Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

header-new-unit-muchata.com
  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బిగ్‌బాస్ బిగ్ బ్లండర్… చప్పట్ల హోరులో చర్చకు రాకుండాపోయింది.,.

December 20, 2020 by M S R

చప్పట్లు, హంగామాల నడుమ బిగ్‌బాస్ అమలు చేసిన దరిద్రం ఒకటి పెద్దగా చర్చకు రావడం లేదు… నిజానికి బిగ్‌బాస్ టీం అంత భారీ ఖర్చు నడుమ తన చిల్లరతనాన్ని ప్రదర్శించింది… తెలంగాణ భాషలో ‘‘కొంచెపువేషం’’… అది అర్థమయ్యేలా సరళంగా చెప్పుకుందాం… ఒక పోటీ పెట్టాం మనం… విజేతకు పది వేలు, సెకండ్ వచ్చినవాడికి అయిదు వేలు అని ప్రకటిస్తాం సాధారణంగా… థర్డ్ వచ్చినవాడికి ప్రోత్సాహకంగా వేయి రూపాయిలు కన్సొలేషన్ ఇస్తాం… సహజంగా కనిపించే ఆటతీరు ఇది…

కానీ ఇప్పుడు బిగ్‌బాస్‌లో ఏమైంది..? ప్రకటించిన ప్రైజ్ మనీలో సగం కత్తిరింపబడింది… రెండో ప్లేసులో ఉన్నవాడికి అసలు పైసా రాలేదు… మూడో ప్లేసులో ఉన్నవాడికి మాత్రం సగం ప్రైజ్ మనీ వచ్చింది… అబ్సర్డ్ కదా… ఇక్కడ అఖిల్ ఎలా నష్టపోయాడు అనేది కాదు… బిగ్‌బాస్ అమలు చేసిన ఆ స్టెప్పే నాన్సెన్స్… సరిగ్గా దాన్ని సొహెల్ వాడుకున్నాడు… కానీ బిగ్‌బాస్ చేసిన సహజన్యాయపు తప్పు మాత్రం తప్పే కదా…

ఇప్పుడు చూడండి… రకరకాల పరిణామాల అనంతరం… సొహెల్ చేతికి 45 లక్షలు వస్తే… విజేత అభిజిత్ చేతికి 25 లక్షలు వచ్చాయి… ((…అభిజిత్‌కు ఇచ్చిన చెక్కు మీద 25 లక్షలు అని కనిపించింది…)) రెండో ప్లేసులో ఉన్నవాడికి ఏమీ దక్కలేదు… ఈ దరిద్రపు ఆలోచనకు కారణం… బిగ్‌బాస్ టీమే… ఇక్కడ ఏదైనా జరగొచ్చు అనే తిక్క సమర్థన అవసరం లేదు… బిగ్‌బాస్ చేసింది బ్లండర్…

ఎవరైనా మధ్యలో ఆట వదిలేస్తే 25 లక్షలు ఇస్తామని ప్రకటించారు సరే, కానీ ప్రైజ్ మనీ నుంచి కట్ చేసి ఇస్తామనడం ఏమిటి..? సొహెల్ వోకే అని చెప్పాక… ఇక అభిజిత్‌కు, అఖిల్‌కు వేరే చాన్స్ లేకుండా పోయింది కదా… వాళ్లు గనుక నో అని ఉంటే కథ వేరే ఉండేది…

వాళ్లు ఇన్నాళ్లు ఆడిందే ఆ ప్రైజ్ మనీ కోసం కదా… వాళ్లు తెగించి, ఆట స్పిరిట్ కోల్పోకుండా నిలబడ్డారు… రిస్క్ తీసుకున్నారు… వాళ్లలో ఒకరికి దక్కాల్సిన మొత్తం ప్రైజ్ మనీని కట్ చేసి, మూడో ప్లేసులో ఆట ఆపేసినవాడికి ఇవ్వడం ఎలా కరెక్టు..?

ఇవ్వాలని అనుకుంటే దాన్ని అదనంగా ప్రకటించాల్సింది… చివరకు ఆటను మధ్యలోనే వదిలేసినవాడు లాభపడి, పోటీలో నిలబడిన వీళ్లిద్దరూ నష్టపోయారు… సొహెల్ తప్పు ఏమీ లేకపోవచ్చు ఇక్కడ… లేదా మూడో ప్లేస్ అని తనకి ముందుగానే హింట్ అంది ఉండవచ్చు… కానీ బిగ్‌బాస్ తీసుకున్న నిర్ణయాల్లోనే తప్పుంది…

(బయట ఓటింగ్ ట్రెండ్ పై మెహబూబ్ నిన్న హౌస్ లోకి వెళ్ళినప్పుడు చేతి వేళ్ళ ద్వారా ఒక హింట్ ఇచ్చాడని, అందుకే 25 lakhs ఆఫర్ రాగానే వోకే చెప్పేశాడు అని సోషల్ మీడియాలో ఆరోపణ ఉంది… అయినా అక్కడ sohel presence of mind చూపించి, చెరి సగం అని ముందుగానే ఒప్పందం అని ఏదేదో చెప్పేసి ఆ situation భలే వాడేసుకున్నాడు… Good intelligence..) పాపం, అంతిమంగా అఖిల్ కి ఖాళీ చేతులు మిగిలాయి…

కానీ చివరి క్షణాల్లో బహుమతి సొమ్ము మార్చడం, రూల్స్ మార్చడం జస్ట్, ఓ మైండ్ లెస్ గేమ్… ఇది ఎంత బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినా సరే… రన్నర్ అప్‌కు ఏమిచ్చావో చెప్పలేని దురవస్థ ఉన్నప్పుడు… ఆటలో, షోలో ఎంత భారీతనం ఉంటే ఏమి..? స్పిరిటే లేకుండా పోయింది కదా… మాటీవీ వాడు ఇదే టీంతో గనుక అయిదో సీజన్ స్టార్ట్ చేస్తే… ఈసారి మాత్రం నిండా మునగడం ఖాయం… ఈ నాగార్జునలు, ఈ చిరంజీవిలు పెద్దగా కాపాడేది కూడా ఏమీ ఉండకపోవచ్చు…!!

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • సామజవరగమనా… సిద్ శ్రీరాం పాటకు తాగినోళ్లూ తట్టుకోలేకపోయారట…
  • టీవీ హీరో సుధీర్…! సీమంతాలూ చేసుకుంటాడు, పిల్లల్నీ కంటాడు..!!
  • మాలావత్ పూర్ణ, వారణాసి మానస… దేత్తడి హారిక ఏరకంగా బెటర్ ఎంపిక..?!
  • ఓహ్… ఏదో అనుకుంటిమి… ఈయన 24 క్యారెట్ల బంగారం ఏమీ కాదన్నమాట…
  • ఏది రీతి..? ఏది రోత..? ఈనాడు రాతలకు సాక్షి ఫస్ట్ పేజీలో బ్యానర్‌ తిట్టిపోతలు..!!
  • భయంసా..! పుండు మీద మందు మరిస్తే… రాచపుండుగా మారింది..!!
  • ఔను, నిజమే… ఈ డిస్కో డాన్సర్ ఒకప్పుడు తుపాకీ పట్టిన నక్సలైటే…!
  • హీరో వెంకటేష్ పెద్ద బిడ్డ…! ప్రేక్షకులకు ఏదో చెప్పాలనుందట…!
  • ఇక అందరినీ బాలయ్య ఆవహించేస్తున్నాడు… చూశావా సంచయితా..?
  • మరో కార్తీకదీపం..! కథ కాదు, చేదు నిజం… టీవీ కథను మించిన ట్విస్టులు…

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now