Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కంగనా వ్యవహారంలో శివసేన సర్కారుకు బాంబే హైకోర్టు చురకలు…

November 27, 2020 by M S R

సంజయ్ రౌత్ తెలుసు కదా… మహారాష్ట్ర ఉద్దవ్ ఠాక్రే కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వ్యూహకర్త, శివసేన అధికార పత్రిక సామ్నా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ఎంపీ… మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటు దిశలో తను ఎంత కీలకమో… ఆ ప్రభుత్వానికీ సినీనటి కంగనా రనౌత్‌కూ నడుమ అగాధాన్ని పెంచింది కూడా తనే… ఇష్టారాజ్యంగా కామెంట్స్ చేశాడు… చివరకు ముంబై హైకోర్టు కూడా తనను తప్పుపట్టింది… ఒక పార్లమెంటేరియన్‌కు ఇలాంటివి తగవు అని చెప్పింది తాజా ఆర్డర్‌లో… అంతేకాదు, తను వాడిన ‘హరాంఖోర్’ పదంపైన వివరణను కూడా తోసిపుచ్చింది…

ఆమెపై కోపంగా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం తన ఆఫీసును కూల్చేసిన సంగతి తెలుసు కదా… దీనిపై కంగనా కోర్టుకెక్కింది… సహజమే కదా… ఆ విచారణ సందర్భంగా ఈ కూల్చివేతలు ఉద్దేశపూర్వకం అని కూడా కోర్టు అభిప్రాయపడింది… ఈ సందర్భంగానే సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై కూడా కామెంట్స్ పాస్ చేసింది కోర్టు…

In the order granting relief to #KanganaRanaut, Bombay High Court criticizes the statements and conduct of Sanjay Raut MP @rautsanjay61 against Kangana.

"Such conduct certainly does not befit a leader like Shri Raut who is also a parliamentarian", HC said.#BombayHighCourt pic.twitter.com/UXehh2BsXQ

— Live Law (@LiveLawIndia) November 27, 2020

సంజయ్ రౌత్ చాలా అగ్రెసివ్ కామెంట్స్ చేశాడు నిజంగానే… సామ్నా పత్రికలో ‘లేపేశారు’ అనే అర్థమొచ్చేలా ఉఖాడ్ దియా అనే హెడింగు పెట్టి కంగనా ఆఫీసు కూల్చివేత ఫోటోలు వేసి, ఫస్ట్ పేజీలో మంచి పనే జరిగింది అనే తరహాలో వార్తలు రాశారు… అలాగే హరామ్‌ఖోర్ అని ఆమెను నిందించాడు న్యూస్ నేషన్ అనే చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో… అంతేకాదు, తన స్వస్థలానికి వెళ్లిన కంగనా తిరిగి ముంబైకి రానవసరం లేదు అనీ బెదిరింపు భాషలో మాట్లాడాడు… ఇవన్నీ శివసేన అధికార ప్రతినిధి మాట్లాడినట్టుగానే లెక్క…

సామ్నా సంపాదకీయంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఏదో ప్రతీకారభావనను ధ్వనింపజేస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది… ప్రభుత్వ చర్యలు తమపై అసంతృప్తిగా ఉన్న గొంతులను మూసేయించేలా ఉన్నాయన్నది… మొత్తానికి మేమేమైనా మాట్లాడతాం, ఏమైనా చేస్తాం అనే ధోరణిని కోర్టు తప్పుపట్టింది… ఇంకా దీనిపై సంజయ్ రౌత్ ఏమీ స్పందించినట్టు లేడు…

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • ‘‘జగనూ, కేబినెట్‌లో చేరిపోవయ్యా… అబ్బే, ఇప్పుడొద్దులెండి సార్…’’
  • ఓ పెగ్గు వేస్తే తప్ప… అవి అంతుపట్టవు… ఇన్నాళ్లకు వాళ్లకు కనిపించినయ్…
  • ఆలీ పిచ్చికూతలు సరే..! షకీలా ధర్మసందేహం మాత్రం అల్టిమేట్..!
  • అనుకుంటాం గానీ… చాలామంది చంద్రబాబులున్నారు దేశంలో…!!
  • పాకిస్థాన్ ఇజ్జత్ జప్తు… ఇమ్రాన్‌కు ఇంటాబయటా అన్నీ వెక్కిరింపులే…
  • పట్టుచీరె కట్టేనా..? నొసటన బొట్టు పెట్టేనా..? వేళ్లకు మెట్టెల మాటేమిటో..?!
  • ఫ్లెక్సీ లీడర్స్..! వింటారా కలాం చెప్పిన ధావన్ కథ..?
  • ఔను సారూ… మతమేనా..? కులాన్ని తేల్చే డీఎన్ఏ టెస్టులు కూడా ఉన్నయా..?
  • ప్రధాని దాకా కీలక పదవులు… దేశరక్షణకు మాత్రం ముందుకు రారు…
  • చింత బరిగెలు, తొడపాశాలు కావు బ్రో… అసలు కథలు వేరే ఉంటయ్…

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now