సినిమా వార్తల దరిద్రం అందరికీ తెలిసిందే… సోషల్ మీడియా పైత్యం పెరిగాక పరిస్థితి మరింత దిగజారిందనేదీ నిజమే… కానీ చివరకు ఇంత భ్రష్టుపట్టిపోవాలా అనిపించింది ఒక వార్త చూస్తే…! అదీ సాక్షి వంటి మెయిన్ స్ట్రీమ్ పత్రికకు సంబంధించిన వెబ్సైట్…!! ఎవరో జర్నలిజం బేసిక్స్, స్పిరిట్ తెలియకుండా, ఏ యూట్యూబ్ చానెలో, ఏ వెబ్సైటో పెట్టుకుని, ఇలాంటి వార్తలు రాస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు… కానీ చివరకు సాక్షి సైతం..! ఎహె, ఊరుకొండి సార్, పత్రికలు, టీవీల్లోనే బోలెడన్ని […]
ఏమండీ నాయుడు గారూ… మీ టీవీ5 చానెల్ అర్జెంటుగా అమ్మేశారట నిజమేనా..?!
‘‘టీవీ5 అమ్మేశారు… జస్ట్, వారం క్రితమే… డీల్ క్లోజ్… బీఆర్ నాయుడు ఫ్యామిలీకి టీవీ5కూ ఇప్పుడు సంబంధం లేదు… అందరూ తప్పుకున్నారు… దివ్యేష్ మానిక్ లాల్ షా, స్మృతి శ్రేయాన్స్ షా, శ్రేయాన్స్ శాంతిలాల్ షా ఇప్పుడు డైరెక్టర్లు… వీళ్లెవరో తెలుసా…? గుజరాతీ పెట్టుబడిదారులు… ఈ డైరెక్టర్లను నియమిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది… ఆన్లైన్లో ఈమేరకు మార్పులు చేసింది… టీవీ5 మాత్రమే కాదు, టీవీ5 కన్నడ, హిందూధర్మం కూడా అమ్మేసినట్టే… మరి ఏపీ సర్కారుతో […]
‘సోల్’ లేని స్టోరీ… పైగా పంటికింద రాళ్లు… టీవీ వార్తలు రాయడం ఓ కళ…!!
అసలు విడుదల అవుతుందో లేదో కూడా తెలియని ఏదైనా చిన్న సినిమా గురించి కూడా ఫుంఖానుపుంఖాలుగా రాస్తుంది మన మెయిన్ స్ట్రీమ్ మీడియా… అంతా ‘కవరేజీ’ మహిమ… ఏ పత్రిక సినిమా పేజీ చూసినా అందుకే మీకు ‘ఎక్స్‌క్లూజివిటీ’ కనిపించదు… ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు హీరో, హీరోయిన్, నిర్మాత, దర్శకుడు, లేకపోతే విలన్‌తో వరుసగా ఇంటర్వ్యూలు… అన్నింట్లోనూ సేమ్ సేమ్ కంటెంట్… ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఓటీటీలు కనిపిస్తున్నాయి మీడియాకు… అలాగే […]
ఒక టీవీ షోకు 12 గంటల ఫినాలె ప్రసారం..! ఎక్కడికో వెళ్లిపోతున్నాం..!!
అందరికీ తెలుసు, ఇండియన్ ఐడల్ ఓ ‘స్క్రిప్టెడ్ షో’ అని..! కానీ ఇండియన్ ప్రజెంట్ టాప్ ఫైవ్ షోలలో ఒకటిగా చేరి, నిజంగానే బాగా ఆదరణ పొందుతోంది… టీవీ రేటింగులు, యాడ్స్ కోసమే షో టీం కష్టపడుతూ ఉంటుంది… కానీ ఈసారి ఈ టీం క్రియేటివిటీ, థింకింగ్ స్టయిల్ టీవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది… లక్కీగా ఈసారి అద్భుతమైన టాలెంట్ ఉన్న సింగర్స్ దొరికారు… ఏక్‌సేఏక్ ఇరగదీస్తున్నారు… ఇంతకీ మనం ఇప్పుడు చెప్పుకునేది ఏమిటంటే..? పంద్రాగస్టు ఈ […]
అపస్వరాభిషేకం..! మంచి పాటలైనా కాస్త మనసు పెట్టి పాడొచ్చుగా మాస్టారూ..!!
శృతి, రాగం, తాళం, సంగతులు, నోట్స్, లయ… ఇత్యాది అంశాలు సగటు శ్రోతకు అక్కర్లేదు… పాడేవాడి గొంతులో శ్రావ్యత, వినిపించే ఆ పదాల భావం, మంచి ట్యూన్, సరిపోయే వాయిద్యాలు… వాడిని మరోలోకంలోకి తీసుకుపోవాలి… కేవలం డప్పుతో, మృదంగంతో అలరించిన గీతాలూ బోలెడు… ఇవన్నీ ఎందుకు ఒక్కసారిగా గుర్తొచ్చాయీ అంటే… వెంటవెంటనే సోనీ ఇండియన్ ఐడల్, ఈటీవీ స్వరాభిషేకం చూసినప్పుడు..! హస్తిమశకాంతరం ఉంది… ఒకప్పటి బాలు స్వరాభిషేకం వేరు, ఇప్పటి స్వరాభిషేకం వేరు… ఈ సగటు శ్రోత […]
ఆ వెగటు షో లేకపోతే ఈటీవీయే లేదు… అంకెలు చూడండి, అక్షరాలా సత్యమిది…
చాలారోజుల తరువాత మళ్లీ ఓసారి బార్క్ వాడి టీఆర్పీలను పరిశీలిస్తుంటే…. ఈటీవీ నిర్వహణ, క్రియేటివిటీ తీరును చూసి ఆశ్చర్యమేసింది… మనం ఎన్నాళ్లుగానో చెప్పుకుంటున్నాం కదా, ఈటీవీలో వచ్చే జబర్దస్త్ అంతటి నికృష్టమైన బూతు ప్రోగ్రామ్ మరొకటి లేదు.., మల్లెమాల, రామోజీరావు, రోజా జాయింటుగా సిగ్గుపడాలీ అనుకుంటున్నదే కదా… కానీ విశేషం ఏమిటంటే..? ఈటీవీకి ఆ ప్రోగ్రామ్ ఒక్కటే ఆక్సిజెన్… అది లేకపోతే ఈటీవీ ఏకంగా మరో పాతాళ చానెల్ జెమినికన్నా దిగువకు ఢమాల్‌మని పడిపోవాల్సిందే… బోలెడు రియాలిటీ […]
నిజంగా తెలుగు, కన్నడ వంటకాల నడుమ అంత తేడా ఉంటుందా..?
ఒక సినిమా విడుదల అవుతుందంటే చాలు… దాని రేంజ్ ఏదైనా సరే… ఇక వరుసగా దర్శకుడు, నిర్మాత, హీరో, హీరోయిన్ గట్రా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంటారు… ‘కవరేజీ’ ఖర్చెక్కువైనా సరే, మంచి పబ్లిసిటీ… రాసేవాడికీ తెలుసు, చదివేవాడికీ తెలుసు… ఇవి ప్రమోషనల్ ఇంటర్వ్యూలని..! కాకపోతే పెద్ద పెద్ద యాడ్స్ ఖర్చుకన్నా ఇది బెటర్ అనేది సినిమా మార్కెటింగ్, పబ్లిసిటీ వాళ్లకు తెలుసు కదా… మీకు గుర్తుందా, బాహుబలికి రాజమౌళి చిన్న యాడ్ కూడా ఇవ్వలేదు, జస్ట్, ఇంటర్వ్యూలతోనే లాగించేశాడు… […]
జూనియర్, రాంచరణ్, ఆలియా జాన్తానై… రాజమౌళే హీరో… ఆ మేకింగ్ వీడియో…
ఆర్ఆర్ఆర్… బాహుబలి తరువాత రాజమౌళి తీస్తున్న మరో అత్యంత భారీ చిత్రం… జక్కన్న వంటి విశేషణాల్ని నేను తగిలించను… సినిమా ఇండస్ట్రీలో జక్కన్నతనం అదృష్టాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది… స్ప్రింగు తాడిచెట్లు వంటి జానపద కథ తరహా కంటెంటుును ప్రేక్షకులు బాహుబలిలో ఆమోదించలేదా..? వేల కోట్లు కురిపించలేదా..? కాకపోతే రాజమౌళిని ఎందుకు మెచ్చుకోవాలంటే… అందరు దర్శకుల్లాంటివాడు కాదు… సాహసి… తను కొన్ని సీన్లు కలకంటాడు… అవి అలాగే వచ్చేవరకూ కష్టపడతాడు… అఫ్ కోర్స్, గతంలో తన […]
రంగు వెలిసిన ‘రంగ్ దే’… ఫోఫోవోయ్ అనేసిన టెలివిజన్ ప్రేక్షకులు…
ఫాఫం నితిన్… ఇటు చెక్ వంటి మాస్ సినిమాలు వర్కవుట్ కావడం లేదు, మళ్లీ రొమాంటిక్ ఎంటర్టెయినర్ బాటలో వెళ్దామంటే రంగ్ దే కూడా చీదేసింది… 2017 నుంచీ ఇదే… శ్రీనివాస కల్యాణం, భీష్మ, లై… అన్నీ… త్రివిక్రమ్ తీసిన అఆ తరువాత ఇక నితిన్‌కు మంచి సినిమా పడలేదు… అంతకుముందు కూడా వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్… ఏదో ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి ఇంకా కథ నడుస్తూనే ఉంది… వేరే హీరోలు […]
భేష్… మ్యూజిక్ షోకు కొత్త ఫ్లేవర్లు, జతగా ఎమోషన్స్… రక్తికడుతున్నయ్…
మనకేమైనా ఆ హిందీ పాటలన్నీ అర్థమవుతాయా..? ఆ ట్యూన్లన్నీ మనకు ఎరుక ఉన్నవేనా..? వాటిని పదే పదే వింటుంటామా ఏం..? తక్కువే కదా… చాలా తక్కువ కదా… కానీ నాన్-హిందీ శ్రోతలను, ప్రేక్షకులను సైతం ఇండియన్ ఐడల్ మ్యూజిక్ ప్రోగ్రాం ఎందుకు ఆకర్షిస్తోంది..? ఎందుకంత రక్తికడుతోంది..? దేశంలోకెల్లా టాప్ రియాలిటీ షోల జాబితాలోకి ఎందుకు వస్తోంది..? సీరియళ్ల స్థాయిలో రేటింగ్స్ ఎలా సంపాదిస్తోంది..? అసలు ఏముంది అందులో..? మన శిరీష భాగవతుల ఇప్పుడా షోలో లేదు… మన […]
మాటీవీ వెరీ బిగ్ గేమ్… కనీసం 100 కోట్లు… జెమిని, జీటీవీ, ఈటీవీలకు దడ…
వెరీ బిగ్ గేమ్… స్టార్ మాటీవీ ఇతర వినోద చానెళ్లను తొక్కేయడానికి, మోనోపలీ వైపు ఓ పెద్ద గేమ్ సంకల్పించింది… దాదాపు వంద కోట్ల పైమాటే తాజా పెట్టుబడి… ఒక్కసారి ఆలోచించండి, ఒకేసారి జూనియర్ ఎన్టీయార్, రాంచరణ్, బాలకృష్ణ, అల్లు అర్జున్, సాయిపల్లవి, నితిన్, నాని, రవితేజ, అఖిల్, మహేష్‌బాబు… ఇంకెవరున్నారు టాప్ హీరోలు తెలుగులో..? వాళ్లందరి ప్రిస్టేజియస్ సినిమాలన్నీ మాటీవీ కొనేసింది… థియేటర్లు లేవు గానీ లేకపోతే వీటిల్లో అధికశాతం కోట్లకుకోట్ల కలెక్షన్లు కొల్లగొట్టేవే… వీటి […]
సమంత అంగీకరించి ఉండాల్సింది… మరో ‘‘ఫ్యామిలీమ్యాన్’’ అయ్యేది ఆమెకు…
సమంతకు చైతూతో పెళ్లి బాగా కలిసొచ్చింది… ఎప్పుడైతే అక్కినేని ఇంటి కోడలు అయ్యిందో అప్పట్నుంచీ ఆమె పాత్రల ఎంపిక మారిపోయింది… ఆ పెళ్లే జరక్కపోతే హీరోల పక్కన అరకొర బట్టలతో పిచ్చిగెంతులు వేస్తూ, అప్రధానంగా ఉండిపోయేది… కానీ పెళ్లయ్యాక ఏదిపడితే అది చేయకూడదనే ఓ సూత్రం పెట్టుకుని, తనకు ప్రాధాన్యమున్న పాత్రల్నే అన్వేషిస్తోంది… తనలోని నటిని చంపుకుని ఇంటికి పరిమితం కాలేదు… ఆ అన్వేషణలో ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సీరీస్ దొరికింది… రాబోయేది డిజిటల్ కాలమే, ఇప్పటికే […]
ఇండియన్ ఐడల్ షోలో అరుణిత ఆగమాగం..! బిగ్‌బాస్ శోకాలు గుర్తొచ్చాయ్..!!
బిగ్‌బాస్ షోలు గుర్తున్నాయి కదా… కంటెస్టెంట్ల ఓవరాతి యాక్షన్… ఎవరైనా హౌజు విడిచివెళ్లేటప్పుడు ఇక చూడాలి… ఎవడో చచ్చిపోయినట్టుగా శోకాలు, పెడబొబ్బలు, ఓదార్పులు… ఆఫ్టరాల్, అదొక గేమ్… నానా టీఆర్పీ లెక్కలు, వేషాలతో ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్ మలుపులు తీసుకుంటూ ఉంటుంది… ఇదంతా వినోద దందా… ప్రేక్షకుల ఆసక్తిని గెయిన్ చేయడానికి సాగే ఓ డ్రామా… పేరుకు రియాలిటీ షో… డాన్స్, మ్యూజిక్, కామెడీ… ఏ జానర్ తీసుకున్నా అన్నింటిదీ ఒకే రూట్… రేటింగులను బట్టి కథలుపడాలి… సేమ్… […]
రామోజీ గ్రూపు ఓటీటీ మంచి ఆలోచనే… కానీ బోలెడు ప్రశ్నలు సశేషం…
పెద్ద రహస్యమేమీ కాదు… ఈటీవీ వాళ్లు ఓటీటీ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు… ఇదీ వార్త… వాళ్లే క్రియేటివ్ పీపుల్ కావాలని ప్రకటనలు కూడా ఇస్తున్నారు కదా, అందరికీ తెలిసిన వార్తే… రాబోయేది ఓటీటీల కాలమే కాబట్టి, డిజిటల్ ఎంటర్టెయిన్మెంట్ యుగమే కాబట్టి రామోజీ ఫిలిమ్ సిటీ లేదా ఈటీవీ సొంతంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసుకోవాలనే ఆలోచన స్వాగతించదగిందే… ఇది ఒకప్పటి ఈనాడు, ఈటీవీ కాదు కాబట్టి లేటైంది లేకపోతే నాలుగైదేళ్ల ముందే ఆల్రెడీ స్టార్ట్ చేసేవాళ్లేమో… ఇతరులకన్నా […]
ఫాఫం ప్రియదర్శి..! ఈ వెగటు సీరీస్కన్నా ఈటీవీ జబర్దస్త్ చాలారెట్లు బెటర్..!!
అంతటి నటుడిని, ఆయన పెట్టిన పార్టీని భ్రష్టుపట్టించి… తెలుగు సినిమాను సిండికేట్ గుప్పిట్లో చెరబట్టి… చివరకు ఇప్పుడు డిజిటల్ మీడియాను కూడా వదలని ఆ మహావ్యక్తి గురించి కాసేపు విశ్లేషణలు మానేద్దాం… ఇండస్ట్రీలో మెజారిటీ వ్యక్తులు అలాంటివాళ్లే కాబట్టి..! ఆ సారు గారు ఆహా ఓహో అంటూ స్టార్ట్ చేసిన సదరు ఓటీటీ కంటెంటు నాణ్యత కూడా అలాంటిదే… అదీ కాసేపు వదిలేద్దాం..! ప్రస్తుతం ఓ సీరియస్ చర్చ అవసరం… థియేటర్లలో నడిస్తే సెన్సార్ అవసరం… ఆ […]
నెవ్వర్… ఈ రేంజ్ నీచమైన ఇంటర్వ్యూ ఏ భారతీయ భాషల్లోనూ రాలేదు… పక్కా…!!
ప్రపంచంలో బహుశా ఇంత దరిద్రమైన ఇంటర్వ్యూ ఇప్పటివరకూ లేదేమో… తెలుగు వదిలేయండి, బహుశా విశృంఖలంగా సాగే కొన్ని భాషల ఇంటర్వ్యూలు, ట్రిపుల్ ఎక్స్ బాపతు చిట్‌చాట్‌లకు మించిపోయింది… అదే అరియానా, రాంగోపాలవర్మ ఇంటర్వ్యూ… వర్మ అనేవాడు ఇంకా జారిపోవడానికి ఏ లోతులూ లేవు అనుకునేవాళ్లకు కనువిప్పు… ఇంకా జారిపోవడానికి ఈ ప్రబుద్ధుడు (ఈ మాట కావాలనే రాయబడుతోంది ఇక్కడ… ఇంకా ఏమీ తిట్టలేక…)… కిందకు తవ్వుతూనే ఉన్నాడు… లేకపోతే ఆ ఇంటర్వ్యూ ఏమిటి..? అరియానాతో ‘భళా ఎంటర్టెయిన్మెంట్స్’ […]
అయ్యలో అయ్యలు… డ్రామా కంపెనీలో అప్పటికప్పుడు అదరగొట్టేశారు…
ఏమాటకామాట చెప్పుకోవాలి… మన తెలుగు టీవీల్లో కామెడీ మరీ నేలబారు… వికృతం… కానీ అప్పుడప్పుడూ కొన్ని ప్రేక్షకుడిని కనెక్టవుతున్నయ్… భిన్నంగా, ఉద్వేగంగా..! టీవీల్లో కామెడీ షోలను చూసే ప్రేక్షకులే ఎక్కువ… నాన్-ఫిక్షన్ రియాలిటీ కేటగిరీలో ఈ కామెడీ షోలకు వచ్చే రేటింగులే టీవీలకు కాస్త ఊపిరి… ఒక్కసారి తాజా స్థితి పరిశీలిస్తే… నాసిరకం కామెడీ అయినా ఈటీవీ ప్రధానంగా ఈ జానర్‌ను నమ్ముకుంది… ఢీ, క్యాష్, వావ్ వంటి షోలైనా సరే… డాన్సులు అనబడే పిచ్చి గెంతులకు, […]
పోయిందే, ఇట్స్‌గాన్, గాయబ్… ఈ కంట్రవర్సీ బిట్ యూట్యూబులో మాయం…
ముందుగా అసలు వివాదం ఏమిటో చూద్దాం… ‘‘హైపర్ ఆది బతుకమ్మ, గౌరమ్మలను, తద్వారా తెలంగాణ సంస్కృతిని కించపరిచాడు… క్షమాపణ చెప్పాలి…’’ ఇదీ వివాదం… ఈటీవీలో మొన్నామధ్య ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షో… జంబలకిడిపంబ అనే ఓ పాత సినిమాకు స్పూఫ్గా ఒక స్కిట్ చేశారు… అందులో ఆడవాళ్లుగా మారిన మగవాళ్లు ఓచోట బతుకమ్మ, గౌరమ్మ పాటలు పాడతారు… అదుగో అక్కడ పుట్టింది వివాదం… తెలంగాణ జాగృతి స్టూడెంట్ వింగ్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు […]
చెప్పీచెప్పని బూతులేల… నేరుగానే వదిలేస్తే పోలా… ఫాఫం, హైపర్ ఆది…
రామోజీరావు ఎదిగాడు… మల్లెమాల శ్యాంప్రసాదరెడ్డి ఎదిగాడు… హైపర్ ఆది ఎదిగాడు… రోజా ఎదిగింది… మొత్తానికి తెలుగు టీవీ కామెడీ కూడా ఎదిగింది… వాళ్ల అభిరుచులకు అద్దం పడుతూ, మరింత దుర్గంధాన్ని వెదజల్లుతూ ఈటీవీ తొలి తెలుగు ‘ఏ’ గ్రేడ్ చానెల్‌గా… లేదా ట్రిపుల్ ఎక్స్ చానెల్‌గా దూసుకుపోతోంది… ఈ నర్మగర్భ బూతులు దేనికి..? ఈ గర్భమర్మ పంచులు దేనికి..? తెల్లారిలేస్తే అక్రమ సంబంధాలు, ఆడవేషగాళ్ల పైత్యాలు దేనికని… ఇప్పుడు ఇంకాస్త డైరెక్టు బూతుల్లోకే వెళ్లిపోతున్నారు… అన్నీ విడిచిపెట్టాక, […]
ఆలీ మారడు… ఈటీవీ మారదు… జబర్దస్త్ మారదు… అదే ఘాటు వెగటుతనం…
ఈటీవీ వాడి జబర్దస్త్ షో నాణ్యత, కేరక్టర్, పోకడ దరిద్రాలు అందరికీ తెలిసిందే… మల్లెమాల యూనిట్ వారి క్రియేటివిటీ లెవల్స్, టేస్ట్ రేంజ్ ఎక్కడో పది కిలోమీటర్ల దిగువన పాతాళంలో దేకుతూ ఉంటుందని కూడా తెలిసిందే… అంతేకాదు, నటుడు ఆలీ వేదికల మీద, తన షోలలో చేసే వెకిలి వ్యాఖ్యలు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం… వ్యక్తిగా అది తన లెవల్… అయితే కొత్తగా వచ్చిన డౌట్ ఏమిటంటే..? జబర్దస్త్ అనే వెగటు కామెడీ షోలో స్కిట్లు చేసీ […]
- « Previous Page
- 1
- …
- 34
- 35
- 36
- 37
- 38
- …
- 41
- Next Page »