Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎటూ మొగ్గు లేదు.., ఎవరికీ వత్తాసు లేదు – సీఎం రేవంత్ పరిణతి…

May 14, 2026 by M S R

.

బండి సాయి భగీరథ కేసు వార్తలను కీన్‌గా పరిశీలిస్తే… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిణతిని ప్రదర్శిస్తున్నట్టే అర్థమవుతుంది… తను ఏదో బండి సంజయ్‌కు వత్తాసు పలుకుతున్నాడు, తప్పిస్తున్నాడు అనే విమర్శ అబ్సర్డ్… ఎందుకో కాస్త వివరంగానే చూడాలి… ఎందుకంటే..? ఈ కేసును రచ్చ రచ్చ చేయడం వెనుక రాజకీయ కుట్రలు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి… తను జాగ్రత్తగా డీల్ చేస్తున్నాడు…

అప్పుడెప్పుడో బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరగ్గానే, చంద్రబాబు అడగ్గానే, ఏదో పాపం పోనీలే అనుకుని వైఎస్ పూర్తిగా తప్పించిన యవ్వారం కాదు ఇది… ఈ కేసులో ఓ మైనర్ అమ్మాయి జీవితం ఉంది, (మైనరా మేజరా అనే సందిగ్ధమూ ఉంది)… ఒక పోక్సో బాధితురాలిగా ఆమెకు న్యాయం జరగాలి, అదే సమయంలో నాణేనికి మరోవైపు జరుగుతున్న రాజకీయ కౌటిల్యం ఏమిటో కూడా చూడాలి…

Ads

అందుకే రేవంత్ రెడ్డి అన్నీ తవ్వి నిజం తేల్చాల్సిందిగా ఓ సిట్ వేశాడు… పోలీసులు తమ పని తాము చేస్తున్నారు… మొదట పెట్టిన సెక్షన్లకు అదనంగా కొన్ని సీరియస్ పోక్సో సెక్షన్లు యాడ్ చేశారు… అమ్మాయి వాంగ్మూలం తీసుకున్నారు… విచారణకు రావాలని భగీరథకు నోటీసులు జారీ చేశారు… ఏదీ ఆగడం లేదు… కొత్త డీజీపీకి ఇది తొలి పరీక్ష కదా, జాగ్రత్తగానే డీల్ చేస్తున్నాడు… మరిక సంజయ్‌కు రేవంత్ రెడ్డి అకారణంగా, అనైతికంగా, అనుచితంగా మద్దతునిస్తున్నది ఏముంది..? నిజంగానే భగీరథ తప్పుతేలితే ఎవరూ కాపాడేది కూడా ఏమీ ఉండదు… అలాంటి సెక్షన్లు పెట్టేశారు…

రేవంత్

నాణేనికి మరోవైపు ఏమిటంటే..? ‘ఒక సాఫ్ట్, ఒక ఫాస్ట్ కలిస్తే ఏమిటో సంజయ్‌కు రుచి తెలిసొస్తుందిలే’ అనే బీజేపీ ఇంటర్నల్ వ్యాఖ్యలు, తరువాత కొద్దిరోజులకే ఈ కేసు బయటపడటం… దీని వెనుక బీజేపీ ఇంటర్నర్ తగాదాలు, సంజయ్ మీద సొంత పార్టీలోనే కుట్రలు ఏమిటో కూడా తేలాల్సి ఉంది… అమ్మాయి కుటుంబం వెనుక ఎవరున్నారు..? ఇది పెద్ద ప్రశ్న… ఎందుకంటే..?

చాన్నాళ్లుగా భగీరథ, ఆ అమ్మాయి కలిసే తిరుగుతున్నారు… లవ్వు కావచ్చు… ఇరు కుటుంబాలకూ తెలుసు… మరెక్కడ తేడా కొట్టి ఈ పంచాయితీ రేగినట్టు..? అదీ అసలు తేలాల్సిన మిస్టరీ… ఆమె వయస్సే ఇక్కడ అసలు సమస్య… ఇక్కడ భగీరథను తీసుకొచ్చి జైలులో పారేయడం, తను బెయిల్ తెచ్చుకోవడం కాదు సమస్య… సంజయ్ వెనుక బీఆర్ఎస్, బీజేపీలోని యాంటీ సంజయ్ కూటములు ఐక్యంగా పన్నుతున్న, అమలు చేస్తున్న కార్యాచరణ ఏమిటి..? అదీ తేలాలి…

సో, రేవంత్ రెడ్డి డీల్ చేస్తున్నది సున్నితమైన లైంగిక దాడి కేసు ప్లస్ దాని వెనుక పొలిటికల్ కాన్‌స్పిరసీ కేసు… హానీట్రాప్ నిజం కాకపోవచ్చు, లైంగిక దాడీ నిజం కాకపోవచ్చు, కాకపోతే అసలు నిజం తేలాలి కదా… ఈలోపు రాజకీయ పార్టీల సోషల్ మీడియా విభాగాలు దర్యాప్తులు, విచారణలు పూర్తి చేసి, తీర్పులు చెప్పేస్తున్నాయి… అదీ అసలు సమస్య… భగీరథ యాంటిసిపేటరీ బెయిల్ విచారణ ఈరోజు ఉంది…!! కోర్టులు, పోలీసులను వాళ్ల పనిచేయండబ్బా ముందు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • TMC బండి నొగలు విరుగుతున్నయ్… ‘కర్మ’ ఎదురుతంతోంది…
  • అసలు హిట్లర్ ఎవరు..? BRS రచ్చకు శ్రీధర్‌బాబు భలే కౌంటర్…!
  • బొద్దింకలు అడిగాయని… ధర్మేంద్ర ప్రధాన్‌‌ను తప్పించడం పెద్ద పరీక్షే..!!
  • బండి ‘ఫ్లెక్సీలు’ సరే… తనను పదే పదే గోకి, గిల్లి, గిచ్చి, రక్కి రెచ్చగొట్టింది ఎవరు..?
  • మానెక్ షా … మనసున్న ఓ చిత్రమైన కేరక్టర్ … చదవాల్సిన ఓ కథ …
  • ప్రధాని మోదీ వెనుక కనిపిస్తున్నది ఏమిటి..? గేమ్ ఛేంజర్..!
  • … కుండ బద్ధలు కొట్టేయడంలో రేవంత్ రెడ్డి తరువాతే ఎవరైనా..!!
  • అబ్ ఆయేగా మజా ..! జార్ఖండ్ బరిలో సాయిరెడ్డి, పరిమళ్ అంబానీ..!!
  • సుకన్య..! పరువుకై 30 ఏళ్ల సఫల పోరాటం… మీడియాకు ఓ పాఠం..!!
  • …. అందుకే రేవంత్ రెడ్డి ప్రత్యర్థుల అంచనాలకు అందడు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions