Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్చ్, ఏం చేస్తాం..? జపానోడికి మన మామిడి తినే యోగం లేదు..!!

May 31, 2026 by M S R

.

Priyadarshini Krishna …. మన దేశం నుండి మామిడి పళ్ల దిగుమతిని జపాన్ ఈ సంవత్సరం (2026 కు) నిలిపివేసింది. జపాన్ మన దేశానికి చెందిన మామిడి పళ్లను బాన్ చెయ్యడం ఇది రెండోసారి. క్రితం, 1986 లో ఇలాగే 20 ఏళ్లకు గాను ban చేసింది. అంటే 2006 వరకు జపానీయులు మన మామిడి పళ్ళు తినడానికి నోచుకోలేదు.

తర్వాత సరిగ్గా 20 ఏళ్లు… మన మామిడిని ఇక ఆస్వాదిస్తారు అనుకోగానే మళ్లీ ఇప్పుడు మరోసారి ban చేసింది. అంటే ఒక జనరేషన్ మన మామిడి పళ్ళను చవిచూసే వీలు లేదన్నమాట…!

Ads

అసలు ఎందుకు ఈ Ban…?!

జపాన్ లోకి దిగుమతి అయ్యే అగ్రి/ హార్టీకల్చర్ బేస్డ్ ప్రొడక్ట్స్ పైన అనేకానేక స్క్రీనింగ్ టెస్టులు వుంటాయి. అంతే కాకుండా నిర్ణీతమైన క్వారెంటైన్ సమయాన్నీ భారత్ ఎగుమతులప్పుడు చెయ్యట్లేదని తన తనిఖీలో తేలిందని, పళ్ళ నుండి వ్యాపించే అనేక వ్యాధులు, క్రిమి కీటకాలు తమ దేశంలోకి ప్రవేశించి ప్రబలిపోకుండా ఈ జాగ్రత్తలు అని జపాన్ పేర్కొంది .

  • పళ్ల నుండి వివిధ రకాలైన క్రిమికీటకాల గుడ్లు లార్వాలు ఒక చోటి నుండి ఇంకో చోటికి చాలా ఈసీగా ప్రవేశించి, కొత్త ప్రదేశంలో వ్యాప్తి చెందడానికి పుష్కలమైనన్ని మార్గాలున్నాయని జపాన్ పేర్కొంది.

ఫ్యుమిగేషన్, డిసిన్‌ఫెక్షన్ ప్రొసిజర్స్, Vapour ఆవిరి, హీట్ ట్రీట్మెంటు (VHT) వంటి నివారణ చర్యలను భారత్ సరిగా నిర్వహించదని వారి తనిఖీలో తేలిందట… ఫ్రూట్ ఫ్లై వంటి కీటకాల గుడ్ల వల్ల వారి వ్యవసాయ రంగానికి అంటుకునే ప్రమాదం ఉన్నందువల్ల ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.

ఆల్ఫోన్సో , కేసర్ , బంగినపల్లి , లాంగ్రా , చౌసా , మలిక వంటి రకాలకు జపాన్ లో చాలా ఆదరణ డిమాండ్ వున్నందువల్ల మన దేశం నుండి అనేకమంది ఎక్స్పోర్టర్లు జపాన్ కు ఎగుమతి చెయ్యడానికి ఇప్పటికే అన్ని నిబంధనలు పాటించి రుసుములు చెల్లించి తమ తమ ప్రొడ్యూస్ ను రెడీగా ఉంచారు. ఇంతలోనే ఈ వార్త వల్ల రైతులు ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు వుసూరుమంటున్నారు. ఈ ban ఎప్పటివరకు వుంటుందో చెప్పలేము అని తెలిపారు….

జపాన్ కు అవి తినే అదృష్టం లేకపోతే, కనీసం వాటిని మనకైనా అమ్మవచ్చు కదా తక్కువ ధరకు అని వినియోగదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • TMC బండి నొగలు విరుగుతున్నయ్… ‘కర్మ’ ఎదురుతంతోంది…
  • అసలు హిట్లర్ ఎవరు..? BRS రచ్చకు శ్రీధర్‌బాబు భలే కౌంటర్…!
  • బొద్దింకలు అడిగాయని… ధర్మేంద్ర ప్రధాన్‌‌ను తప్పించడం పెద్ద పరీక్షే..!!
  • బండి ‘ఫ్లెక్సీలు’ సరే… తనను పదే పదే గోకి, గిల్లి, గిచ్చి, రక్కి రెచ్చగొట్టింది ఎవరు..?
  • మానెక్ షా … మనసున్న ఓ చిత్రమైన కేరక్టర్ … చదవాల్సిన ఓ కథ …
  • ప్రధాని మోదీ వెనుక కనిపిస్తున్నది ఏమిటి..? గేమ్ ఛేంజర్..!
  • … కుండ బద్ధలు కొట్టేయడంలో రేవంత్ రెడ్డి తరువాతే ఎవరైనా..!!
  • అబ్ ఆయేగా మజా ..! జార్ఖండ్ బరిలో సాయిరెడ్డి, పరిమళ్ అంబానీ..!!
  • సుకన్య..! పరువుకై 30 ఏళ్ల సఫల పోరాటం… మీడియాకు ఓ పాఠం..!!
  • …. అందుకే రేవంత్ రెడ్డి ప్రత్యర్థుల అంచనాలకు అందడు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions