ఒక పాపులర్ టీవీ షోలోని ఒక కంటెస్టెంటుకు కరోనా సోకితే… అది జాతీయ స్థాయి ప్రముఖ మీడియా సైట్లన్నింటిలోనూ వార్త అయ్యింది..! నిజానికి అది వార్తే… ఎందుకంటే ఆ వ్యక్తి సంపాదించిన పాపులారిటీ అది… ఎగిసిపడుతున్నఓ నవ సంగీత కెరటం తను… పేరు పవన్‌దీప్ రాజన్… వయస్సు పాతికేళ్లు… ఊరు ఉత్తరాఖండ్‌లోని చంపావత్… పవన్ సోనీటీవీ ప్రిస్టేజియస్ మ్యూజిక్ కాంపిటీషన్ షో ఇండియన్ ఐడల్‌కు ఎంపికయ్యాక తన పేరు తెరపైకి ప్రముఖంగా వచ్చింది… ఉత్తరాఖండ్ అప్పటి ముఖ్యమంత్రి […]
ఆలీ సరదా తగలెయ్య…! సెలబ్రిటీ ఏడుపు బాగా సేలబుల్… ఇదో వికారం…!!
ఆ షో పేరే ‘ఆలీతో సరదాగా’…! మనం మరిచిపోతున్న పాతతరం నటీనటుల్ని, సినిమా సెలబ్రిటీలను తీసుకొచ్చి మాట్లాడింపజేస్తాడు ఆలీ… ఎస్, బాగుంటుంది… మనం మరిచిపోయిన మొహాల్ని మళ్లీ చూపిస్తాడు… కానీ తనకు ఓ వింత పైత్యం ఉంది… తన షోకు ఎవరొచ్చినా ఏడవాలి… దాన్ని ప్రోమో కట్ చేయిస్తాడు… ఈటీవీ వాడు ఎడాపెడా ఆ ప్రోమోలను కుమ్మేస్తాడు… చివరకు వడ్లగింజలో బియ్యపు గింజ… షో చూశాక మరీ అంత హృదయ విదారకం ఏమీ ఉందిరా భయ్ అనిపిస్తుంది… […]
మళ్లీ సుడిగాలి సుధీరే దిక్కు..! ఈటీవీకి తత్వం బోధపడినట్టుంది..!!
ఈటీవీలో అద్భుతమైన అభిరుచితో జబర్దస్త్ వంటి ప్రోగ్రాములు చేసే మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వాళ్లకు మహా గీర… ఎంత అంటే, ఒప్పందాల్లో ఆర్టిస్టులను ఇరికించేసి, వెళ్తానంటే పది లక్షలు కక్కి బయటికిపో అంటారు… ఏళ్లపాటు ఇతర చానెళ్ల వైపు కన్నెత్తి చూడటానికి కూడా అంగీకరించేవాళ్లు కాదు… మేం కట్ చేస్తే కట్, మేం ఎంకరేజ్ చేస్తే హైప్ అన్నట్టుగా ఉంటుంది ధోరణి… ఎక్కడ తేడా కొట్టిందో గానీ, ఎంతోకాలంగా ఈటీవీనే పట్టుకుని ఏడుస్తున్న సుడిగాలి సుధీర్‌కు కత్తెర వేశారు […]
కింగ్ కాలేక… కింగ్ మేకరై… అందులో అసలు మజా పొందడమే ‘తాండవ్’…
కింగ్ కావాలనుకుని… అది కాస్తా అందకుండాపోయిన కసిలో… కింగ్ మేకరై.. ఇక ఆ గేమే బహుత్ మజాగా ఉందని ఆస్వాదించే ఓ విలనీహీరో కథ తాండవ్. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా 9 ఎపిసోడ్లతో మొదటి సీరిస్ గా వచ్చిన ఈ తాండవ్ స్క్రీన్ ప్లేను చాలా విశ్లేషణలు కొట్టిపారేసినప్పటికీ.. సమకాలీన రాజకీయాల్లోని వెలుగు, నీడలు… తమ నీడను తామే నమ్మలేని పరిస్థితుల్లో నాయకుల కుర్చీలాటను పట్టిచూపించే ఓ ప్రయత్నమే తాండవ్. సమర్ ప్రతాప్ సింగ్ గా సైఫ్ […]
వెంకటకృష్ణ ఎందుకు ఏబీఎన్ వదిలేసినట్టు..? ఇంతకీ తనేమంటున్నాడు..?
ఎవరో అడిగారు… జర్నలిస్టులు కూడా వార్తల్లోని వ్యక్తులేనా అని..! దీనికి సమాధానం… అవును..! మీడియా సంస్థలు, వాటిల్లో పెట్టుబడులు, వాటి పొలిటికల్ ధోరణులు గట్రా ఎలాగైతే వార్తాంశాలు అవుతున్నాయో… తమ రాతల ద్వారా, తమ డిబేట్ల ద్వారా జర్నలిస్టులు కూడా వార్తల్లోని వ్యక్తులు అవుతున్నారు…! ఆ ఆర్నబ్ గోస్వామి దగ్గర నుంచి మన రవిప్రకాష్ దాకా… అంతెందుకు..? మన తెలుగు చానెళ్ల సంగతుల్ని కూడా ‘ముచ్చట’లో బోలెడు చెప్పుకున్నాం… తెలుగు న్యూస్ చానెళ్ల డిబేట్లు అనగానే కొమ్మినేని, […]
NAIL POLISH… ఎన్నో డిఫరెంట్ మూడ్స్… ఎన్నెన్నో కలగలుపు షేడ్స్…
బాగా పరపతి గల్గిన ఓ స్పోర్ట్స్ కోచ్… పోలీస్ ఉన్నతాధికారుల పరిచయాలు… హై ఫై లైఫ్ స్టైల్… ఇదంతా ఒకెత్తైతే… ఉన్నపళంగా ఇద్దరు పిల్లల అత్యాచారం, హత్య, సజీవదహనం వంటి ఆరోపణలతో ఆ కోచ్ అరెస్ట్… ఇదిగో ఇలా మొదలై.. ఓ క్రైమ్ లీగల్ సైకలాజికల్ థ్రిల్లర్ ను వీక్షకులకందించాలన్న ఓ ప్రయత్నమే ZEE 5 ఓటీటిలో విడుదలైన NAIL POLISH… WILLIAM DEIHLS రచనలో వచ్చిన నవల… ఆ తర్వాత అదే పేరుతో 1996లో హాలీవుడ్ […]
కృష్ణతులసి..! దర్శకేంద్రుడు అట్టర్ ఫ్లాప్..! ఛీత్కరించేసిన టీవీ ప్రేక్షకులు…!
ఫాఫం… 78 ఏళ్ల వయస్సులో దర్శకేంద్ర, దర్శకాగ్రణి, దర్శకాగ్రేసర, దర్శకశిఖర… రాఘవేంద్రరావు అట్టర్ ఫ్లాప్ ముద్రను మూటగట్టుకున్నాడు… తను మరిచిపోయింది ఏమిటంటే… అవతార్ వంటి అద్భుత హిట్ అందించిన జేమ్స్ కామెరూన్ కూడా ఒక టీవీ సీరియల్ తీయలేడు… అంతెందుకు మన రాజమౌళినే ఓ హిట్ సీరియల్ తీయమనండి… సాధ్యం కాదు… టీవీ సీరియళ్లంటేనే పరమ చెత్తా… ఎపిసోడ్ చూస్తుంటేనే ఎవడ్రా ఈ దర్శకుడు, వీడిని బొందపెట్ట అని తిట్టాలనిపించేలా ఉండాలి… పాత్రల కేరక్టరైజేషన్, చిత్రీకరణ, కథనం, […]
శోకాల అక్క..! వుమెన్స్ డే వేదిక మీద తెలియక చేసిన తప్పేమిటంటే..?!
బిగ్‌బాస్ కన్నీటివరద శివజ్యోతి అలియాస్ సాఫిత్రక్క తెలుసు కదా… ఎమోటివ్… బిగ్‌బాస్ తనను సెలబ్రిటీని చేసింది… అందరితోనూ మంచిగా ఉంటది కాబట్టి తోటి ఆర్టిస్టులు కూడా తనను అభిమానిస్తారు… కాకపోతే ఆ ఏడుపు ఒక్కటే చిరాకు… ఒక లెవల్‌కు చేరుకున్న తరువాత ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాలి… లేకపోతే నాలుక కూడా కంట్రోల్ తప్పుతుంది… మన పరువే పోతుంది… ఉదాహరణకు… జీటీవీ వాడు వుమెన్ డే స్పెషల్ ఈవెంట్ ఒకటి చేశాడు… ఈరోజే సాయంత్రం ప్రసారం… అందులో శివజ్యోతి […]
జబర్దస్త్‌కు తాతలాంటి బూతు షో… శ్రీదేవి డ్రామా కంపెనీ… థూమీబచె…
ఆమధ్య ఏదో స్కిట్లో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే పేరు వినగానే ప్లేబాయ్ టైపు కమెడియన్ సుడిగాలి సుధీర్ అంటాడు… ‘‘ఏంటీ, నాకు తెలియకుండానే ఓ కంపెనీ పెట్టారా..?’’ అని..! ఇక్కడ కంపెనీ అంటే తెలుసు కదా… అర్థమైంది కదా…. నిజంగా అచ్చు కంపెనీ టైపులాగే మారిపోయింది ఈటీవీవాడు ప్రసారం చేసే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో… ప్యూర్ బూతు షో… అసలు జబర్దస్త్ అంటేనే బూతు షో కదా… దానికి తాతలాగా తయారైంది ఇది… […]
కోమాలో ముమైత్ ఖాన్…! ఆ కైపు చూపుల వెనుక ఎవరికీ కనిపించని నొప్పి…!!
ముమైత్ ఖాన్…. పేరు వినగానే, ఆ మొహం చూడగానే ఓ పాట అకస్మాత్తుగా గుర్తొచ్చి హమ్ చేయాలనిపిస్తుంది… ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే… చీటికిమాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే… నాకెవ్వరూ నచ్చట్లే, నా ఒంటిలో కుంపట్లే, ఈడు ఝుమ్మంది తోడెవ్వరే… అలాంటి ఐటమ్ సాంగ్స్ నుంచి డ్రగ్స్ కేసు… ప్లస్ బిగ్‌బాస్… తాజాగా ఏదో టీవీషోలో జడ్జి దాకా… ఆమెకు టాలీవుడ్లో బోలెడన్ని అనుభవాలు… కెరీర్ సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడమో, మరేదైనా కారణమో గానీ… మంచి […]
రవి కృష్ణ-నవ్య స్వామి..! మాటీవీ జంటకు ఈటీవీలో పెళ్లిచేసేశారు…!
బిగ్‌బాస్ ఫేమ్, టీవీ సీరియల్ నటుడు రవికృష్ణకూ… నటి నవ్య స్వామికీ పెళ్లయిపోయింది… ఆమె మెడలో పుస్తె కట్టేశాడు… సెట్లోనే అందరూ చప్పట్లు కొట్టారు… ఇప్పటిదాకా వాళ్ల నడుమ ఏదో ఉంది, ఏదో నడుస్తోంది అని తెగ రాసుకున్నారుగా అందరూ… ఇప్పుడు మరో జంటను వెతుక్కొండి ఇక……………. హహహ… ఏదీ నిజం కాదు… ఈటీవీ వాళ్లను చూసి జాలిపడాల్సిన పెళ్లిసందడి ఇది… శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఓ సూపర్ ఫ్లాప్ షో వస్తోంది కదా ప్రతి […]
కృష్ణతులసి..! దర్శకేంద్రుడి అసలు టార్గెట్ కార్తీకదీపం వంటలక్కేనా..?
ఓ చిన్న వార్త… నవ్వొచ్చింది… ‘‘దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇక బుల్లితెర మీదకు వచ్చేశాడు, ఇక రికార్డులన్నీ బద్దలే, కృష్ణతులసి అనే సీరియల్‌ను జీటీవీ ప్రసారం చేయబోతోంది త్వరలో… అది ఆయన సీరియలే… అసలు తన టార్గెట్ ఎవరో తెలుసా..? కార్తీకదీపం..! వంటలక్క ఇన్నేళ్లూ అనుభవిస్తున్న టాప్ ర్యాంకును ఆయన కూలదోయబోతున్నాడు…’’ ఇదీ ఆ వార్త సారాంశం… కొన్ని యూట్యూబ్ చానెళ్లు, కొన్ని సైట్లలోనే కాదు… మెయిన్ స్ట్రీమ్ పత్రికల అనుబంధ సైట్లు కూడా నానా కంగాళీగా ఇదే […]
పరమ చెత్తా దరిద్రమైన జబర్దస్త్ స్కిట్ ఏమిటని అడిగారుగా… ఇదుగో…!!
కోట్ల మందిని నవ్విస్తూ… తెలుగు టీవీ కార్యక్రమాలకే తలమానికంలా నిలిచిన మా అభిమాన జబర్దస్త్ షో మీద అప్పుడప్పుడూ సెటైర్లు వేస్తున్నవ్, నీ మొహం, నీకసలు టేస్టుందా..? మా రామోజీరావు టేస్టుకే వంక పెట్టేంత సీనుందా నీకు..? అని సీరియస్‌గానే అడిగాడు ఓ ఫేస్బుక్ మిత్రుడు ఇన్ బాక్సులో…! తన దృష్టిలో ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత నాణ్యమైన కామెడీ అంటే మల్లెమాల ప్రొడక్షన్స్ వాళ్ల ఈ సబ్ స్టాండర్డ్ ఉత్పత్తే… సర్లె, ఒక్కొక్కరి టేస్టు ఒక్కో విధము… […]
జబర్దస్త్ జంట..! సుధీర్-రష్మికి మరో ఆల్టర్నేట్ కోసం ఈటీవీ తన్లాట..!!
సుధీర్ తనంతటతానే జబర్దస్త్ షో మానేస్తానని ఏమైనా చెప్పాడా..? ఈటీవీ నుంచి వెళ్లిపోతాను అని చెప్పాడా..? పోనీ, రష్మి ఇక టీవీ షోలు చాలు అని ఫిక్సయిపోయి, అదే విషయాన్ని మల్లెమాల ప్రొడక్షన్స్ వాళ్లకు సమాచారం ఇచ్చిందా..? దాంతో సదరు టీవీ షోల బాధ్యులు కలవరపడిపోయి, అర్జెంటుగా సుధీర్-రష్మి వంటి మరో జోడిని ప్రిపేర్ చేయాలని తహతహలాడిపోతున్నారా..? లేక ఏడెనిమదేళ్లుగా వాళ్ల లవ్ ట్రాకు నడిపిస్తున్నాం, ఇంకా ప్రేక్షకులేం చేస్తారులే, ఏజ్ బార్ అయిపోయారు, కొత్తవాళ్లను ట్రై […]
ఈటీవీకి ఓంకార్ వరుస వాతలు..! శ్రీదేవి డ్రామా ఢమాల్… కామెడీ స్టార్స్ జిగేల్…!
మొత్తానికి ఓంకార్ ఈటీవీకి చుక్కలు చూపిస్తున్నాడు… అదేదో షోలో ‘వన్ సెకండ్’ అంటూ టిపికల్ ఉచ్ఛరణ, గొంతుతో కనిపించేవాడు గుర్తుంది కదా… ఎస్, ఆ ఓంకారుడే… మాటీవీకి భలే దొరికాడు… డాన్స్ ప్లస్ అనే షోకు తనే యాంకర్… మొన్నామధ్య ఈటీవీ వాళ్ల ఢీ డాన్స్ షోను రేటింగుల్లో కొట్టేశాడు… ఇన్నాళ్లూ ఢీ పేరిట ఈటీవీ డాన్స్ జానర్లో నంబర్ వన్‌గా చెలామణీలో ఉంది కదా… దాన్ని బ్రేక్ చేసేశాడు ఓంకార్… ఈవారం కూడా ఈటీవీ ఢీ […]
తెలివైన ప్రేమి..! కార్తీకదీపం డబ్బుల్ని ఇక్కడే పెట్టుబడి పెట్టేస్తే పోలా..!!
కార్తీకదీపం టీవీ సీరియల్ హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్… ఆమె ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వదు… ఏ సినిమా, టీవీ ఫంక్షన్లలోనూ పాల్గొనదు… ఏ ప్రైవేటు పార్టీల్లోనూ ఉండదు… తన పనేమిటో తను, తరువాత గాయబ్… ఛలో కేరళ… పెద్ద గాసిప్స్ కూడా ఉండవు ఆమె మీద… తను ఆమధ్య సాక్షి టీవీ కోసం యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేసింది… సుమదీపం పేరిట… పెద్ద ఇన్ డెప్త్ ఇంటర్వ్యూ ఏమీ కాదు, ఆమె షోలలో ఉన్నట్టే కాసిన్ని సరదా ప్రశ్నలు, […]
బొమ్మ చెదిరింది..! కొందరు టీవీ కమెడియన్లను చూస్తే నవ్వు కాదు, జాలేస్తోంది…!!
ఓ వార్త కనిపించింది… ఏదో ఇంటర్వ్యూలో టీవీ కమెడియన్ వేణు మాట్లాడుతూ ‘‘బొమ్మ అదిరింది షో ఆగిపోలేదు, అది ప్రసారం అయ్యేది జాతీయ చానెల్ కదా, వాళ్ల పద్ధతి వేరే ఉంటుంది… ఆ షో ఫస్ట్ సీజన్ అయిపోయింది, సెకండ్ సీజన్ స్టార్ట్ కావల్సి ఉంది…’’ అన్నాడట… నవ్వొచ్చింది… నిజానికి నవ్వు కాదు, వేణును చూస్తే కాస్త జాలేసింది… వాస్తవానికి వేణు మంచి టైమింగ్ ఉన్న కమెడియన్… కానీ ఎక్కడో ఏదో భారీ తేడా కొడుతోంది… అందుకే […]
వావ్… దిక్కుమాలిన ఆ కార్తీకదీపం సీరియల్లో పంచ్ డైలాగులు…
ఓ దిక్కుమాలిన కథ… ఓ పనికిమాలిన కథనం… ఓ తలతిక్క సీరియల్…! నిజానికి 950 ఎపిసోడ్లుగా టాప్ వన్ సీరియల్‌గా ఉంటూ, కోట్లాది మంది ఆదరణ మాటేమిటో గానీ… కోట్లకుకోట్లు కొల్లగొడుతున్న సీరియల్ అది…! పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలను మించి… ఇకపై ఏ సీరియల్ ఈ రేటింగ్ పొందదు అనే స్థాయిలో టీఆర్పీలు కొడుతున్న సీరియల్…! కార్తీకదీపం..! దాని గురించి నెగెటివ్ కామెంట్ చేయాలంటే బాగా ఆలోచించి చేయాలి… కానీ అంత ఆలోచన అవసరం […]
సుడిగాలి సుధీర్ అంటే ఎరుపు, అరుపు, మెరుపు… పరుపు…! ఇది స్క్రిప్టు బలుపు..!!
సుడిగాలి సుధీర్ ఈటీవీ తప్ప వేరే టీవీ ప్రోగ్రాములకు వెళ్లడు… ఈటీవీకి కమిటెడ్ కేరక్టర్, నో డబుల్ గేమ్స్, తన శక్తికి మించిన ఎఫర్ట్ పెడుతూ ఉంటాడు ఈటీవీ షోల కోసం… ఐనాసరే, ఈమధ్య కావాలని తనకు కత్తెర పెడుతున్నారు, అది వేరే కథ… అయితే తనను ఓ ప్లేబాయ్‌గా చిత్రించడం మరీ శృతిమించినట్టు అనిపిస్తోంది… ఒక పరిధిలో తనను కాటరాజు, రేయింబవళ్లూ అమ్మాయిలే తన ధ్యాస అన్నట్టుగా అని కాస్త సరదాగా ఆటపట్టిస్తే, ఏడిపిస్తే, తనూ […]
ఈటీవీకి షాక్..! ఢీ షోను కొట్టేసిన డాన్స్ ప్లస్..! దెబ్బకు మల్లెమాల గింగరాలు..!
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎప్పుడో… ఈ పాట గుర్తుందా..? బ్రహ్మాండమైన మ్యూజిక్ కంపోజిషన్… చిన్న చిన్న స్టెప్పులతో, మంచి గ్రేస్‌తో చిరంజీవి ఇరగదీస్తాడు… అయితే ఆ పాటకు తగిన చిత్రీకరణ ఆ దర్శకుడెవరో గానీ చేతకాలేదు… ఇంకాస్త శ్రద్ధ పెట్టి, చిరంజీవిని ఫుల్లుగా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే, ఆ పాట ఇంకెక్కడికో వెళ్లి ఉండేది… ఇదెందుకు చెప్పుకోవడం అంటే… ఈటీవీలో డాన్సు ప్రధానంగా ఢీ అనే ఓ ప్రోగ్రాం వస్తుంది కదా… పదవ తారీఖున ప్రసారం చేయబోయే […]
- « Previous Page
- 1
- …
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- Next Page »