Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

header-new-unit-muchata.com
  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొవ్వెక్కిన కోపం… కోపమెక్కిన రోగం… రోగమెక్కిన మంచం… మంచమెక్కిన..??

December 15, 2020 by M S R

ఎంత కొవ్వుకు అంత కోపం!
————————

“శేషం కోపేన పూరయేత్”
అని సంస్కృతంలో ఒక గొప్ప మాట. ఒక సమస్యనో, చర్చనో, వివాదాన్నో తుదిదాకా ఓపికగా హ్యాండిల్ చేయడం చేతకానివారు మధ్యలోనే కోప్పడి- ఆ కోపంతోనే ఆ శేషాన్ని పూరించినట్లు అనుకుంటారట. సాధారణంగా పేదవాడి కోపం పెదవికి చేటు. పెద్దవారి కోపం పెదవికి చేటు కాదు అని దీనికి అర్థం మనం గ్రహిస్తే- సామెత కాదనదు. తెలుగులో కోపతాపాలు విడదీయడానికి వీల్లేని ద్వంద్వ సమాసం. కోపం వల్ల ఉచ్వాస నిశ్వాసాలు వేడెక్కుతాయి. అందువల్ల కోపంతో పుట్టే వేడిగా దాన్ని భాష గుర్తించింది. ఆ వేడిలో మెదడు ఉద్రేకానికి గురవుతుంది. ఆ ఉద్రేకంలో బుద్ధి విచక్షణ కోల్పోతుంది. ఆ నిర్విచక్షణలో ఏదయినా జరగవచ్చు. విపరీతమయిన కోపంలో ఊపిరి ఎక్కువగా వెంట వెంటనే తీసుకోవాల్సి వస్తుంది. ఆ కోపానికి తగినస్థాయిలో గట్టిగా అరవాల్సి ఉంటుంది. దాంతో గొంతు బొంగురు పోతుంది. కోపంలో నరాలన్నీ బిగుసుపోవాలి. దాంతో రక్త ప్రసరణ ఎక్కువ అవసరమవుతుంది. కొందరు కోప్పడి కోప్పడి ఆయుష్షు తమకు తాముగా తగ్గించుకుంటూ ఉంటారు.

కొందరు స్వభావరీత్యా కోపిష్ఠులు. కొందరు పరిస్థితులవల్ల కోపాన్ని ఇష్టంగా పెంచి పోషించుకుంటూ కోపిష్ఠుల లిస్టులో చేరతారు. కొందరు అకారణంగా కోప్పడతారు. కొందరు సకారణంగా కోప్పడతారు. రాముడి గురించి వాల్మీకి చెప్పిన పదహారు గుణాల్లో- “జిత క్రోధో” కోపాన్ని జయించినవాడు- ప్రధానమయినది. మహాత్ముల కోపం రెప్పపాటులో మాయమవుతుందట. మనం మహాత్ములు కాదు కాబట్టి కన్నుమూసేవరకు కోపాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం.

స్వభావ రీత్యా కోపం, పరిస్థితుల వల్ల కోపం సంగతేమో కానీ- ఇప్పుడు తిన్నది అరగక కొవ్వు పెరిగి పెరిగి దానివల్ల కోపతాపాలు బాగా పెరిగిపోతున్నాయట. కొవ్వుకు- కోపానికి అంతర్గతంగా సంబంధం ఉన్నట్లుంది. తిన్నది అరగక కొవ్వు పేరుకుని పేరుకుని అది కోపంగా పరిణమిస్తోంది అని అనుకోవచ్చు. ఈ సూత్రం ప్రకారం సన్నగా రివటలా, ఎండు పుల్లలా ఉన్నవారికి అసలు కోపమే ఉండకూడదు!

పాశ్చాత్య జీవన విధానం, బాగా ప్రాసెస్ చేసి దాచిన ప్యాక్డ్ ఆహారం తింటున్నవారు, రోజులో అసలు వ్యాయామం, శారీరక శ్రమ లేనివారు కొవ్వు పేరుకుని కొండలుగా ఎదుగుతున్నారట. చివరకు కోపిష్ఠులుగా మారుతున్నారట.

“తన కోపమే తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన ధుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ !”

అని ఇదివరకు ఒకటి రెండు తరగతుల్లో నీతి శతక పద్యం తప్పనిసరిగా నేర్పించేవారు- పెద్దయ్యాక ఉపయోగపడుతుందని.

ఎంత చెట్టుకు అంత గాలి!
ఎంత కొవ్వుకు అంత కోపం!

  • పమిడికాల్వ మధుసూదన్

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • మాలావత్ పూర్ణ, వారణాసి మానస… దేత్తడి హారిక ఏరకంగా బెటర్ ఎంపిక..?!
  • ఓహ్… ఏదో అనుకుంటిమి… ఈయన 24 క్యారెట్ల బంగారం ఏమీ కాదన్నమాట…
  • ఏది రీతి..? ఏది రోత..? ఈనాడు రాతలకు సాక్షి ఫస్ట్ పేజీలో బ్యానర్‌ తిట్టిపోతలు..!!
  • భయంసా..! పుండు మీద మందు మరిస్తే… రాచపుండుగా మారింది..!!
  • ఔను, నిజమే… ఈ డిస్కో డాన్సర్ ఒకప్పుడు తుపాకీ పట్టిన నక్సలైటే…!
  • హీరో వెంకటేష్ పెద్ద బిడ్డ…! ప్రేక్షకులకు ఏదో చెప్పాలనుందట…!
  • ఇక అందరినీ బాలయ్య ఆవహించేస్తున్నాడు… చూశావా సంచయితా..?
  • మరో కార్తీకదీపం..! కథ కాదు, చేదు నిజం… టీవీ కథను మించిన ట్విస్టులు…
  • వుమెన్స్ డే..? ఓ నిజ స్ఫూర్తి కథనం ఇదుగో… ‘‘అంతిమ మిత్రురాలు..!!
  • జెమినిలో జూనియర్..! ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ హోస్టింగు తప్పా..? ఒప్పా..?!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now