Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గుంజి గుంజి… వాడు కాదు, వాడి నిర్మాత- దర్శకులే అసలు వైరసులు..!!

February 5, 2026 by M S R

.

గుంజి గుంజి… వాడి డర్టీ డ్యాష్ వివరాల్లోకి, వాడికి జన్మనిచ్చిన ఆ గ్రేట్ తల్లిదండ్రులకు సానుభూతి తెలుపుతూ… ముందుగా ఇంకొన్ని నిజాలు చెప్పుకుందాం… ఎందుకంటే..? చంద్రహాస్ అనేవాడు తెలుగు ఇండస్ట్రీకి ఓ కొత్త వైరస్…

ఆ పాట పాడిన ఈవెంటులో గెస్టు జేడీ చక్రవర్తే చెప్పు తీసుకుని కొట్టినట్టు వివరణ ఇచ్చాడు… ఐనా ఆ ప్రభాకరుడికి సి- శ- లేవు ఈరోజుకూ… కిక్కుమనడం లేదు… ఏం ఖండించినా కొడుకు చేతిలో శాస్తి తప్పదనే భయం కావచ్చు…

Ads

చాలామంది వెధవలు సమర్థిస్తున్నారు… వాడిలో తప్పేముందని..! ఆ సమర్థకులే ఈ వైరస్ వాహకాలు… అసలు డేంజర్… తెలుగు పాటల్లో బూతు కొత్త కాదు… చల్లగా లేస్తోంది వంటి ఎన్టీయార్ వెగటు, రోత పాటల దగ్గర నుంచీ ఉన్న వికారమే… కానీ అప్పట్లో నోరిప్పే సీన్ లేదు, ఈరోజు ఉంది, అందుకే వ్యతరేకించాలి…

అబ్బే, ఒరిజినల్‌లో లేదు, అప్పటికప్పుడు చంద్రహాస్ తన కేరక్టర్ గురించి చెప్పడానికి అలా పాడాడు… చిన్న పొరపాటు, ఈ పాడటం గురించి ఈవెంటులో ఎవరికీ తెలియదు… తను కావాలని చేయలేదు… పొరపాటు అని అయిపోయాక చెప్పాం, ఒరిజినల్ పాటలో ఆ బూతులు లేవు అంటూ నిర్మాత దర్శకులు ఏదో సొల్లు, డొల్ల వివరణ ఇస్తున్నారుట…

అత్యంత ప్రమాదకరం ఇదుగో ఇలాంటి చెత్త కేరక్టర్లే… అంతా ప్రిప్లాన్‌డ్… నువ్వు రెచ్చిపో, తేడా వస్తే మేం సర్దుకువస్తాం అనే వెధవ తెలివితేటలు… ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే వాడు ఆ పాట పాడతాడు… అది పొరపాటు అట… నిర్మాతదర్శకుల సిగ్గులేని సమర్థన… కవరింగు…

గుంజి

ఎంత ప్రిప్లాన్‌డ్ కాకపోతే… ఫిలిమ్ జర్నలిస్టులను ఎడ్డోళ్లను చేసి, వాడు మెయిన్ స్ట్రీమ మీడియాను గోకాడు… సరే, తెలంగాణ పోలీసులు వాడికి ఏ ‘హితవు’ చెబుతారో వదిలేద్దాం… కానీ ఆ ఒరిజినల్ పాట రాసిన రోల్ రైడా గాడికీ సోయి లేదు, సంస్కారం లేదు… నీయక్క, గుద్దితే ముక్కుల రక్తమొస్తది… ఏం భాషరా ఇది..? ఏం అభిరుచిరా ఇది..?

నీయక్క అంటే ఏందో అర్థం తెలుసారా రోల్ రైడా..? అప్పట్లో నాని అనే చిల్లర హీరో కూడా దాన్ని ఓ ఘనపదంగా పదే పదే వాడాడు… అందరూ నీయమ్మని, నీయక్కని అని ఎగిరే రవితేజ అనబడే వెగటు, రోత,, వెటరన్ బూతు హీరో వారసులే ఉన్నట్టున్నారు…

వాడెవడో ధ్రువన్ అని సంగీత దర్శకుడు అట… అందరిదీ ఒకటే టేస్టు… బూతు… ఇక చూసుకొండి, ఆ సినిమా ఎంత దివ్యంగా ఉండబోతున్నదో… ది గ్రేట్, ఈరోజుకూ కిమ్మనని ఈటీవీ ప్రభాకర్ కుసంస్కార నైతిక ప్రమాణాల సాక్షిగా… తెలుగు ప్రేక్షకులందరినీ ఎడ్డిపప్పల్ని చేసే బ్రహ్మాండమైన మూసీ మార్క్ టేస్టు…

పోలీసులు కేసు పెట్టారు, వాడెవరినో బెదిరించాడు అనేవి ఇమ్మెటీరియల్… ఇలాంటి సినిమా టీమ్స్, హీరో, నిర్మాత, గీతరచయిత, కంపోజర్, దర్శకులకు చెంప పగలిపోవాలంటే… వాళ్ల భాషలో ఏమీ అనడం లేదు… ఆ సినిమాను నిర్మొహమాటంగా రెఫ్యూజ్ చేయడమే ఈ వైరస్‌కు విరుగుడు… వాడి సినిమాను రిలీజ్ చేసే థియేటర్ల ఓనర్ల డర్టీ, అగ్లీ, చిల్లర వెధవాయిత్వానికి జాలి ప్రకటిస్తూ..!!

అవునూ... గు భాషలో చెప్పాలంటే ఈ ధోరణికి అసలు పేరు యాటిట్యూడ్ కాదు, మన్నూ కాదు, గు- బలుపు అట, నిజమేనా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలుగు పుట్టుకే – తెలుగుకన్నా ఇతర దక్షిణ భాషలే గౌరవించాయి!!
  • అఖిల్ బాబూ, నీ లెనిన్ సీన్ పాత బాల‘కృష్ణబాబు సీన్‌కు కాపీ అట..?!
  • తప్పకుండా రైల్వే ఫిజికల్ టికెట్ వెంట ఉండాల్సిందేనా? ఏది నిజం?!
  • అప్పట్లో ఒక అల్లు అరవింద్ – ఒక జగన్ – ఇప్పుడు ఒక కేటీయార్
  • హీరో రాజేంద్రప్రసాద్‌కు దీటైన ఓ హస్తి నటన – కాసింత ఎక్కువే !!
  • Space Couple – ఈ వ్యోమగాముల జంట కథ స్పూర్తిదాయకం!
  • అక్రమార్కిణి..! మమత పార్టీ నిధుల వెనుక నానా బాగోతాలు..!
  • ఒకే పాట- నాలుగు గొంతులు … జానకమ్మ వాయిస్ మ్యాజిక్ ఈ సాంగ్
  • క్రాంతి గౌడ్ – ఆదివాసీ పల్లె నుంచి- లార్డ్స్ హానర్స్ బోర్డు దాకా!
  • అమృత గాయని – అమర గాయని… ఎక్స్‌ప్రెషన్ మాస్టర్ జానకమ్మ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions