టీడీపీ కమ్మోళ్ల పార్టీ… వైసీపీ రెడ్డీల పార్టీ… ఇలా వాళ్లను వీళ్లు, వీళ్లను వాళ్లు తిట్టిపోసుకుంటారు… ఆడిపోసుకుంటారు… తటస్థంగా చూస్తే నిజానికి దొందూ దొందే… ఆ ముద్ర చెరుపుకోవటానికి కూడా ప్రయత్నించరు… పైగా మరింత చిక్కగా, నిక్కచ్చిగా అమలు చేస్తారు… ప్రత్యేకించి వైసీపీ… అతి విశ్వాసంతో అత్యంత అనుకూల వాతావరణాన్ని చెడగొట్టుకున్నది 2014లో… మరి ఇప్పుడు..? పాదయాత్ర ద్వారా వచ్చిన ఆదరణ, చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేకతతో సమకూరిన ఇంకాస్త బలం, కేసీయార్ వంటి పొరుగు శక్తుల సాయం, మార్పు కోరుతున్న జనం… ఇన్ని అనుకూలతల్ని లాఘవంగా ఉపయోగించుకోవాల్సిన సందర్భం, అవకాశం… కానీ సేమ్, 2014 లాగే ఉంటాం, మేం మారబోం, మారలేం అంటున్నట్టుగా ఉన్నది పార్టీ నిర్ణయాల తీరు… ఒక్కొక్క నియోజకవర్గానికి అభ్యర్థి ఎంపిక అనేది నానా సమీకరణాల కలయిక, వ్యూహం, అదో యుద్ధతంత్రం… కానీ ఆ మెలకువ, ఆ దిద్దుబాటు, ఆ స్వీయసమీక్ష లోపించాయి… ఉదాహరణకు అనంతపురం జిల్లా వైసీపీ రాజకీయాలే… ఈ జిల్లాలో సాగుతున్న అభ్యర్థుల (ప్రస్తుతానికి నియోజకవర్గ ఇన్‌ఛార్జులు) ఎంపిక తీరు పార్టీ ఏమీ మారడం లేదనే చేదునిజాన్ని బహిర్గతం చేస్తున్నది… ఈమధ్య ఆంధ్రప్రభలో ఓ వార్త వచ్చింది… అది వైసీపీ పోకడల్ని నిజాయితీగా, నిష్పక్షపాతంగానే విశ్లేషించినట్టుగా ఉంది…

చూశారుగా… అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే… పదకొండు మంది రెడ్డీలే… అరెరె, జొన్నలగడ్డ పద్మావతి, ఉషశ్రీ రెడ్డీలు కాదు కదా అంటారా..? రెడ్డింట మెట్టినవాళ్లే… అవీ రెడ్డి దర్బార్లే… ఒకరు కురుబ, ఒకరు ఎస్సీ… వీరిలో కాపు రాంచంద్రారెడ్డి రెడ్డి కాదు, లింగాయత్… కానీ అదీ రెడ్డి నేపథ్యం ఉన్న ఫ్యామిలీయే… పోయిన ఎన్నికల్లో ఇలా ‘వ్యూహరాహిత్యంతో’ వ్యవహరించడం వల్ల ఫలితం తెలుసు కదా… అత్యంత కీలకమైన ఈ సీమ జిల్లాలో 12 టీడీపీ గెలిచింది, 2 వైసీపీ గెలిచింది… ఉన్న రెండు ఎంపీ స్థానాలూ గోవిందా… 55- 60 శాతం దాకా బీసీలు ఉన్న జిల్లాలో వైసీపీ నిజంగానే బీసీలకు ప్రాధాన్యం ఎందుకు ఇవ్వడం లేదు..? ఇప్పుడు వైసీపీ అభిమానుల్లోనే ఇదో ప్రశ్న… విచిత్రం ఏమిటంటే… పార్టీ ఎవరి సలహాలూ, సూచనల్నీ పట్టించుకోదు… అదీ అసలు సమస్య… ఇటు సాక్షి, అటు వైసీపీ సేమ్ టు సేమ్…
జిల్లాలో అసలు కులసమీకరణాల్ని, సామాజిక కూర్పును పార్టీ ఎందుకు పట్టించుకోదు..? హిందూపురంలో ఏనాటి నుంచో పార్టీ వర్క్ చేసుకుంటున్న ఓ కాపు నేత నవీన్‌ను తప్పించి ఓ ముస్లింకు టికెట్టు ఇస్తారట… ముస్లింలకు టికెట్టు ఇవ్వాలి కానీ అది వేరేచోట అడ్జస్ట్ చేయాలి… ఒక్క కాపే కాదు, జిల్లాలో బలమైన బీసీ వర్గాలు బోయ, చేనేత, వడ్డెరలకు ఏం చెప్పదలుచుకుంది పార్టీ..? పోనీలే, అనంతపురం ఎంపీ సీటును బోయ కులస్థుడు రంగయ్యకు ఇస్తారట లెండి అనుకుంటే ఆయన కాస్తా నాన్ లోకల్… కర్నూలుకు చెందినవాడు… మా జిల్లా బోయల్లో ఒక్కరూ కనిపించడం లేదా అనే ప్రశ్న ఎదుట నిలబడుతున్నది… పెనుగొండ అభ్యర్థిత్వానికి ఆలోచిస్తున్న బీసీ కూడా ఓ స్ట్రాటజిక్ లోపం… అక్కడా లోకల్, నాన్ లోకల్ గొడవ… మడకశిరలో ఎలాగూ తిప్పేస్వామికి ఇవ్వక తప్పదు… అది వదిలేస్తే శింగనమలలో మాల, మాదిగ కాన్‌ఫ్లిక్ట్… టీడీపీ పట్ల అభిమానంగా ఉండే మాదిగ వర్గాన్ని చీల్చే ఎత్తుగడ గాకుండా వైసీపీతో బాగుండే మాల వర్గానికే ప్రాధాన్యం… (ఇది డిబేటబుల్)… ఆల్‌రెడీ కల్యాణదుర్గంలో కురుబ అనుకుంటూ, మళ్లీ పెనుగొండలో కురుబకు టికెట్టు దేనికి..? కొన్ని బలమైన బీసీ కులాలకేమో అసలు ఏమీ ఇవ్వరు, ఇస్తే రెండు టికెట్లూ ఒకే కులానికా..?
ఆగండి ఆగండి… ఇవేమైనా కులాల వారీ కోటాలా అని విసుక్కోకండి… అచ్చంగా ఏపీ రాజకీయాలు కులరాజకీయాలే… ఏపీ రాజకీయాల్లో కులానిదే బలం… అది రియాలిటీ… మరి టీడీపీ కూడా అంతే కదా… అదేమైనా శుద్ధపూసా..? తను చేస్తున్నదీ అదే కదా అనేది ఓ ప్రశ్న… నిజమే… అక్షరాలా నిజం… అనంతపురం ప్రభాకర చౌదరి, కల్యాణదుర్గం హనుమంతరాయచౌదరి, ధర్మవరం గొనుగుంట్ల సూర్యనారాయణ, హిందూపురం బాలకృష్ణ, పెనుగొండ పరిటాల సునీత, ఉరవకొండ పయ్యావుల కేశవ్…. అంతా కమ్మోళ్లే… వైసీపీని మీది రెడ్ల పార్టీ, మీది కులపార్టీ అని వెక్కిరించే నైతికస్థాయి దానికి లేదు… కానీ వాళ్లుపోగా మిగిలిన టికెట్లకు జాగ్రత్తగా జిల్లాలోని బలమైన బీసీల్ని ఎంచుకుంటుంది… మాది బీసీల పార్టీ తెలుసా అని గప్పాలు కొడుతుంది… నిజానికి దొందూ దొందే… బీసీలకు ఇచ్చేది 3 అసెంబ్లీ, ఒక ఎంపీ సీటు… అంతే… అయితే వైసీపీ దాన్ని బ్రేక్ చేయలేకపోతున్నది… ఎక్కువ జనాభా ఉన్న బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా టీడీపీ నుంచి బీసీలను మరల్చుకోవాలనే సోయి లేకుండా పోయింది దీనికి… ఎంతసేపూ మా రెడ్లు, మా రెడ్లు… (ఎన్నికల్లో జాగ్రత్తగా పన్నే వ్యూహాలే గెలిపించేవి, ఓడించేవి)…
తాడిపత్రిలో జేసీల దాష్టీకాలకు దీటుగా నిలబడుతున్నది ఒక పెద్దా రెడ్డియే… కానీ మళ్లీ ధర్మవరం వచ్చేసరికి వాళ్ల కుటుంబానికే చెందిన మరో రెడ్డి… ఇదేనా..? ఇటువైపు చూస్తే గుంతకల్లు, ఉరవకొండ, మంత్రాలయం, ఆదోని… నలుగురూ అన్నదమ్ములే… అంటే వైసీపీ కులాన్నే కాదు, కుటుంబాన్నీ దాటలేకపోతున్నది… మరిక టీడీపీకి భిన్నమైన తంత్రాన్ని, పోరాటాన్ని ఏం కనబరుస్తున్నట్టు..? ముందే చెప్పినట్టుగా ఈ జిల్లాలో అభ్యర్థుల ఎంపిక తీరు అనేది కేవలం పార్టీ పోకడలకు ఓ ఉదాహరణ… సో, 2014 రోజుల్ని దాటేసి మేం రాదల్చుకోలేదు, పాఠాల్ని నేర్చుకోదల్చుకోలేదు, మా పార్టీ మా ఇష్టం అనే పక్షంలో ఇక ఎవరైనా అనేదేమీ ఉండదు… కానీ, తరువాత తరువాత ఆకులు పట్టుకునే స్థితి రాకుండా చూసుకోవయ్యా బాబూ అని ఓ సలహా ఇస్తారు… అంతే…
Mallesh says
జగన్ = భస్మాసుర
Ram says
అంతా నాఇష్టం అనకుంటే.. అదహ్ పాతాళమే
కృష్ణ says
రెడ్లకు చివరిన రెడ్డి అని ఉంటుంది. కానీ చౌదరిలకి చివరన చౌదరి అని తక్కువ మంది పెట్టుకొంటారు. అందుకే వాళ్ల గురించి తక్కువ మందికి వాళ్ళు చౌదరి అని తెలియదు. ఇంటి పేరు తెలిస్తే అర్థం అవుతుంది. అక్కినేని, నందమూరి, దగ్గుబాటి, కటంనేని, కేశినేని, రాసినేని, తమ్మినేని, రావూరి, పిన్నమనేని, రాయపాటి, కొర్రపాటి, పావులూరి అని ఉంటాయి. జనరల్ గా ఈస్ట్,వెస్ట్, కృష్ణ, గుంటూరు నుండి ఈ విధంగా ఇంటిపేర్లు ఉంటాయి. చిత్తూర్ కమ్మ వాళ్ళకి గల్లా, వలేరు, నారా అని ఉంటాయి. కమ్మ వాళ్ళకి ఐక్యత ఎక్కువ. తప్పు ఏముంది. తమ సామాజిక వర్గం లో ఆర్ధికంగా వెనుక బడిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మంచాల గారికి కమ్మ వాళ్ళు నచ్చక పోతే ఏమి చేయగలం.
నాగేస్పర్రావు says
ఇంతకీ మీరు కమ్మేస్పరా? కాపేస్పరా?
కేతినేని లొకేశ్వర says
వాళ్ళ మారరు బిసిలకు బుద్ధి రాదు
Vijay says
You made a very valid point…but show who can fight JC other than Pedda Reddy and one thing for sure Jagan does not want to change candidates for sake of it….these people are with him in thick of times….and has to consider their candidature this time.
Avlnrao says
Kanaru,vinsru murkulu pogalmu dapurinchnan