Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పిచ్చోళ్లు… 21 శతాబ్ధం ఇంకా బేవార్సుగా ఉంటుందని ఊహించలేదు…

February 15, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. ఇరవయ్యో శతాబ్దపు రాజకీయ అరాచకాలు , పోలీసుల అసమర్ధ బానిస పనితీరులు ముగిసి 21 వ శతాబ్దంలో సరికొత్త రాజకీయ , సామాజిక పరిస్థితులు ఏర్పడాలనే సందేశంతో ముగుస్తుంది 1990 లో వచ్చిన ఈ 20వ శతాబ్దం సినిమా .

పిచ్చోళ్ళు . 21 వ శతాబ్దం ఇంకా బేవార్సుగా ఉంటుందని ఊహించలేకపోయారు . Let us pity them . Politics+ crime సినిమాలు మళయాళం వాళ్ళు బాగా తీస్తారు . ఎన్నో డబ్ చేయబడిన మళయాళ సినిమాలు తెలుగులో బాగా ఆడాయి కూడా . Irupatham Noothandam అంటే ఇరవయ్యో శతాబ్దం . ఈ మళయాళ సినిమాకు రీమేకే మన 20వ శతాబ్దం తెలుగు సినిమా .

Ads

మళయాళంలో మోహన్ లాల్ , సురేష్ గోపి , అంబిక నటించారు . మన తెలుగులో ప్రధాన పాత్రల్లో సుమన్ , దేవరాజ్ , లిజీ , సుమన్ రంగనాధన్ నటించారు . కన్నడంలోకి కూడా రీమేక్ అయింది . కన్నడంలో అంబరీష్ , సుమన్ , దేవరాజ్ , గీత నటించారు . అన్ని భాషల్లో హిట్టయింది .

పూర్వాశ్రమంలో ఓ బాధ్యత కల పౌరుడు పరిస్థితుల ప్రభావంతో ఓ క్రిమినల్ చేతిలో పడతాడు . ఆ క్రిమినల్ ముఖ్యమంత్రి కొడుకు కూడా . మంచి స్నేహితులు కూడా అవుతారు . సుమన్ , దేవరాజ్ ఈ రెండు పాత్రలను వేసారు . కలిసి చాలా చట్ట వ్యతిరేక పనులు చేస్తారు .

దొంగ మందుల తయారీ విషయంలో సైధ్ధాంతిక భేదాలు వచ్చి విడిపోతారు . క్రమక్రమంగా బద్ధ శత్రువులు అవుతారు . క్లైమాక్సులో తండ్రినే లేపేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిధ్ధం అవుతాడు . ఈలోపు సుమన్ ముఖ్యమంత్రి ప్రాణాలను కాపాడి దేవరాజుని చంపేస్తాడు .

ఇరవయ్యో శతాబ్దపు ఈ సినిమాలో 21 వ శతాబ్దపు అరాచకాలు చాలా కనిపిస్తాయి . జాతి , జాతి , నా జాతి అని గగ్గోలు పెట్టే ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఉంది . పుత్ర వాత్సల్యంతో ధృతరాష్ట్ర పాలన సాగించే ముఖ్యమంత్రి కనిపిస్తాడు . ముఖ్యమంత్రికి డూడూ బసవన్నలాగా తలూపే IG of Police కనిపిస్తాడు . కాకపోతే ఆ శతాబ్దంలో మీడియాని లేపేసే వాళ్ళు . ఈ శతాబ్దంలో మీడియాని కార్పొరేట్ల ద్వారా లొంగదీసుకుంటున్నారు . పదవులను ఇస్తున్నారు . ఎకరం పావలాకో రూపాయికో సంతర్పణ చేస్తున్నారు .

మంచి ఏక్షన్ , రాజకీయ , క్రైం సినిమా . సుమన్ , దేవరాజ్ ఇద్దరూ చాలా బాగా నటించారు . జర్నలిస్టుగా లిజీ , సుమన్ ప్రేయసిగా కన్నడ నటి , మోడల్ సుమన్ రంగనాధన్ కూడా బాగా నటించారు . ఇతర పాత్రల్లో కోకా రాఘవరావు , బాబూ మోహన్ , గోపి , డబ్బింగ్ జానకి తదితరులు నటించారు .

జె వి రాఘవులు సంగీత దర్శకత్వంలో పాటలు బాగుంటాయి . వేటూరి , సిరివెన్నెల వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ శ్రావ్యంగా పాడారు . ముఖ్యంగా అమ్మను మించిన దైవమున్నదా , ఆత్మను మించి అర్థం ఉన్నదా పాట చాలా బాగుంటుంది .

సుమన్ రంగనాధన్ , సుమన్ డ్యూయెట్ నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం చాలా బాగా చిత్రీకరించబడింది . టైటిల్ సాంగ్ ఇరవయ్యో శతాబ్దం ఇది ఇరవయ్యో శతాబ్దం కూడా బాగుంటుంది . సుమన్ పాత్ర పాడే కాలిన మనసుతో అంటూ సాగే పాట కూడా బాగుంటుంది .

సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనివారు చూడవచ్చు . బాగుంటుంది . నేను పరిచయం చేస్తున్న 1238 వ సినిమా…. #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘బ్రదర్ కొంత కరెంటు సర్దుతావా..? వచ్చే నెలలో తిరిగి ఇచ్చేస్తా…’’
  • రెడ్ బుక్ సరే… పింక్ బుక్ సరే… అసలు ఈ బ్లూ బుక్ ఏమిటో తెలుసా..?
  • ట్రోలర్‌కు చెప్పుతో కొట్టినట్టు కౌంటర్… మీకు బూమ్రా-సంజనా కథ తెలుసా…
  • కేటీఆర్ ఇలా ట్వీటాడో లేదో… కవిత నుంచి కౌంటర్ పడింది…
  • త్రిష మళ్లీ హర్టయింది..! సీత మాజీ భర్తకు స్ట్రాంగ్ కౌంటర్ ..!
  • అసలే జలపాతం చలి… కేవలం బికినీ… అప్పటి క్రేజీ లిరిల్ యాడ్ కథ…
  • హోరెత్తిన ఇండియా..! మురిపెంగా T20 వరల్డ్ కప్ ముద్దాడిన ఈ క్షణం..!!
  • అమెరికా తాజా ప్రేలాపనలకు విదేశాంగ మంత్రి జైశంకర్ జవాబు…
  • సూర్యకుమార్ కెప్టెన్సీ వైఫల్యాలు కాటేయకపోతే… గెలుపు మనదే…
  • అరవయ్యేళ్ల ఆ మహిళ ఎవరామె..? కాస్త సీరియస్‌గా చదవండి…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions