Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నమ్మ అప్పు… మళ్లీ మళ్లీ గుర్తొస్తాడు… 3 కోట్ల వ్యూస్‌తో కృపాల్ ఫుడ్ వీడియో…

January 24, 2023 by M S R

అనుకోకుండా 3 కోట్ల వ్యూస్ ఉన్న ఒక ఫుడ్ వీడియో చూడబడ్డాను… జస్ట్ రెండేళ్లలో… కృపాల్ అమన్న తెలుసు కదా… వెరీ ఫేమస్ ఫుడ్ వ్లాగర్… మన గుండు నగల వ్యాపారిలాగే ఇతనూ గుండుతోనే కనిపిస్తాడు… ఎక్కువగా కర్నాటక రెస్టారెంట్ల పరిచయం చేస్తుంటాడు… అదుగో ఆయన వీడియో ఇది… 3 కోట్లు అనే అంకె ఒకటి ఆశ్చర్యపరిస్తే… అప్పటి స్టార్ హీరో నమ్మ అప్పు పునీత్ రాజకుమార్ ఒక దగ్గరి స్నేహితుడిలా తనతో కలిసి, అనేక విషయాల్ని ముచ్చటిస్తూ భోంచేయడం… ప్లజెంట్‌గా అనిపించింది…

రియల్లీ… మరోసారి పునీత్ గుర్తొచ్చి కలుక్కుమంది… వెరీ డిఫరెంట్ కేరక్టర్… అరగంట వీడియో చూస్తే ఒక్కచోట కూడా, వీసమెత్తు ఇగో కనిపించలేదు… దిగువన వీడియో లింక్ ఇచ్చాను… ఇంగ్లిష్‌లోనే సాగుతుంది సంభాషణ కాబట్టి సరదాగా చూసేయొచ్చు… ఇది తన హిట్ మూవీ యువరత్న సినిమాకు ముందు వీడియో… ఎందుకు నచ్చిందీ అంటే, ఇందుకోసం అని వివరంగా చెప్పలేం… నచ్చుతుంది… అంతే…

వెజిటేరియన్ మీల్స్.., తన దర్శకుడు సంతోష్‌తో కలిసి కృపాల్‌‌కు చాలాసేపు టైమ్ ఇచ్చాడు… ‘‘ప్రతి 50 కిలోమీటర్లకు ఆహార సంస్కృతి వేరుగా ఉంటుంది… అన్నీ ఆస్వాదించాలి… మా ఇంట్లో కర్నాటకలోని అన్ని ప్రాంతాల డిషెస్ చేస్తారు… నేను ఫుడ్ లవర్… తినడమే, నోరు కట్టేసుకోవడం తెలియదు… కాకపోతే అదంతా అరగడానికి ఇంకాస్త ఎక్కువసేపు జిమ్ చేయాలి… ఉలవచారు అంటే తెగ ఇష్టం… వీక్లీ త్రీ డేస్ వెజ్… నేనూ వండగలను…’’ అంటూ తన అభిరుచులు గట్రా వివరంగా షేర్ చేసుకున్నాడు… అసలు అది కాదు, తను మాట్లాడే తీరు, చూపించే సంస్కారం, ఇగో లేని సంభాషణ నచ్చుతాయి…

namma appu

నెవ్వర్… కర్నాటకలోనే కాదు, మన టాలీవుడ్‌లో కూడా ఇలా ఈజీగా కలిసిపోయే హీరోను చూడం… పెద్ద హీరోల మాట అటుంచితే అసలు చిన్న హీరోలు, నటులు, సెలబ్రిటీలే పెద్ద ఫోజులు కొడతారు, గీర… బహుశా ఈ ధోరణితోనే కావచ్చు, అందరికీ ఇష్టుడయ్యాడు తను… అందుకే తనను దేవుడు త్వరగా తీసుకుపోయాడేమో…

ఈ భోజనం కూడా చాలా మామూలు భోజనం… జొన్న రొట్టెలు, కూర, కాస్త అన్నం, రెండు కూరలు, సాంబార్, రసం, పెరుగు, మజ్జిగ, ఒకటోరెండో స్వీట్లు… ఈ వీడియోలో పునీత్ ఓ ప్రశ్న వేస్తాడు… ఇంతగా ఫుడ్ తీసుకుంటారు కదా, వెయిట్ పెరగకుండా ఏం చేస్తారు..? దీనికి కృపాల్ చెప్పిన రెండుమూడు విషయాలు కూడా ఇంట్రస్టింగ్… ‘‘నేను నా వృత్తిలో భాగంగా అనేక రెస్టారెంట్లు వెళ్తాను, అనేక డిషెస్, వెజ్, నాన్‌-వెజ్ టేస్ట్ చేస్తాను… ఎంత తిన్నా సరే, భోజనం తరువాత కూడా నాలో ఆకలి అలాగే ఉంటుంది… ఉండేలా చూసుకుంటాను… intermittent fasting… అంటే రోజులో 16 గంటలు ఏమీ తినను…

ఇప్పుడు ఈ పేరుతో పిలుచుకుంటున్నాం గానీ మన పూర్వీకులు ఎప్పటి నుంచో చెబుతున్నదే… సాయంత్రం ఆరు దాటితే తిననిచ్చేవాళ్లు కాదు… అంటే మనం తిన్నది తాపీగా ఒంటబట్టడం కోసం… (నిజమే, ఇప్పుడు సుగర్, బీపీ, ఒబేస్ ఇష్యూస్ ఉన్నవాళ్లు కొందరు దీన్నే పాటిస్తున్నారు… మంచి రిజల్ట్ ఉందనీ చెబుతారు)… 3 కోట్ల వ్యూస్ ఉండటం బహుశా పునీత్ రాజకుమార్ వీడియో కాబట్టి కావచ్చు… కానీ కృపాల్ ఫుడ్ వీడియోలు కొన్ని కోటిన్నర, రెండు కోట్ల వరకూ వ్యూస్ ఉంటాయి… అమేజింగ్… సో, ఈ వీడియో గురించి చెబుతూ పునీత్‌ను ఓసారి స్మరించుకున్నాం… గుడ్…

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం… లోకేష్ కూడా అదే బ్లడ్డు, అదే బ్రీడు కదా… ఆ గూటి పక్షికి ఆ కూతలే కదా..?!
  • నువ్వు చాలా దిల్‌దార్… గ్రేటే కానీ, మరి తెలంగాణ నీటిప్రయోజనాల మాటేంటి..?
  • ఝలక్కులు కావు… ఇదుగో మజ్లిస్ జిల్లాల్లో పోటీకి తొలిదఫాలో గుర్తించిన సీట్లు…
  • ఆధునిక సినిమా ద్వేషి రంగనాయకమ్మకూ నచ్చిన శంకరాభరణం..!
  • ‘‘ఆర్టిస్టులను గౌరవిద్దాం సరే… ప్రజల మనోభావాలను వాళ్లూ గౌరవించాలి కదా…’’
  • సహస్ర శిరచ్ఛేద ‘అహిలావతి’ కథ… రాక్షసరాజును పెళ్లాడిన ప్రజ్ఞా యోధ…
  • స్టెప్ మోషన్‌లో… ఒక్కొక్కరినీ పరిశీలిస్తూ ‘కవర్’ చేయాల్సి వచ్చింది…
  • అది ఖచ్చితంగా గూఢచర్య పరికరమే… అన్ని దేశాలపైనా చైనా నిఘా కన్ను…
  • ముంబైలో వాణిని తొక్కేసింది లత, ఆశ… అసలే సౌతిండియన్, పైగా మెరిటోరియస్…
  • సుప్రీం చెప్పినా కదలని కేసీయార్ సర్కారు…! తొండి ఆట- మొండిచేయి…!!

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions