక్రమ్ మాట్లాడుతూ…, “నేను ఈమెను మొదటిసారి ఫోటోషూట్ రోజున కలిశాను… ఒక చిన్న అమ్మాయి కెమెరా పట్టుకుని చాలా ప్రశాంతంగా నిలబడి ఉంది… ఈమె నిజంగా నిర్మాతేనా అని ఆశ్చర్యపోయాను… అప్పుడు నేను ఆమె రీల్స్‌లో ఒకదాన్ని చూశాను… చాలా బాగుంది, ఈమెలో ఇంత ఎనర్జీ ఉందా అనుకున్నాను… ఒక పెళ్లిలో ఆమె అద్భుతంగా డాన్స్ చేయడం కూడా నేను చూశాను, నేను మరోసారి ఆశ్చర్యపోయాను… రియా, నువ్వు ఇంకా చాలా దూరం వెళ్తావు..’’



Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టీబీజేపీకి దిష్టి తత్వం బోధపడింది… కళ్లు హఠాత్తుగా తెరుచుకున్నయ్…
  • వరల్డ్ క్రికెట్ అంటేనే ఇండియా… విదేశీ జట్లలో ఏకంగా 40 మంది మనోళ్లే..!!
  • అసలు ప్రేక్షకులే చూడని సినిమాకు మూడు ప్రభుత్వ అవార్డులు..!
  • సుపిత- జాతిపిత… ఎడతెగని రచ్చ… అర్హతలపై అంతులేని రాద్ధాంతం…
  • చావుతో అతి పెద్ద పోరాటం… ఆమె బతికిన తీరే ఓ అద్భుతం…
  • మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే..? అమరావతి పూలింగుకు అదే అడ్డంకి..!!
  • ఇది గోనా గన్నారెడ్డి ఏలిన కోట… ఓ ఘన చరిత్రకు శిథిల ఆనవాలు…
  • వరంగల్- కరీంనగర్… ఓ న్యూ మోడల్ పెంటాసిటీ కారిడార్..!!
  • ఆరోగ్యానికి ‘లలితకళా’ రక్ష…! ప్రొటియోమిక్స్ అంటే ఏంటి..?
  • గుణశేఖర్ గుణాత్మక పంథా… సామాజిక ఇతివృత్తాల వైపు… కానీ..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions