Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కుజదోషం ఎఫెక్ట్… ఆమె మనసు పారేసుకుంటుంది పాపం…

April 28, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. ప్రముఖ నటి నగ్మా తెలుగులో నటించిన మొదటి సినిమా 1991 జూన్లో వచ్చిన ఈ పెద్దింటల్లుడు . 1990 లో వచ్చిన తమిళ సినిమా నాడిగన్ కు రీమేక్ ఈ పెద్దింటల్లుడు . తమిళంలో సత్యరాజ్ , ఖుష్బూ , మనోరమ ప్రధాన పాత్రల్లో నటించారు . దర్శకుడు శరత్ . ఇదే స్టోరీ లైనుతో మొట్టమొదట హిందీలో ప్రొఫెసర్ అనే టైటిలుతో 1962 లో వచ్చింది . షమ్మీకపూర్ , కల్పన , లలితా పవార్ ప్రధాన పాత్రల్లో నటించారు .

దీనికి రీమేకే 1969 లో వచ్చిన భలే మాస్టారు సినిమా . యన్టీఆర్ , అంజలీదేవి , కాంచన , కృష్ణంరాజు , షీలా ప్రధాన పాత్రల్లో నటించారు .‌ కన్నడంలో 1992 లో గోపీకృష్ణ అనే టైటిలుతో రీమేక్ అయింది . రవిచంద్రన్ , రూపిణి , సుమిత్ర ప్రధాన పాత్రల్లో నటించారు .‌

Ads

పెద్దింటల్లుడు సినిమాకు నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ . దర్శకుడు శరత్ . రాజ్- కోటి సంగీత దర్శకత్వంలో వేటూరి వారు పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , చిత్ర శ్రావ్యంగా పాడారు . జిందాబాద్ జీవితం అనే పాట సుమన్ , అతని ఫ్రెండ్స్ మీద ఉంటుంది . అలాగే నగ్మా తన ఫ్రెండ్సుతో సుమన్ని కాళ్ళే మూడంట అంటూ టీజ్ చేసే పాట ఉంటుంది .

మిగిలిన మూడూ సుమన్ , నగ్మాల మీద డ్యూయెట్లు . అబ్బలాలో అందాలన్నీ ఆరేసా , జోహారే భామా నీతోనే ప్రేమా , కన్ను కొట్టు కన్ను కొట్టు అంటూ సాగుతాయి ఈ మూడు డ్యూయెట్లు . అన్ని డ్యూయెట్ల చిత్రీకరణ బాగుంటుంది .

తల్లి గుండె ఆపరేషన్ కొరకు పట్నానికి బయలుదేరిన సుమన్ సూట్ కేసులు రైల్లో మారుపడతాయి . అందులో దొరికిన అడ్రస్ పట్టుకుని సుమన్ ముసలివాడిగా వెళతాడు . మాస్టారి ఉద్యోగం వస్తుంది . ఆ ఇంటి పెద్దామె వాణిశ్రీకి కుజ దోషం , సుమన్ తనకు కుజ దోషం వలన పెళ్లి కాలేదని చెప్పటంతో వాణిశ్రీ మనసు పారేసుకుంటుంది .

వాణిశ్రీ మేనకోడలు నగ్మా కుర్ర సుమన్ ప్రేమలో పడుతుంది . ఒక మర్డర్ కేసుకు సంబంధించిన కేసెట్ కొరకు ఇంటిల్లిపాది అందరినీ విలన్లు బంధించటం , సుమన్ , అతని మిత్రుడు మోహన్ బాబు రక్షించటం , అసలు వేషం బయటపడటం , వాణిశ్రీ ప్రేమలోకం నుండి బయటకు రావటంతో సినిమా శుభాంతం అవుతుంది .

ఇతర పాత్రల్లో బాబూమోహన్ , సీమ , ప్రతాప్ చంద్రన్ , బేబీ విజయలక్ష్మి , మాస్టర్ అమిత్ తదితరులు నటించారు . ఓంకార్ డైలాగులను వ్రాసారు . సుందరం , తార డాన్సుల్ని బాగా కంపోజ్ చేసారు . వంద రోజులు ఆడిన ఈ సినిమా వ్యాపారపరంగా కూడా సక్సస్ అయింది . అప్పుడప్పుడు టివి చానల్సులో వస్తూ ఉంటుంది . సినిమా యూట్యూబులో ఉంది . It’s a hilarious , action entertainer . చూడతగ్గ చిత్రం .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎర్ర రాజకీయాలకు కొరుకుడుపడని కొయ్య… కేరళ కొత్త ముఖ్యమంత్రి…
  • మనోభావాల యూనివర్శిటీ… విభిన్న కోర్సులకు అడ్మిషన్ల నోటిఫికేషన్…
  • బాధితురాలిని బజారుకు లాగడం పక్కా నేరం, అనైతికం…!!
  • ఎటూ మొగ్గు లేదు.., ఎవరికీ వత్తాసు లేదు – సీఎం రేవంత్ పరిణతి…
  • కాసింత నువ్వుల నూనె… ఓ నల్ల రిబ్బన్ ముక్క… కాసిన్ని నల్ల నువ్వులు…
  • ‘‘నా స్టార్‌డమ్ ఎంత అల్పమైందో నాకప్పుడు అర్థమైంది’’
  • ప్రతీక్ యాదవ్..! ములాయం చిన్న కొడుకు కథ కూడా ఓ సినిమా స్క్రిప్టే..!!
  • … ఇప్పుడైతే పోలీసుల మనోభావాలు దెబ్బతినేవేమో…!!
  • బుల్డోజర్ జస్టిస్… మజ్లిస్ నేతకు దెబ్బ… నేరస్తులకు షెల్టరిస్తే ఇల్లే ఉండదు..!
  • ఎంతసేపూ పూరేకలు విచ్చుకోవడంపైనేనా వేటూరి దృష్టి..!?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions