Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తనను చూడడానికి విరగబడేవాళ్లను చూస్తూ షకీలా ఎందుకేడ్చింది..?

January 30, 2021 by M S R

…….. By….. Gottimukkala Kamalakar………………… వర్మ శ్రద్ధగా చదివి, ఫెళ్లుమని నవ్విన పచ్చి జ్ఞాపకం అలాగే ఉంది… రెండేళ్ల క్రితం నాటి పోస్టు ఇది…. కళారంగంలోకి వచ్చిన, రావాలనుకుంటున్న ఏ మహిళకైనా మగపురుషపుంగవుల నుండి అసంఖ్యాకంగా అభ్యర్ధనలూ; వేడుకోళ్లూ; బెదిరింపులూ; ప్రలోభాలూ రాజకీయ నాయకుల వాగ్దానాలకు మించి వస్తూనే ఉంటాయి. మియా మల్కోవా అందుకు మినహాయింపేం కాదు. ఆమెని శారీరకంగా వాడుకుని, అమ్ముకుని తన వాటా న్యాయంగా పంచిన శృంగార పరిశ్రమ నిజాయితీ ముందు; ఆమె అంతరంగాన్ని తాత్వికంగా ఆవిష్కరిస్తున్నానంటూ కొన్ని ఓషో మాటలు; కొన్ని చెలం మాటలూ; Francisco D Anconica speech on సంభోగం..; ఇంకొన్ని Paulo Coelho రాసిన eleven minutes నమిలి మింగి వర్మ విసర్జించిన వరాహ అశుద్ధం సూర్యుడి ముందు మిణుగురు…

rgv mia

అనేకానేక బహిరంగ హేళనలకూ,రహస్య స్ఖలనాలకూ కారణభూతురాలైన షకీలా, సారధీ స్టూడియోలో తనను చూడడానికి విరగబడుతున్న పురుషోత్తములను చూస్తూ “వీళ్లల్లో ఒక్కరైనా నన్ను పెళ్లి చేసుకుంటే, ఈ క్షణం సినిమాలు మానేసి, వాడితో నా ఆఖరి శ్వాస వరకూ సంసారం చేస్తా”నని భోరుమంటూ ఏడ్చిందని ఆ సినిమా దర్శకుడు తడిబారిన కళ్లతో చెప్పి నా మనసు తడి చేసాడు..! ఖర్మేంటంటే పురుషుడి భౌతిక అవసరాలు; మహిళల మానసిక అవసరాలకు విలోమానుపాతంలో ఉంటాయి. దీన్ని సమతుల్యం చేయడానికే వివాహ వ్యవస్థ అవసరం సమాజానికి ఉందేమో.

” నేను కాబట్టి మీతో సంసారం చేస్తున్నా..!” అంటూ భార్యలూ; “ఎంత ధైర్యంగా బయటికి చెప్పగలిగిందో..?” అని హాచ్చెర్యఫోథూ మొగుళ్లూ… జీలకర్రా,బెల్లంలా కలిశారు కాబట్టి కిచకిచలాడుకుంటూ & కీచులాడుకుంటూ బతికేస్తారు.
కాజల్ ను ఓవారం పంపు స్వామీ, నేను కొండమీదికి కాలినడకన వస్తా; తమన్నాతో తమకం తీరితే తలనీలాలిస్తా & ఇరినా షేక్ తో ఓ రెండ్రోజులు గడిపే ఛాన్సీ సావేఁ…! ఇరుముడి కట్టుకుంటా..! అంటూ పిచ్చిమొక్కులు మొక్కేవాళ్లు, నిజంగా దేవుడు వాళ్లని పంపితే, ఓ గంట తర్వాత ” మా అబ్బాయికి డాక్టర్ అప్పాయింట్మెంట్ ఉందండీ..!” అంటూ పారిపోతారు.
Free spirit గల స్త్రీతో కలకాలం బతికే దమ్ము మా మగాళ్లకు లేదు, రాదు. మనుచరిత్ర నుండి మైదానం దాకా అల్లసాని వారూ, గుడిపాటి వారు నెత్తీనోరూ కొట్టుకుంటూ చెప్పిందదే…!
లైంగిక సంబంధాలకి, మగవాడికి బారెడు స్థలం దొరికితే చాలు. కానీ స్త్రీకి బలమైన కారణం కావాలి.
స్త్రీ పిల్లలకోసం భర్తను ప్రేమిస్తుంది & పురుషుడు భార్య కోసం పిల్లలను ప్రేమిస్తాడు.
***
నా స్నేహితులకు ఈ పోస్ట్ మీద వాళ్ల వాళ్ల అభిప్రాయాలు ఉంటాయి. మనందరి లైంగిక ప్రేరణ కాళ్ల మధ్య కాకుండా, చెవుల మధ్య ఉంటుంది. ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. అంతే…

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • రంగమార్తాండ సినిమాలో కృష్ణవంశీ ఎక్కడెక్కడ రాంగ్‌స్టెప్స్ వేశాడంటే..?!
  • ధమాకా, ఖిలాడీ మూవీల కంబైన్డ్ కిచిడీ… విష్వక్సేనుడి దాస్‌కాధమ్కీ…
  • Rangamarthanda… ప్రకాష్‌రాజ్ ‘అతి’… బ్రహ్మానందం పర్‌ఫెక్ట్… రమ్యకృష్ణ వోకే…
  • రంగు సోడాల కడుపులు కొట్టి… ఆర్గానిక్ షర్బతుల పనిపట్టి… కూల్‌డ్రింక్స్ రసాయనదాడి…
  • ఢిల్లీ టు మద్రాస్… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు రోజుల ప్రయాణం…
  • FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…
  • ఈసారి ఉగాది టీవీ షోస్… పులుపు లేని చింత, తీపి లేని బెల్లం, చేదెక్కువ వేప్పువ్వు…
  • 186 అమెరికన్ బ్యాంకులు దివాలా దిశలో… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం…
  • థూమీబచె… ఎంతకు తెగించార్రా… ఇది ఉగాది స్పెషల్ షో అట..!!
  • కన్నతల్లికి మళ్లీ కల్యాణం… పెళ్లీడుకొచ్చిన కొడుకులే ఈ పెళ్లికి పెద్దలు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions