Muchata

బెట్టింగుల లగడపాటి జోస్యాల్లో శాస్త్రీయత ఎంత…? సర్వేలకు ఈ కోణం కూడా ఉందా..?

December 5, 2018

లగడపాటి, కేటీయార్…. ఓ యెల్లో సర్వే ప్లానుపై వీళ్లిద్దరి మధ్య సంవాదం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్… దీనికి మరో కోణం ఏమిటంటే..? లగడపాటి కేవలం చంద్రబాబు కోసమే గాకుండా, బెట్టింగుల ప్రయోజనం కోసం ఇలా సర్వే లెక్కల్ని వండి వారుస్తున్నాడు అనే సంకేతాలు వస్తున్నయ్… తను ఏదైనా చేయగలడు కదా… పార్లమెంటులో పెప్పర్ స్ప్రే కొట్టిన కేరక్టర్‌కు ఇవి ఓ లెక్కా..? ఏపీలో, తెలంగాణలో కొన్ని వేల కోట్ల బెట్టింగులు తెలంగాణ ఫలితాలపై సాగుతున్నయ్… వాటిని క్యాష్ చేసుకునే ప్రయత్నాన్ని లగడపాటి చేస్తున్నాడనేది ఓ అభిప్రాయం… సరే, అదెలా ఉన్నా… అసలు లగడపాటి చెప్పిందంతా నిజమయ్యే చాన్సుందా..? ఓసారి మన రాజకీయ విశ్లేషకుడు శివ రాచర్ల కథనంలో చూద్దాం… యథాతథంగా….


ఊహించిందే చెప్పినప్పుడు ఆశ్చర్యపోవటానికి ఏముంటుంది

నిన్న లగడపాటి రాజగోపాల్ గారు మాహాకూటమికి గెలుపు అవకాశాలు ఉన్నాయి అని చెప్పటం రాజకీయాలు ఫాలో అవుతున్నవారికి ఆశ్చర్యం కలిగించదు . నవంబర్ 30 న 8 నుంచి 10 మంది రెబల్స్/స్వతంత్రులు గెలవపోతున్నారని లగడపాటి చెప్పినప్పుడు తుదుపరి ఆయన ఏమి చెప్పబోతున్నారు అన్నదాని మీద డిసెంబర్ 1 న పోస్టు రాశాను ,https://www.facebook.com/siva.racharla/posts/1973965899306779

లగడపాటి సర్వేను పూర్తిగా కొట్టివెయ్యాలా?సమాధానం కాదు,పరిశీలించ వలసిన అంశాలు ఈసర్వేలో కొన్ని ఉన్నాయి. !

కేటీయార్ నిన్న ట్విట్టర్లో లగడపాటి wahtsapp chat screenshots పెట్టారు. దాని ప్రకారం నవంబర్ 20 న లగడపాటి తెరాస కు 65-70 సీట్లు వొస్తాయని చెప్పారు. నవంబర్ 20 నాటికి కూటమి ఇంకా కుదురుకోలేదు, అసంతృప్తు ను శాంతపర్చటం అప్పటికింకా పూర్తిగా జరగలేదు. వీటన్నిటిని మించి పోలింగ్ దగ్గర పడే కొద్దీ ఫలితాలు మారటం సహజం.

లగడపాటి సర్వేను ప్రకటించక ముందే ఆయన కూటమికి అనుకూలంగా చెప్పబోతున్నారని అంచనా ఉండటంతో సర్వే వెనుక ఆయన ఉద్దేశ్యం స్పష్టం. ఆయన సర్వే ను నమ్మటం నమ్మకపోవటం పక్కనపెడితే సర్వేలో పేర్కొన్న కొన్ని అంశాలను సీరియస్ గా పరిశీలించాలి.

1. గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరిగితే కూటమికి అవకాశాలు ఎక్కువ

ఇది 100% నిజం అన్ని చెప్పలేము కానీ ఎక్కువసార్లు పెరిగిన పోలింగ్ ప్రభుత్వ వ్యతిరేకతను సూచిస్తుంది. ఈ ఎన్నికల్లో కొత్త పార్టీ పుట్టలేదు ,2014లో లాగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా మరియు వ్యతిరేకంగా కసిగా ఓటువేసి పరిస్థితి ఇప్పుడు లేదు.

లగడపాటి గత ఎన్నికల్లో 68 % పోలింగ్ జరిగింది అన్నారు. కానీ వాస్తవంగా గత ఎన్నికల్లో 71.61 % ఓటింగ్ జరిగింది. ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధం లేకుండానే ఈ ఎన్నికల్లో 71. 61% కన్నా ఎక్కువ ఓటింగ్ జరగటానికి ప్రోత్సాహక అంశాలు లేవు.

మధ్యప్రదేశు లో గత రెండు ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగినా బీజేపీ అధికారాన్ని నిలుపుకుంది. 2013 ఎన్నికల్లో 1 %,2008 ఎన్నికల్లో 2.5 % వోటింగ్ పెరిగింది. కానీ ఈ ఎన్నికల్లో 5 % పెరగటంతో బీజేపీ గెలుపు మీద అనుమానాలు నెలకొన్నాయి.

2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కేవలం 2% ఓటింగ్ పెరగగా బీజేపీ 47 స్థానాల నుంచి ఏకంగా 325 స్థానాలను ఎగబాకింది. సమాజ్ వాది కాంగ్రెస్ 2012లో ఎవరితో పొత్తులు లేకుండ 224 స్థానాలు గెలవగా 2017లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా ఇరుపార్టీలకు కలిపి కేవలం 47 సీట్లు దక్కాయి. BSP 80 నుంచి 19 స్థానాలకు పడిపోయింది. ఈఫలితం సెఫాలజి సహజ సూత్రానికి అంటే ఓటింగ్ పెరగటం ప్రభుత్వానికి వ్యతిరేకం అన్న సూత్రాన్ని బలపరుస్తుంది.

2014 ఎన్నికల తరువాత జరిగిన వివిధ రాష్ట్ర ఎన్నికల్లో కేవలం తమిళనాడు,గుజరాత్ లలో మాత్రమే అధికారపార్టీ తిరిగి గెలిచింది. అయితే ఈ రెండు ఎన్నికల్లో గత ఎన్నికల కన్నా ఓటింగ్ శాతం తగ్గటం గమనార్హము .

తమిళనాడులో 2016లో 74. 26% ఓటింగ్ నమోదు కాగా 2011లో 78.10% ఓటింగ్ జరిగింది. 2011లో జయలలిత విజయ్ కాంత్, కమ్యూనిస్టులతో పట్టుపెట్టుకొని 203 సీట్లు సాధించగా 2016లో ఎవరితో పొత్తులేకుండా 136 స్థానాలు గెలిచారు.

గుజరాత్లో 2012లో 71.32 % పోలింగ్ జరగగా బీజేపీ 115,కాంగ్రెస్ 61 స్థానాలు గెలిచాయి. 2017 ఎన్నికల్లో 68.41 % ఓటింగ్ జరగ్గా బీజేపీ తృటిలో ఓటమిని తప్పించుకొని 99 స్థానాలు గెలిచి (కనీస మెజారిటీ కన్నా కేవలం 7 స్థానాలు అధికం ) అధికారాన్ని నిలుపుకుంది. కాంగ్రెస్ గతం కన్నా 20 స్థానాలు అధికంగా 81 సీట్లు గెలిచింది.

ఈ రెండు ఎన్నికలు కూడా సెఫాలజి సహజ సూత్రానికి అంటే ఓటింగ్ తగ్గితే ప్రభుత్వానికి అనుకూలం అన్న సూత్రాన్ని బలపరుస్తుంది.

తెలంగాణా విషయానికి వస్తే గెలుపోటములు ఎలాఉన్నా ఓటింగ్ శాతం సెఫాలజి సహజ సూత్రాన్ని ప్రతిబింభించదు అని నా అభిప్రాయం. అంటే గెలుపోటములకు ఓటింగ్ శాతంతో సంబంధం ఉండకపోవచ్చు .

2. ఇండిపెండెంట్లు /స్వతంత్రులు

లగడపాటి గెలుస్తారని చెప్పిన 5 మంది మక్తల్ -జలంధర్ రెడ్డి(TRS రెబల్-తెరాస ఎంపీ జితేంద్ర రెడ్డి వర్గం మద్దతు ), నారాయణ్ పేట శివకుమార్ రెడ్డి(కాంగ్రెస్ రెబల్ ),ఇబ్రహీం పట్నం – మాల్ రెడ్డి రంగా రెడ్డి(కాంగ్రెస్ మద్దతు ) ,బోథ్ -అనిల్ జాదవ్(కాంగ్రెస్ రెబల్ ) , బెల్లంపల్లి – వినోద్ (ఈయన్ను తెరాస రెబల్ లేక కాంగ్రెస్ రెబల్ అనాలో ? రెండు పార్టీల నుంచి టికెట్ ఆశించారు )… రేపు లేదా ఎల్లుండి చెప్తారని భావిస్తున్న రామగుండం – కోరుకంటి చందర్ (TRS రెబల్), దేవర కొండ – బిల్యా నాయక్(కాంగ్రెస్ రెబల్ ), వికారాబాద్ – A .చంద్ర శేఖర్ (కాంగ్రెస్ రెబల్), మధిర -కోట రాంబాబు(TRS రెబల్) లలో నిజమైన స్వతంత్రుడు ఎవరు లేరు అందరు ఆయాపార్టీల రెబల్స్.

వీరిలో ఎందరు గెలుస్తారని చెప్పటం సాధ్యం కాదు కానీ 8 మంది గెలిచే అవకాశాలు తక్కువ. వీరిలో ఎక్కువ మంది భారీ స్థాయిలో ఓట్లు సాధించి రెండు లేదా మూడవ స్థానం లో నిలిచే వారు ఎక్కువ.

గత చరిత్ర చూస్తే నలుగురు లేక అంతకన్నా ఎక్కువ మంది రెబల్స్/స్వతంత్రులు గెలిచిన ఎన్నికల్లో ఏ పార్టీ రెబల్స్ ఎక్కువ మంది గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వొచ్చింది . దీనికి 2004 ఎన్నికలు మంచి ఉదాహరణ. ఆ ఎన్నికల్లో గెలిచిన 13 మంది రెబల్స్ లో 12 మంది కాంగ్రెస్ వారే.

1999లో గెలిచిన నలుగురు రెబల్స్ లో ముగ్గురు టీడీపీ వారు. 1994లో గెలిచిన 12 మంది రెబల్స్/స్వతంత్రులలో 5 మంది టీడీపీ మద్దతుతో, 2 టీడీపీ రెబల్స్ గెలవగా కాంగ్రెస్ రెబల్స్ 3,ఒక ఇండిపెండెంట్ గెలిచారు.

1989లో గెలిచిన13 మంది రెబల్స్/స్వతంత్రులలో ముగ్గురు కాంగ్రెస్ మద్దతుతో, 6 మంది కాంగ్రెస్ రెబల్స్ గెలిచారు. ఈ ఈలెక్కలు వలెనే కెసిఆర్ లగడపాటి సర్వేను విమర్శించారు.

3.బీజేపీ ప్రభావం

లగడపాటి బీజేపీ గతంలో గెలిచిన 5 సీట్ల కాన్నా ఎక్కువ సీట్లు గెలుస్తుందని,ఈసారి హైదరాబాద్ బయటి జిల్లాలలో కూడా సీట్లు గెలుస్తుండని చెప్పారు.

రాజస్థాన్,మధ్యప్రదేశ్ ఛత్తీస్ ఘడ్ ఎన్నికలు జరుగుతున్నా బీజేపీ తెలంగాణా మీద ఎక్కువ దృష్టి పెట్టి పనిచేసింది. మోడీ,అమిత్ షా ,యోగి మొదలు అనేక మంది జాతీయ నాయకులు,మంత్రులు తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేశారు.

నిజామాబాద్ టౌన్,కరీం నగర్ ,ముధోల్ ,ఆదిలాబాద్,దుబ్బాక స్థానాలలో బీజేపీ కి గెలుపు అవకాశాలు ఉన్నాయని అంచనా. 2014లో కేవలం 78 ఓట్ల తేడాతో ఓడిపోయినా కల్వకుర్తి మీద ఈసారి బీజేపీకి ఎక్కువ అంచనాలు లేనట్లుంది. ఇలాంటి స్థానమే సూర్యాపేట కూడా.

వీటిలో ఒకటి రెండు గెలిచినా బీజేపీకి అదనపు బలం చేకూరినట్లే. బీజేపీ 2014లో హైదరాబాద్ & రంగారెడ్డి పరిధిలో గెలిచిన 5 స్థానాలు తిరిగి గెలవటం అంత సులభం కాదు.

4.హాంగ్ ఫలితాలు

లగడపాటి అంచనా వేస్తున్నట్లు బీజేపీ గతంలో కంటే ఎక్కువ సీట్లు అంటే రెబల్స్ 8-10 సీట్లు ,BJP 7 -8,MIM 7 ,సీపీఎం 1 మొత్తం కలిపి 23-25 స్థానాలు అంటే తెరాస -కూటమి పోటీ 94-96 స్థానాలు పంచుకోవాలి.

లగడపాటి కూటమికి ఆధిక్యం ఉందన్న ఆదిలాబాద్,ఖమ్మం,నల్గొండ , రంగారెడ్డి జిల్లాలలోని మొత్తం స్థానాలు 46,

తెరాస ఆధిక్యం ఉందన్న వరంగల్ ,నిజామాబాద్,మెదక్ జిల్లాలలోని మొత్తం స్థానాలు 31

కూటమి,తెరాస మధ్య పోటాపోటీ అన్న మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలలోని మొత్తం స్థానాలు 27

హైదరాబాదులో మొత్తం 15 స్థానాలలో 7 MIM ,మిగిలిన 8 అన్ని పార్టీలకు — ఈ లెక్కల ఆధారంగానే ఆధిక్యం ఉన్న జిల్లాలో 60% పోటా పోటీ అన్న జిల్లాలో 40% సీట్ల ప్రకారం అంచానా వేస్తె కూటమికి 54,తెరాస కు 52 స్థానాలు దక్కుతాయి. ఈలెక్క ప్రకారమే లగడపాటి హాంగ్ అసెంబ్లీకి అవకాశం ఉందన్నట్లున్నారు.

కర్ణాటక ఎన్నికల తరువాత చిన్నపార్టీలకి హాంగ్ మీద దృష్టి ఎక్కువైంది. అక్బరుద్దీన్ బహిరంగంగానే హాంగ్ వస్తే తామే ముఖ్యమంత్రి అని అంటున్నారు.

హంగు అంటూ వస్తే (వస్తుందని నేను అనుకోను ) ఆ లెక్కేవేరు! రిమోట్ ఢిల్లీ కి చేరుతుంది.

ఉన్నది 119 స్థానాలే కావటం అందులో MIM ,బీజేపీ ,సిపిఎం, రెబల్స్ లకు కలిపి 12-15 స్థానాలు ఖాయం అవ్వటంతో పోటీ 104 స్థానాలకే జరుగుతున్నట్లయింది. దీనితో గెలిచే పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచే పార్టీ మధ్య స్థానాల భేదం 15-20 స్థానాలు ఉంటాయన్న అంచనాతో పోటీ తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తుంది. 10 స్థానాలలో ఫలితాలు తారుమారైతే మొత్తం ఫలితమే తలకిందులు అయ్యేపరిస్థితి ఉండటంతో తెలంగాణా ఫలితాలు ఆసక్తిని రేకిత్తిస్తున్నాయి.

డిసెంబర్ 7 న పోలింగ్ ముగిసిన తరువాత వొచ్ఛే exit polls లో స్పష్టత వస్తుందనుకుంటున్నాను, అలాకాకుండా mixed opinionస్ వస్తే మాత్రం కౌంటింగ్ జరిగే 11 వరకు నరాలు తేగే ఉత్కంఠత ఎదురుచూడవలసిందే . Exit Polls ఏమి చెప్పినా బెట్టింగులకు దూరంగా ఉండటం మంచిది….

Filed Under: main news

Recent Posts

  • …. చివరకు తమ ఆడవాళ్ల చైనా కొనుగోళ్లనూ ప్రశ్నించలేని పాకిస్థాన్..!!
  • ఇబ్బందే… కానీ… అడగకతప్పడం లేదు…
  • ఈడ్చికొట్టిన ఈక్వెడార్…! ఈ దేవదేవుడు హైతీకి పరుగు..!!
  • … ఇక్కడ ఉగ్రవాదులు, రేపిస్టులు, హంతకులకు మాత్రమే మానవహక్కులు..?!
  • జీవించే హక్కు ఈ కామాంధులకు ఉందా..? మళ్లీ చర్చ మొదలు..!!
  • అయ్యో పాపం పీవీ..! you too manmohan singh..?!
  • సొసైటీ స్ట్రాంగ్ ప్రెజర్..! తలొగ్గిన కేసీయార్..! మళ్లీ ఆనాటి సజ్జనార్..!!
  • హఠాత్తుగా జగన్ హస్తిన టూర్ దేనికి..? జోరుగా ఊహాగానాలు..!
  • రహస్య..! ఓ సీరియస్ క్రైం సస్పెన్స్ థ్రిల్లర్…
  • మోడీజీ అండ్ షాజీ… ఆ ధిక్కార మమతను మీరేం చేయగలరు..?
  • జర్నలిస్టుల కన్నీటి జీవితాలు
  • కైలాసం ఓ మిథ్య..! ఆ నిత్యానందుడి అసలు లీల వేరు..!!
  • ఉన్నది ఎకరంన్నర..! పండని పంట లేదు- పెంచని జంతువూ లేదు..!!
  • లెక్చ‌ర్ ఆన్ మేల్ డామినేటెడ్ సొసైటీ….
  • పవన్ కాషాయబాట వెనక బాబు..? ఒక లెక్క, ఒక ప్లాన్, ఒక ట్రాప్..!?

Follow

Subscribe to notifications

Handcrafted with by All Tech Media. All Rights Reserved Muchata.