జగన్ ముందస్తు ఎన్నికలకు రెడీ అయిపోతున్నాడా..? గతంలో కేసీయార్ చూపిన బాటలోనే తనూ అడుగులు వేయబోతున్నాడా..? ఇప్పుడు ఉన్నతాధికారుల బదిలీలు ఒక ‘ఎలక్షన్ టీం’ అనే దిశలో సాగే ప్రయాణంలో భాగమేనా..? వచ్చే మూడు నాలుగు నెలల్లో జగన్ ఓ సీరియస్ కార్యాచరణ అమలు చేయబోతున్నాడా..? మూడు రాజధానులు అనే కాన్సెప్టుకు కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా..? ఈ నాలుగైదు నెలల కీలక కసరత్తులన్నీ ముగిశాక మళ్లీ జనంలోకి వెళ్లిపోనున్నాడా…? వినవచ్చే సమాచారం మాత్రం అవుననే అంటోంది… జగన్ […]
కేసీయార్ పంచాంగం లెక్కలన్నీ వేరు… ఏ ప్రముఖ జ్యోతిష్కుడూ పనికిరాడేమో…!!
అకస్మాత్తుగా కేసీయార్ ఎందుకింతగా బీజేపీపై విరుచుకుపడుతున్నాడు..? ఏం సెగ తగులుతోంది..? రాజకీయంగానా..? కేసుల వాసన ఏమైనా వస్తోందా..? ఆ చర్చను వదిలేస్తే చాలా అంశాల్ని ఎందుకు, ఎలా మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కాదు, ఎవరినీ ప్రశ్నించనివ్వడు, మీడియా మీట్‌లో ఎవరైనా ఆ ప్రశ్న వేస్తే ఇక ఆ విలేఖరి పనైపోయినట్టే… కేసీయారే ట్రోలింగుకు దిగుతాడు… నిన్నటి సుదీర్ఘమైన ప్రెస్‌మీట్ అనంతరం విలేకరులతో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఓ వింత విషయం చెప్పుకొచ్చాడు తను… ఆంధ్రజ్యోతిలో కనిపించింది ఆ […]
ప్రత్యేక హోదా..! నిజంగా నిలువరించే సీన్ చంద్రబాబుకు ఉందా..?!
నిన్న ఓ వైసీపీ నాయకుడు ధాటిగా చెప్పేస్తున్నాడు… ‘‘ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే జగన్‌కు క్రెడిట్ వస్తుంది కాబట్టి చంద్రబాబు తన పలుకుబడి అంతా ఉపయోగించి, ఆపేయించాడు, రాష్ట్ర వ్యతిరేకి’’ అంటూ గాలికిపోయే కంపను చంద్రబాబు ఇంటివైపు మళ్లిస్తున్నాడు… హహహ, పాపం చంద్రబాబుకు నిజంగా ఢిల్లీలో అంత పలుకుబడి ఉందా..? ఉండి ఉంటే జగన్‌ను ఎప్పుడో జైలులో వేయించేవాడు కదా… కనీసం మోడీ దగ్గర అపాయింట్‌మెంట్ సంపాదించేవాడు కదా… ఏదో అప్పట్లో బాగా బతికి, చితికిపోయిన జీవితం, […]
ఐనా ఈడీ దాడులతో ఏమవుతుంది..? బేఫికర్… కేసీయార్ జోలికి మోడీ రాడు…!!
మోడీ మీద టీఆర్ఎస్ వాళ్లు సభాహక్కుల నోటీసు ఇచ్చారట, ఏమైతుంది సార్..? కేసీయార్ పై బీజేపోళ్లు అసెంబ్లీలో అలాంటి నోటీసే ఇస్తారట, ఏమవుతుంది సార్..? టీఆర్ఎస్ పెద్దల చుట్టూ ఈడీ వలలు పన్నుతోందట, నిజమేనా సార్..? …. నిన్నటి నుంచీ ఒకటే చర్చలు… బట్, ఎవరికీ ఏమీ కాదు.,. ఎవరికీ ఫికర్ అక్కర్లేదు… తెరపై కనిపించేదే సత్యం కాదు, రాజకీయాల ప్రణాళికలు అంటేనే ఓ స్పష్టాస్పష్ట భ్రమ… అది సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగు, పోస్టుల హైప్ […]
చిరంజీవికి పెద్దపీట నచ్చలేదా..? కొందరికి ఇష్యూ సెటిల్ కావడమే ఇష్టం లేదా..?!
జగన్ ప్రభుత్వం థియేటర్ల టికెట్ల ధరలు తగ్గిస్తూ ఆమధ్య ఓ నిర్ణయం తీసుకుంది… బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేస్తే, వసూళ్లు చేస్తే తాటతీస్తాను అని చెప్పింది… ఈ నిర్ణయం వెనుక జగన్ అహాన్ని ప్రదర్శిస్తున్నాడనీ, పవన్ కల్యాణ్ మీద కోపంతో ఇండస్ట్రీని తొక్కుతున్నాడనీ, తన ముఖ్యమంత్రిత్వాన్ని గుర్తించని-గౌరవించని ఇండస్ట్రీని కాళ్ల దగ్గర మోకరిల్లేలా చేసుకుంటున్నాడనీ, ఇండస్ట్రీలో ప్రధానంగా కమ్మ పెత్తనం కాబట్టి తన కమ్మ ద్వేషాన్ని ఇండస్ట్రీ మీద కూడా ప్రయోగిస్తున్నాడనీ బోలెడు కథనాలు, ప్రచారాలు […]
అబ్రకదబ్ర, అబ్రకదబ్ర… హాంఫట్… తెల్లారేసరికి కొత్త రాజ్యాంగం వచ్చేయాలంతే…
కొత్త రాజ్యాంగం అవసరం ఈ దేశానికి..? ఈ మాట అన్నాక కేసీయార్ మీద బోలెడు వ్యాఖ్యలు, సెటైర్లు, విమర్శలు కనిపిస్తున్నయ్ సోషల్ మీడియాలో… కానీ చాలామంది నిజానికి తను సరిగ్గా ఏమన్నాడో పట్టుకున్నట్టు లేదు… ఆ మాటలు ఏ కాంటెక్స్ట్‌లో అన్నాడో, ఆయన ఆలోచన పరిధి ఎంత పరిమిత స్థాయిలో ఉందో ఓసారి చూడాలి… తను రాజ్యాంగానికి సవరణలు కాదు, కొత్త రాజ్యాంగమే అవసరం అంటున్నాడు… ఏం, 80 సార్లు మార్చుకున్నాం, ప్రపంచమంతా అవసరముంటే మార్చుకుంటూనే ఉన్నారు, […]
ఓహో… తెలంగాణ కాంగ్రెస్‌లో అంత జరిగిపోతోందా..? రేవంత్‌కు చుక్కలేనా..?!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భారీ చీలిక తప్పదా..? రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించేవర్గం గత్యంతరం లేక సొంత కుంపటి పెట్టేసుకుంటుందా..? తెరవెనుక బీజేపీ సహకరిస్తుందా..? ఢిల్లీకి ఇప్పటికే రేవంత్ మీద ఫిర్యాదులు, నివేదికలు జోరుగా పంపబడుతున్నాయా..? ఆగండాగండి… ఇది సాక్షి సంకోచం లేకుండా తెలంగాణ రాజకీయాల్లోకి వదిలిన ఓ సందేహం, ఓ సంకేతం… సాక్షాత్తూ పత్రిక ఎడిటర్ రాసిన వార్తావ్యాసంలోనే ఈ డౌటనుమానాలు, పరోక్షంగా ఏదో జరగబోతోందనే సూచనలు వదలబడినవి… ఏమాటకామాట… ఇది ఓ విశేషమే… ఎంతసేపూ ఏపీ పాలిటిక్స్, […]
అదే గనుక జరిగితే… మరి రేవంత్‌రెడ్డి పరిస్థితేమిటి..? ఓ పెద్ద ప్రశ్న..!!
తెలంగాణ రాజకీయాల్లో రేవంత్‌రెడ్డి కేంద్ర బిందువు అవుతున్నాడా..? నిజానికి రాజకీయాల్లో పొద్దున ఉన్న సిట్యుయేషన్ మాపు ఉండదు, ఈరోజు లెక్క వేరు, రేపటి లెక్క వేరు… పరిస్థితులు ఎటు నుంచి ఎలా తన్నుకొస్తాయో ఎవరూ అంచనా వేయలేరు… ఒక దశలో తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేయడానికి సిద్ధమై, కాంగ్రెస్ చేతకానితనంతో అది అమలు జరగక… ఇక ఏడేళ్లుగా కేసీయార్ రాష్ట్రంలో రకరకాలుగా కాంగ్రెస్ పార్టీని తొక్కీ తొక్కీ నారతీసి, చీరి చింతకుకట్టి, కుళ్ల బొడిచాడు… ఇక నాకు […]
దోచుకుంటవ్, నా వాటా ఇవ్వవ్… పైగా ధర్నాలు చేయిస్తావా మోడీజీ…?
ఈనాడులో, సాక్షిలో పెద్ద ఫుల్ పేజీ యాడ్ వచ్చింది… ‘‘హవ్వ, పెట్రో ధరల్ని ఇబ్బడిముబ్బడిగా పెంచి, అరకొర తగ్గించిన వాళ్లే ధర్నాలు చేస్తారట… చూశారా, జనం నుంచి కేంద్రం ఎంత వసూలు చేసుకుంటున్నదో, కానీ రాష్ట్రాలకు ఇవ్వడం లేదు… తెలుసా..?’’ అంటూ సుదీర్ఘ వివరణలతో సాగిపోయింది… ఏపీ ప్రభుత్వం బాధేమిటయ్యా అంటే… కేంద్రం వసూలు చేసుకుంటున్నది కానీ మాకు వాటా ఇవ్వడం లేదు అని..! సో, అటు కేంద్రానికీ లేదు, ఇటు రాష్ట్రానికీ లేదు, జనంపై మరింత […]
ఫాఫం… లోకేష్ ఎంత కష్టపడుతున్నా ఈ పాడులోకం అర్థం చేసుకోదెందుకో..!!
భజన గానీ, కీర్తన గానీ, డప్పు గానీ… జాగ్రత్త అవసరం, శృతి తప్పితే ఎదురు తంతుంది… ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆంధ్రజ్యోతి పుంఖానుపుంఖాలుగా రాసే కథనాలు నిజానికి తెలుగుదేశానికి మంచి చేస్తున్నాయో, చెడు చేస్తున్నాయో చెప్పడం కష్టం… పదీపదిహేను చేతులతో ఎడాపెడా రాసేవాడికి, పేజీల్లో యథాతథంగా వేసేవాడికి కాస్త సంయమనం గనుక తప్పితే అసలుకే మోసం.,. అఫ్ కోర్స్, రాధాకృష్ణ కూడా మావాళ్లు భలే ఇరగదీస్తున్నారు అనుకుంటున్నాడేమో గానీ కొన్ని కథనాలు ఉల్టా దెబ్బ కొడుతున్నాయని గ్రహించడం […]
అచ్చోసిన ఆం‘బూతులు..! సమర్థన తిట్టడంకన్నా నీచం..!!
సంస్కారరహిత రాజకీయాలు, దిక్కుమాలిన బూతుల భాష, దిగజారుడు ఎత్తుగడలు ఆంధ్రా రాజకీయాల్లో అసాధారణం ఏమీ కాదు… వీళ్లు దేవుడిగా కొలిచే ఆ ఎన్టీయారే ఓసారి అసెంబ్లీలో శాసనసభ్యురాలు నన్నపనేని మీద ప్రయోగించిన పరమ ముతకతిట్టు ఎందరికి గుర్తుందో తెలియదు గానీ… అప్పట్లో పెద్ద రచ్చే అయ్యింది..! బోషిడికే అనే హిందీ పదానికి అర్థం జగన్‌మోహన్‌రెడ్డే స్వయంగా చెప్పేవరకు చాలామందికి తెలియదు కానీ ఎన్టీయార్ వాడిన బూతు అచ్చ తెలుగు, అది అందరికీ అర్థమయ్యే తెలుగు… ఆనాటి నుంచి […]
ఏపీలో ట్రిపుల్ ఎక్స్ సంస్కార రాజకీయాలు..! పచ్చిగా చెప్పాలంటే ‘‘బోసిడీకే పాలిటిక్స్…
వాడెవడో బోసిడీకే అని తిట్టాడుట… (ఈమాటను ఇలాగే రాయాల్సి వస్తున్న ఖర్మకు నా కలం మీద నాకే జాలేస్తోంది… కానీ ఇప్పుడు ఏపీలో చర్చ, గొడవ, ఉద్రిక్తత, దాడులు, రాజకీయాలు అన్నీ ఆ పదం మీదే కదా… రాయాల్సిన అనివార్యత…) తిడితే తిట్టాడు, వాడి సంస్కారం అది, సింపుల్‌గా లేపుకొచ్చి, ట్రిపుల్ ఆర్‌కు, అచ్చెన్నాయుడు చేసిన ‘కస్టడీ మర్యాదలు’ ఇంకాస్త గట్టిగా చేసి ఉంటే సరిపోయేది కదా… చేయరు, తిట్టడం వెనుకా ఓ ప్లాన్, ఆ తిట్టును […]
ఈ ఉరితాళ్లు పేనింది తమరే కదా బాబు గారూ… మరిచిపోయారా ఆ రోజుల్ని..!?
దెయ్యాలు వేదాలు వల్లించినట్టు… పిశాచాలు సంకీర్తనలు ఆలపిస్తున్నట్టు… అమావాస్య అర్ధరాత్రి ఆ భూత్ బంగళా నుంచి అకాలరోదనలేవో వినిపిస్తున్నట్టు…… వ్యవసాయానికి కరెంటు మీటర్ల మీద చంద్రబాబు వాదన చదువుతుంటే ఇలాగే రకరకాల ఫీలింగ్స్…! ఒపీనియన్స్ ఛేంజ్ చేసుకోకపోతే పొలిటిషియన్ ఎలా అవుతాడని అంటాడు కదా కన్యాశుల్కం గిరీశం… చంద్రబాబు గిరీశానికి ముత్తాత టైపు… నిజానికి ఏదేని అంశం మీద రాజకీయ పార్టీకి ఓ స్థిర విధానం అవసరం లేదా..? ఒక నాయకుడు తను చేసినదాన్నే తను తప్పుపట్టి […]
అసలు ఎవరు ఆ పంజాబీ మహిళ..? పూనం కౌరేనా..? ఇంతకీ ఎవరీమె…?!
గురువు గారూ, ఇంతకీ ఈ వివాదంలో బకరీగా చూడబడుతున్న ఈ పంజాబీ మహిళ ఎవరు అనడిగాడు ఓ మిత్రుడు..? మనకేమో తెలియదు… చార్మి కాకపోవచ్చు, ఆమె మన అకున్ సభర్వాల్ సాక్షిగా ప్యూర్ చార్మి జగన్నాథ్… తమన్నా భాటియా కూడా కాకపోవచ్చు, ఫాఫం, పవన్ క్యాంపుకి కాస్త దూరదూరంగానే ఉంటోంది… సోనం బజ్వాకు అంత సీన్ లేదు…. మన భానుశ్రీ..? అబ్బే, మరీ టీవీలకే సరిపోవడం లేదు… ఎహె, పూనం కౌర్ కావచ్చు… అవును, అప్పుడప్పుడూ పవన్ […]
‘ట్రిపుల్ ఎక్స్’ సంస్కార రాజకీయాలు..! రొచ్చు, బురద రేంజ్ కూడా దాటేశారు..!!
‘‘… సర్వమంగళం పాడింది’’ అన్నట్టు రాజకీయంగా పూర్తిగా దివాలా తీసిన పవన్ కల్యాణ్‌ను మళ్లీ తెరపై కనబడేలా చేస్తున్నది వైసీపీ మాత్రమే, ఆ పార్టీకి ప్రతిపక్షాన్ని కౌంటర్ చేయడంలో కూడా ఓ దిశ లేదు, ఓ దశ లేదు ……… ఈ విశ్లేషణ చాలామందికి రుచించలేదు మొన్న… నో, నో… రిపబ్లిక్ మూవీ ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు రాష్ట్ర మంత్రులు మస్తు కౌంటర్ ఇచ్చారు అని అభిప్రాయపడ్డారు… కానీ ఇప్పటికే ఒకటే నిజం… […]
పవన్ కల్యాణ్ కోరుకున్నదే జరిగింది..! వైసీపీకే ఓ స్ట్రాటజీ లేకుండాపోయింది..!!
పవన్ కల్యాణ్ పిచ్చోడేమీ కాదు… జనం అన్ని ఎన్నికల్లోనూ ఘోరంగా తిరస్కరించి ఉండవచ్చుగాక… ఎంచక్కా మళ్లీ సినిమాలు చేసుకుంటూ ఉండవచ్చుగాక… కానీ తను నిర్మించుకున్న పొలిటికల్ ప్లాట్‌ఫాం మనుగడ కాపాడుకోవాలి కదా… ఎప్పుడో ఓసారి, ఏదో ఓ సందర్భం, ఏదో ఓ అంశాన్ని పట్టుకుని ప్రచారతెర మీదకు రావడం… నేను రాజకీయాల్లోనే ఉన్నానహో అని చాటుకోవడం… అది ఆయన అవసరం… నాదెండ్ల మనోహర్ తప్ప ఇంకెవరూ ఉన్నట్టు లేదు… ఆ గెలిచిన ఏకైక ఎమ్మెల్యే సహా అందరూ […]
పెద్దన్నకు తమ్ముడి చురకలు..! పీకే చదివిన వేల పుస్తకాల్లో ఇది లేదా..?!
మా సొంత డబ్బుతో దుకాణం పెట్టుకున్నాం… నడుమ ఈ సర్కారు ఏంది..? పన్నులు వేయడమేంది..? రేట్ల మీద నియంత్రణ ఏంది..? మా దుకాణాల జోలికి వస్తే మాడిపోతవ్ బిడ్డా……. అని ఎవరైనా ప్రభుత్వాన్ని బెదిరిస్తూ వాదిస్తే ఏమనిపిస్తుంది..? ‘ప్రభుత్వం విధులు-బాధ్యత-అధికారాలు’ అనే సబ్జెక్టు మీద కనీసం బేసిక్స్ తెలుసుకో బ్రదర్ అనాలనిపిస్తుంది… సినిమా అనేది కూడా ఓ వ్యాపారమే, జనాన్ని దోపిడీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది సోదరా అని ఓసారి గుర్తుచేయాల్సి ఉంటుంది… తన […]
Yellowism..! మీడియాకు ఏం కష్టమొచ్చెరా బాబోయ్… వింత అగచాట్లు..!!
పాపం.. పచ్చమీడియా.. కొన్ని సార్లు అనుకుంటాం.. ఇంత కష్టం పగవాడికి కూడా రావొద్దని. ఇప్పుడు అంతకంటే పెద్ద కష్టం.. పాపం టిడిపి అనుకూల మీడియాకు వచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు చిత్ర విచిత్ర మలుపులు తిరిగి.. చివరికి ఓట్ల లెక్కింపు వరకు వచ్చింది. చంద్రబాబుకు మొదటి నుంచి స్థానికసంస్థలంటే ఎందుకో అనుమానం. తాను అధికారంలో ఉన్నప్పుడే, 2018లో జరగాల్సిన ఎన్నికలను పక్కనబెట్టారు. మరీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరగాలని కోరుకుంటారా? అందుకే తన రహస్య మిత్రుడు నిమ్మగడ్డకు […]
ఫీల్డులో కొట్లాడేవాడికి తెలుస్తుంది… తగిలే గాయాలేమిటో, ఆ నొప్పి ఏమిటో…
‘‘అక్కడికి నేనేదో శశిథరూర్‌ను అనకూడని మాటలేవో అన్నట్టు, పెద్ద పంచాయితీ… అవున్లెండి, అసలే కాంగ్రెస్… ఇప్పటికే కేసీయార్ తొక్కీ తొక్కీ నారతీశాడు… ఎవరేమిటో అర్థం కారు, ఎవరు కేసీయార్ మనుషులో అర్థం కాదు, అలాంటిది ఫీల్డులో నానా గదుమలూ పట్టుకుంటూ, అందరి కడుపుల్లో తలకాయలు పెడుతూ… కేడర్‌ను కదిలించుకుంటూ… రాష్ట్రమంతా తిరుగుతూ, సభలు పెడుతూ… నానా కష్టాలూ పడుతున్నాను…. ఫీల్డులో పనిచేసేవాడికి తెలుసు, ఈ పెయిన్ ఏమిటో… మేం కేసుల పాలవుతం, మేం జైళ్లపాలవుతం… వీళ్లు ఎక్కడి […]
కేసీయార్‌జీ… రాంజీ గోండు కథెప్పుడైనా విన్నారా..? రేపు షా వచ్చేది ఆ స్మరణకే…!!
నచ్చింది… ఒక పాత్రికేయుడు తెలంగాణ మాండలికంలో జనం మరిచిపోతున్న, మరిచిపోయిన ఓ అమరవీరుల కథను రాస్తే… దాన్ని చదివిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వయంగా ఓ లేఖ రాసి అభినందించడం నచ్చింది… అందులోనూ నమస్తే అని సంబోధించడం ఆయన సంస్కారం… కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది… పాత ఆదిలాబాద్ జిల్లాలో ఒకచోట ఏకంగా వేయిమందిని ఉరి తీసినట్టు ఓ చరిత్ర… దాని మీద భిన్నాభిప్రాయాలు, సందేహాలు ఉండవచ్చుగాక… కానీ మృతుల సంఖ్యపై […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- 5
- …
- 9
- Next Page »