Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంగసాన్ సూకీ రాజకీయ చరిత్ర ఇక ముగింపుకు వచ్చినట్టే..?

April 28, 2022 by M S R

మన మీడియాకు పెద్దగా ఆనలేదు గానీ… మన పొరుగున ఉన్న బర్మాలో వార్తలు మనకు కూడా ఇంపార్టెంటే… జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇక అంగసాన్ సూకీ కెరీర్ సమాప్తం అయినట్టే కనిపిస్తోంది… తాజాగా ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు… ఆరు లక్షల డాలర్ల నగదు, 11 కిలోల బంగారు కడ్డీలను మాజీ ముఖ్యమంత్రి థస్ నుంచి ముడుపులు తీసుకున్నారనేది ఆమెపై సైనిక జుంటా ప్రభుత్వం పెట్టిన ఆరోపణ… అసలు ఇదే కాదు…

ఇంతకుముందే 2022 జనవరిలో నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు… ఇదే కాదు, మరో 11 అవినీతి కేసులు పెట్టారు… చిన్న కేసులేమీ కావు… ఏళ్ల కొద్దీ శిక్షలు పడే చాన్సున్న కేసులవి… సైనిక జుంటా కోర్టే విచారణలు జరుపుతోంది… చకచకా తీర్పులు కూడా వెలువడుతున్నాయి… అంతా రహస్య విచారణే… మీడియా సహా ఎవరికీ అనుమతి లేదు… మొత్తం 18 నేరారోపణలపై ఇకపైనా ఇలాంటి ధోరణే కనిపించబోతోంది… అది క్లియర్…

aungasan

అవును, సైనిక తిరుగుబాటు జరిగాక, ఒక్కసారి దేశం సైన్యం గుప్పిట్లోకి వెళ్లాక పరిస్థితి అలాగే ఉంటుంది… బర్మాలో ఇదేమీ కొత్త కాదు… దేశం మీద బర్మా సైన్యం గ్రిప్ తక్కువేమీ కాదు… అసలు అక్కడి సిస్టమే ఆర్మీ ప్రాధాన్య కేంద్రంగా ఉంటుంది… డెమోక్రసీ ఎట్సెట్రా పదాలు అక్కడి సైన్యానికి పట్టవు… తెలుసు కదా, రోహింగ్యా ముస్లింలపై ఆర్మీ అణిచివేత ఎంత క్రూరంగా ఉంటుందో చదివాం కదా… అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే..?

ఆమె వయస్సు ఇప్పుడు 76 ఏళ్లు… ఆమెను ఇప్పట్లో బయటికి రానివ్వరు ఇక… తదుపరి పోరాటాలకు ఆమె వయస్సు, ఆమె స్టామినా సరిపోవు… మరో రాజకీయ నాయకుడు కనుచూపు మేరలో లేరు… కనిపించడం లేదు… ఒకవేళ అలా ఎవరైనా కనిపించినా ఆర్మీ ఊరుకోదు… ఓ క్యూబా వ్యక్తి మైఖేల్ ఆరిస్‌ను పెళ్లి చేసుకున్న ఆమె ప్రస్తుతం ఒంటరి… భర్త కూడా చాన్నాళ్ల క్రితమే మరణించాడు… బలంగా తిరగబడే ప్రజాస్వామిక వాతావరణం లేదు…

ఆమె పార్టీకి అంతగా సంస్థాగత బలం కూడా లేదు… అసలు విశేషం ఏమిటంటే..? ఐక్యరాజ్యసమితి ఎంత మొత్తుకున్నా సరే, ఒక దేశ సైన్యం స్టడీగా నిలబడి, దేనికైనా రెడీ అనే స్థితిలో ఉంటే ఐరాస కూడా ఏమీ చేయలేదు అని చెప్పడానికి బర్మా రాజకీయ పరిణామాలే ఉదాహరణ… ఐరాస ఓ కోరల్లేని పాము… అదేమీ చేయలేదు, దానికేమీ చేతకాదు… ఆ దేశ అవసరాల కోసం బర్మా ఇండియాతో బాగానే ఉంటోంది… ఇండియాకు కూడా బర్మాతో సరైన స్నేహసంబంధాలు ఓ అనివార్యత…

అక్కడి అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టే సీన్ లేదు… ఇదే కాదు, శ్రీలంకలో అనిశ్చితి, పాకిస్థాన్‌లో ఆర్మీ ప్రాబల్యం, అఫ్ఘనిస్థాన్‌లో అంతర్యుద్ధం… ఎటుచూసినా మన చుట్టూ అనిశ్చితి, అస్థిరత… మెల్లిమెల్లిగా మన పొరుగు దేశాలకు కూడా చైనా దుర్నీతి అర్థమవుతోంది… అనుభవిస్తున్నాయి… ఈ స్థితిలో మన విదేశాంగవిధానం మునుపెన్నడూ లేనంత ఒత్తిడిలో ఉంది… ఉక్రెయిన్ సంక్షోభం సరేసరి.,. అటు నాటో, ఇటు రష్యా… ఎటో ఒకవైపు తేల్చుకొమ్మంటున్నాయి… ప్రపంచ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి… ఈ స్థితిలో బర్మాలో ప్రజాస్వామిక వ్యవస్థ వంటి అంశాలపై ఇండియా కూడా ఏమీ మాట్లాడే స్థితి లేదు… తను కూడా ఓ ప్రేక్షకురాలు మాత్రమే…

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • మందుపాట ఘంటసాల పాడితేనే కిక్కు… వైరాగ్యపు మత్తు…
  • సినిమాకు ఓ లేఖ ప్రాణం… ఆ లేఖ దగ్గరే తప్పుదొర్లితే…? అదే సీతారామం…!!
  • నిత్యమేనన్ చేసిన తప్పు…! ఆరేళ్ల క్రితమే వాడి వీపు పగలాల్సింది…!!
  • సింహాలు అమ్మబడును…! దివాలా తీసిన పాకిస్థాన్ సర్కారు పొదుపుపాట్లు..!!
  • నేషనల్ హెరాల్డ్ కేసు ప్రభావం వచ్చే కర్నాటక ఎన్నికల మీద…!
  • బాబ్బాబు… ప్లీజ్… మీరు వస్తుండండి..? పోనీ, నన్నే హైదరాబాద్ రమ్మంటారా..?!
  • టీవీ ప్రేక్షకుల్ని ఈటీవీ, మల్లెమాల పిచ్చోళ్లను చేసి, వెక్కిరించడమే ఇది…!!
  • మిస్సింగ్ గరల్ నంబర్ 166… తొమ్మిదేళ్ల ఓ అన్వేషణ కథ… ఓ పోలీస్ గ్రేట్‌నెస్…
  • ఓహ్… ఆత్రేయ రాసిన ఆ బర్త్‌డే పాటలో అంత ఫిలాసఫీ ఉందా..?
  • హీరోయిన్ కాదు, లేడీ డాన్… మాఫియా క్వీన్… గంగూబాయ్ మీద ఓ రీలుక్…!

Archives

Copyright © 2022 · Muchata.com · Technology Support by CultNerds IT Solutions