ఆలీకి నోటి దూట ఎక్కువనేది అందరికీ తెలిసిందే… యాంకర్ల మీద, సినీతారల మీద వేదికలపైనే బూతు కామెంట్లు చేసి చీవాట్లు తిన్న చరిత్ర కూడా ఉంది… సీనియర్ కాబట్టి ఏమీ అనలేక ఎదవ కామెంట్లు అనుకుంటూ లోలోపల తిట్టుకునేవారి సంఖ్య కూడా బోలెడు… ఐనా సరే గుణం మారలేదు… నాలుక మీద మొత్తం కంట్రోల్ తప్పిపోయినట్టున్నాడు… (సరే, కొన్నిసార్లు ఆ విధంగానైనా కొన్ని నిజాలు బయటకు వస్తుండటం బెటరే అనుకొండి)
విషయానికొస్తే… పవన్ కల్యాణ్ ఆంతరంగికుల్లో ఆలీ కూడా ఒకడు… తన సినిమాల్లో తప్పక ఉండాల్సిందే… మొన్నటికి మొన్న సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లోనూ ఆలీ పట్ల పవన్ చాలా స్నేహధోరణితో మాట్లాడాడు… ఆలీ అంటే ఆలీయే, ఆలీ లేకపోతే నా సినిమా ఎలా ఉంటుందీ అన్నతరహాలో ప్రసంగించాడు…
కానీ అలాంటి పవన్ నే ఇబ్బంది పెట్టే కామెంట్లతో, జనంలోని నెగెటివ్ గా వెళ్లేలా… ఆలీ తన నోటి దూలతో ఏవేవో మాట్లాడాడు…
పవర్ స్టార్ దర్శకత్వంలో వచ్చిన జానీ దారుణంగా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో పవన్ దర్శకత్వానికి దూరంగా ఉంటున్నాడు. కానీ తనలో దర్శకత్వం కోరిక చావలేదని, అందుకే బాబి వంటి చిన్న దర్శకుడికి సర్దార్ వంటి పెద్ద ప్రాజెక్టు అప్పగించి తన కోరిక తీర్చుకున్నాడు… అని అందరూ అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు…
ఇదుగో ఈ అర్థాలొచ్చేలా ఆలీ ప్రసంగం సాగింది…
అంటే… పేరుకు బాబీ దర్శకుడు గానీ అసలు దర్శకత్వమంతా పవన్ దే అన్నట్టా? జానీ ఫెయిలైంది కాబట్టి దీని పనీ అంతే అన్నట్టా? ఫెయిలైనా, పాసయినా బాబిని మాత్రం ఏమీ అనొద్దు సుమా, తనకు ఏమీ తెలియదు అని చెబుతున్నట్టా? ఈ మాటలతో రూమర్లకు చెక్ పెట్టాలనుకున్నట్టా? లేక అందరికీ తెలియదేమో ఈ రూమర్ వినండి మీరూ ఒకసారి అని చెబుతున్నట్టా?
ఈ జానపదం స్టయిల్ సినిమాకు అధికారికంగానే పవన్ కల్యాణ్ సొంతంగా కథ, స్క్రీన్ ప్లే సమకూర్చాడు… అయినా కథ ఏముంది లెండి… చాలా చిన్నపిల్లల పుస్తకాల్లో ఉన్న కథలే అవి… స్క్రీన్ ప్లే పై బహుశా దృష్టి పెట్టి ఉంటాడు. తన ఇమేజీ కూడా పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తగా ఫ్రేమ్ చేసి ఉంటాడు… అలాగే తన లెవల్ తగ్గకుండా ఉండాలి, పైగా రాజకీయాల్లోకి ఎంటర్ కాబోయే కీలకమైన స్టేజ్ లో వస్తున్న సినిమా కాబట్టి, ఎక్కడా ఏ తేడా రాకుండా తన పాత అలవాటుకొద్దీ దర్శకత్వం సహా అన్నింట్లో వేలు పెట్టి ఉంటాడు…., ఇవన్నీ తెర వెనుక వ్యవహారాలు… ఏవేవో రూమర్స్ వస్తుంటాయి… కానీ ఆలీ లాంటి పవన్ ఆంతరంగికులు కూడా ఆ రూమర్స్ వేదికపై నుంచి వినిపించి మరీ అందరికీ చేరేలా మరింత వ్యాప్తి చేయడం అవసరమా? అందుకే… ఆలీ నోటి దూలకు టాలీవుడ్లోనే ప్రసిద్ధి అనే తన పేరుకు మళ్లీ న్యాయం చేశాడన్నమాట…