Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రామాయణం చీరలు… అపచారమా..? కళాత్మక భక్తి వ్యక్తీకరణా..?

March 8, 2026 by M S R

.

నిజమే… కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని, పురాణ గ్రంథాల్ని, దేవుళ్లను అవమానిస్తే… కావాలని అవమానిస్తున్నట్టు కనిపిస్తే ఖండించండి, వ్యతిరేకించండి, తప్పేమిటో వివరించండి… పర్లేదు…

కానీ ప్రతిదాన్నీ ఓ ఇష్యూ చేయడం ఈమధ్య చాలామందికి అలవాటైంది… కరాటే కల్యాణి అని ఓ హిందూ యాక్టివిస్టు… ఈమధ్య తరచూ ఆమె పేరు వినిపిస్తోంది… ఈ కరాటే ఇంటి పేరు నేపథ్యం తెలియదు గానీ అగ్రెసివ్‌గా వెళ్తోంది… సినిమా నటి అట కదా…

Ads

సరే, నిజంగా ఆందోళన చెందాల్సిన అంశాలైతే వోకే… మద్దతిచ్చేవాళ్లు ఉంటారు, తప్పులేదు… కానీ తాజాగా ఆమె నారా బ్రాహ్మణిపై, దివ్వెల మాధురిపై ఫైరవుతోంది… ఎందుకయ్యా అంటే..? రామాయణాన్ని, దేవుళ్లను కించపరిచేలా చిత్రాలు నేసిన చీరను బ్రాహ్మణి ధరించిందట, ఆమెను చూసి కంట్రవర్సీ కేరక్టర్ దివ్వెల మాధురి కూడా అలాంటి అపరాధమే చేసిందట…

ఊరుకోను, క్షమించను, రామాయణ కథను, వాళ్ల బొమ్మల్ని ముద్రించిన చీరెల్ని ముడ్డి కింద వేసుకుని కూర్చుంటే ఊరుకుంటానా అంటోంది కల్యాణి… ఇందులో పురాణాల్ని, పురాణ పాత్రల్ని అవమానించింది ఏముంది..? అవమానించే ఉద్దేశమే ఉంటే, అంత ఇష్టపడి, కష్టంతో ఎందుకు నేయిస్తారు..? కట్టుకునే వస్త్రాలపై దేవుళ్ల బొమ్మలు అంటే ఇష్టంగా ప్రదర్శిస్తున్నట్టే తప్ప కించపరచడం అవుతుందా..? హేళన చేయడం అవుతుందా..?

‘ఇది ఎవరు ఉపేక్షించిన రామ భక్తులు ఊరుకోరు… కాళ్లతో, ఆది కావ్యాన్ని తొక్కితే… ఎలా పడితే అలా బొమ్మలు వేసి అపహాస్యం చేస్తే ఊరుకోం…. చీర నేసినవారిని కూడా వదలం… నారా బ్రాహ్మణి కూడా తప్పు చేశారు…. ఆమెను చూసి ఈరోజు దివ్వెల మాధురి కూడా అంటే హిందుత్వాన్ని పాటించుకున్నా పర్లేదు కానీ.. అపహాస్యం చేయొద్దు…’ అని ఏదేదో రాసింది… సరే, కొంతమేరకు ఆమె వాదనలో న్యాయం, భావోద్వేగం ఉందనే అనుకుందాం…

ఓ విషయం చెప్సుకోవాలి… నారా బ్రాహ్మణి ఎప్పుడైనా సరే బహిరంగంగా పద్దతి తప్పి వ్యవహరించినట్టు లేదు… హుందాగానే ఉంటుంది… పొల్లు మాటలు కూడా మాట్లాడదు, రాజకీయాలు అస్సలు మాట్లాడదు… గతేడాది దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో ధరించింది ఆ చీర… దానిపై రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంది…

వాల్మీకి చరిత్రను చీరపై డిజైన్ రూపంలో ప్రింట్ చేశారు… తేట తెలుగులో, చేతితో రామాయణ మహాకావ్యంలోని పంక్తులను రాశారు… ఈ చీరను శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి కోరిక మేరకు కంచిపట్టు చీరపై స్థానిక కలంకారీ ఆర్ట్‌తో తీర్చిదిద్దారు… తేట తెలుగులో రామాయణ మహా కావ్యాన్ని చీరపై వచ్చేలా రూపొందించారు…. చీరపై డిజైన్‌లో తామరపువ్వు, బాణం, సీతా సమేత రామలక్ష్మణులు, రామాయణంలోని పలు ముఖ్య ఘట్టాలను చిన్న చిన్న థీమ్స్‌ (బొమ్మల) రూపంలో పొందుపరిచారు… ఈ చీర తయారు చేయడానికి ఏకంగా 35 రోజుల సమయం పట్టిందట…

మాధురి చీరె

ఇదంతా ఇష్టపడి చేయించుకున్నదే కదా.,. ఇందులో ఉద్దేశపూర్వకంగా హేళన చేసింది ఏముంది..? నిన్నో మొన్నో దివ్వెల మాధురి కట్టిన చీరె కూడా దాదాపు అలాగే ఉంది… సాక్షాత్తూ టీటీడీ గౌరవార్థం సెలబ్రిటీ భక్తులకు కప్పే శాలువాలపై కూడా శ్రీవారి పేరు, గుర్తులు, నమః మంత్రం ఉంటుంది… అదేమీ తప్పు కాదు కదా… సేమ్ చీర కూడా… ఇది కళాత్మక భక్తివ్యక్తీకరణే…

కొందరు ఇళ్లల్లో డోర్ కర్టెన్లపై దేవుళ్ల బొమ్మలు ఇష్టపడతారు… ఫోన్ కవర్లపై, హ్యాండ్ బ్యాగులపై ఇష్టపడతారు… ఇందులో ఇష్టమే తప్ప హేళన ఏముంది..? ఎస్, తరచూ అమెజాన్ వాడో, ఏ ఈ-కామర్స్ వాడో డోర్ మ్యాట్స్, బాత్‌రూం మ్యాట్లపై దేవుళ్ల బొమ్మల్ని ముద్రించి… చివరకు సాక్స్, చెప్పులపై కూడా ముద్రించి అమ్మకాలకు పెడితే ‘బాయ్‌కాట్ అమెజాన్’ అని నెటిజనం విరుచుకుపడింది… దెబ్బకు వాడు తీసేశాడు… అబ్బే, అవి థర్డ్ పార్టీ తప్పులు అని ఏదో సమర్థించుకుంది…

ఆ విషయాల్లో హిందూ సమాజం స్పందన కరెక్టు… అంతెందుకు ఓసారి డోర్ మ్యాట్లపై భారత జెండా ముద్రిస్తే అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించి, తక్షణం తొలగించకపోతే అమెజాన్ అధికారుల వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించింది… నిజంగా అవమానం జరిగినప్పుడు అలాంటి స్పందన బాగుంటుంది… మద్యం సీసాల కవర్స్, లేబుల్స్ మీద కూడా దేవుళ్ల పేర్లు, బొమ్మలు కూడా గతంలో వివాదాస్పదమయ్యాయి…

ఇప్పుడు కామన్ అయిపోయింది, బంగారు మైసమ్మ వైన్స్, వెంకటేశ్వర బార్ ఎట్సెట్రా… మరి వాటి మాటేమిటి కరాటే కల్యాణీ..? గణేష్ ఉత్సవాలు జరిగినన్ని రోజులూ బ్రహ్మాండంగా పూజలు చేసి, నిమజ్జనం చేయగానే ఇనుప ఊచల కోసం పిల్లలు ఆ విగ్రహాలపైకి ఎక్కి, విగ్రహాల నుంచి ఊచలు పెరుకుతారు… ఇక్కడా వాళ్లకు నాలుగు డబ్బులొస్తాయనే కడుపు నింపుకునే ఆశ తప్ప, దేవుళ్లను అవమానించేది ఏమీ ఉండదు…

సో, ఉద్దేశపూర్వక చర్యలను ఖండించాలి, అంతేతప్ప ప్రతిదీ పబ్లిసిటీ కోసం, పబ్లిక్ అటెన్షన్ కోసం ఇష్యూ చేయకూడదనేది నీతి… అఫ్‌కోర్స్, దీన్ని కూడా వ్యతిరేకించేవాళ్లు ఉంటారు… భిన్నాభిప్రాాయాలు సహజమే కదా.., అవునూ, కరాటే కల్యాణి తిరుమల కొండపై తనూజ కేక్ కటింగ్ సీన్‌ మీద ఏమైనా స్పందించిందా..? (మాధురి, తనూజ, కల్యాణి ముగ్గురూ బిగ్‌బాసిణులే)…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం హరీషుడు..! మామ పార్టీ నుంచి కత్తిరించబడుతున్నాడా..?!
  • ఒకే ఒక ఇల్లు… మడమ తిప్పని స్వాభిమాన పోరాటం… ఎవరికీ జంకేదే లేదు…
  • The Lost Map … లీలగా ఓ జ్ఞాపకం… వేల మైళ్ల వెతుకులాట…
  • వందోసారి చూస్తున్నా సరే… కఠినాత్ముడైనా సరే… కళ్లు తడుస్తాయి…
  • టీ20 కెప్టెన్‌గా ‘సర్పంచ్ సాబ్‘..! జోరుగా ప్రచారం.., జరిగితే శుభమే..!!
  • లెన్స్‌కార్ట్ బాగోతాల అసలు దోషి ఓనరే… అడుగడుగుకో అబద్ధం, వంచన…
  • ప్రజల్లోకి రీ-ఎంట్రీ..! ఈ ఒక్క సభ కోసమేనా..? ఇక ప్రజల్లోనే ఉంటాడా..?
  • బ్యాక్ టు బేసిక్స్..! పుస్తకాలు- పెన్నులు మళ్లీ…! మనమూ మారదాం..!!
  • మహిళా రిజర్వేషన్లతో డీలిమిటేషన్ లింక్… ఇదుగో క్లారిటీ…
  • తెలంగాణపై విషం కాదు తేజస్వీ… ఇదుగో మీవాడే… కిక్కుమనవేమి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions