శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎప్పుడో… ఈ పాట గుర్తుందా..? బ్రహ్మాండమైన మ్యూజిక్ కంపోజిషన్… చిన్న చిన్న స్టెప్పులతో, మంచి గ్రేస్‌తో చిరంజీవి ఇరగదీస్తాడు… అయితే ఆ పాటకు తగిన చిత్రీకరణ ఆ దర్శకుడెవరో గానీ చేతకాలేదు… ఇంకాస్త శ్రద్ధ పెట్టి, చిరంజీవిని ఫుల్లుగా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే, ఆ పాట ఇంకెక్కడికో వెళ్లి ఉండేది… ఇదెందుకు చెప్పుకోవడం అంటే… ఈటీవీలో డాన్సు ప్రధానంగా ఢీ అనే ఓ ప్రోగ్రాం వస్తుంది కదా… పదవ తారీఖున ప్రసారం చేయబోయే […]
ష్… నిశ్శబ్దం..! అనుష్క ఇమేజీకి గట్టి దెబ్బేపడింది… చెప్పుకునేట్టు లేదు..!!
అనుష్క శెట్టి… తెలుగు టాప్ స్టార్… ఆమే రేంజ్ నంబర్ వన్… ఎహె, తెలుగు ఏమిటి..? బాహుబలి తరువాత పాన్ ఇండియా స్టార్ ఆమె… తమిళం, మళయాళం, కన్నడ… వాట్ నాట్..? కానీ కేవలం ఆమె మొహాన్ని చూడటానికి… లేదా కష్టపడింది కదా, బక్కపడిందా లేదా చూడటానికి ప్రేక్షకుడు థియేటర్‌కు రాడు… ఓటీటీలో ఆ సినిమాను క్లిక్ చేయడు… టీవీ ముందు కూర్చోడు… సినిమాలో కథోకాకరకాయో కాస్త నచ్చాలి… అంతే కదా… అవును, అంతే… తాజా టీవీ […]
అనుశ్రీ..! ఐదే నిమిషాల సీన్‌తో మొత్తం హైజాక్ చేసిపారేసింది…!
నిన్ననే కదా, ఆనంది అనే తెలుగు నటిని మన తెలుగు ఇండస్ట్రీ దూరం పెట్టిన విధానం చెప్పుకున్నాం… ఇప్పుడు జాంబిరెడ్డి సినిమాతో మళ్లీ మనవాళ్లను పలకరిస్తోంది… ఘర్కీ ముర్గీ దాల్ బరాబర్, ఇంటికోడి పప్పుతో సమానం అని మాట్లాడుకున్నాం కదా… మరో తెలుగు నటి ఉంది… కానీ టీవీ నటి… మన తెలుగు నటి… గుడివాడ… మొదట్లో ఒకటీఅరా చిన్నాచితకా సినిమాల్లో చేసినా, మన పప్పు దర్శకులు ఆమె నుంచి నటనను ఎక్స్ప్లోర్ చేయలేక వదిలేశారు… తరువాత […]
డర్టీ డ్రామా కంపెనీ..! ఈటీవీలో శృతి మించిన ఇమాన్, వర్ష లవ్‌ట్రాక్..!!
ప్రతి ఆదివారం కామెడీ మన్నూమశానమూ నింపి మాటీవీ, ఈటీవీ కొత్త ప్రోగ్రాములను తీసుకొచ్చాయి కదా… మధ్యాహ్నం టైములో ఓంకార్ నిర్మించే కామెడీ స్టార్స్ మాటీవీలో… మల్లెమాల ఎంటర్టెయిన్మెంట్ సమర్పించే శ్రీదేవి డ్రామా కంపెనీ ఈటీవీలో… ఈ రెండూ ఫస్ట్ రోజే చతికిలపడ్డాయి… పెద్ద ఇంప్రెసివ్‌గా ఏమీ లేవు… ఏదో యాడ్స్ కోసం నాసిరకం స్కిట్లను కలిపి కుట్టి ప్రజెంట్ చేసినట్టే ఉన్నయ్… రెండూ అంతే… మాటీవీ వాడు ఏడో తారీఖున ఉత్సవం అంటూ బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో మరో […]
గోల్డెన్ ప్రైమ్ టైం..! ఓంకార్ ఫ్లాప్ షోకు కారణమేంటో తెలిసిపోయింది..!!
ఆదివారం… రాత్రి 9 గంటల సమయం… టీవీలకు అతి కీలకమైన ప్రైమ్ టైమ్… యాడ్స్ ఎక్కువ, రీచ్ ఎక్కువ, వీక్షకులు ఎక్కువ… అందుకని ఆ గోల్డెన్ టైమ్ వేస్ట్ చేసుకోవు ఏ టీవీ అయినా… ఏదైనా మంచి ప్రోగ్రాంతో రేటింగ్స్ పొందే ప్రయత్నం చేస్తుంది… మాటీవీ వాడు ఓంకార్ నిర్వహించే డాన్స్ ప్లస్ షోకు విపరీతమైన ప్రాధాన్యమిచ్చి, ఆ టైమ్‌లో ప్రసారం చేస్తున్నాడు… ఆరుగురు జడ్జిల ఓవరాక్షన్ ప్లస్ ఓంకార్ అనే చీఫ్ జస్టిస్ ఆ షోను […]
సుడిగాలి సుధీర్..! చివరకు ఈటీవీ జబర్దస్త్కూ పాకిన ఆ పైత్యం..!
యాడ్స్… వాణిజ్య ప్రకటనలు… పత్రికలు, సైట్లు, టీవీలు, హోర్డింగులు, రేడియోలు, సినిమాలు… ఎన్నిరకాలుగా ప్రజల బుర్రల్లోకి ఎక్కించాలో అన్నిరకాలుగానూ ఎక్కిస్తున్నారు… కొత్త కొత్త మార్గాలు వెతికి మరీ కుమ్మేస్తున్నారు… బస్సు టికెట్ల నుంచి దర్శనం టికెట్ల దాకా… యాడ్స్ సోకని సరుకు లేదు… ఎప్పుడూ టీవీలు చూసేవాళ్లకు తెలుసు… మరీ ప్రధానంగా తెలుగు టీవీ సీరియళ్లు… ఎపిసోడ్ అయిపోతుంటే మూడు నిమిషాలు, ఒక్క డైలాగ్, మళ్లీ మూడు నిమిషాలు… ఇలా ఉంటయ్ యాడ్స్… సీరియళ్ల మధ్యలో కూడా […]
ఫాఫం సుమ..! ఈ దిక్కుమాలిన షో ఎందుకు ఒప్పుకొంటిరా దేవుడోయ్…!!
కేవలం యాంకర్ల పేరుతో షోలు, హీరోలతో సినిమాలు నడవవు… పెద్ద పెద్ద హీరోల సినిమాలు మొదటి ఆటకే తన్నేసిన ఉదాహరణలు బోలెడు… వంట కుదరాలి… అప్పుడు హిట్టో ఫ్లాపో తేలేది… మా అభిమాన హీరో ఉన్నాడు కదాని ‘ఉప్పూకారం లేని బిర్యానీ’ ఎవడూ తినడు… టీవీ షోలు కూడా అంతే… షోలో దమ్ముండాలి… అంతే తప్ప, మా అభిమాన సుమ చేస్తున్నది కాబట్టి బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ అనే షో చూస్తాం, మా అభిమాన ప్రదీప్ చేస్తున్నాడు […]
ఆరుగురు జడ్జిలు + ఓ చీఫ్ జస్టిస్… భీకర పర్ఫామెన్స్… రేటింగ్‌లో మాత్రం ఫట్..!!
హేమయ్యా… హోంఖారూ… హన్ని టీవీ షోలు చేసినవ్… ఖర్చు కాదు, ఒక టీవీ షో క్లిక్ కావాలంటే కాస్త క్రియేటివిటీ, కొత్తదనం, కమిట్మెంటు కనిపించాలి ఖదటోయ్… హేమో, నువ్వు బొచ్చెడు ఆశలు పెట్టుకున్న డాన్స్ ప్లస్ అనబడే టీవీ షో అడ్డంగా తన్నేసిందేమిటి..? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నావా..? అదేదో షోలో ‘వన్ సెకండ్’ అంటూ విచిత్రమైన స్టోన్‌తో ట్విస్టులు ఇచ్చేవాడివి కదా… జనం కూడా ఈ డాన్స్ ప్లస్ షో కనిపించగానే… ‘వన్ సెకండ్’ అంటూ […]
ఫాఫం, నాగార్జున బాటలో దర్శకేంద్రుడు… ఇమేజీకి బురద, బుర్రకు మకిలి…
ఇండియన్ ఐడల్ రేవంత్… ప్రసిద్ధ సంగీత దర్శకురాలు శ్రీలేఖ… వీళ్లు పాటల పోటీలకు జడ్జిలు అయితే… కనీసం ఎదుట నిలబడిన సింగర్ స్వయంగా పాడుతున్నదో, వెనుక నుంచి ఇంకెవరో పాడుతుంటే లిప్ మూమెంట్ ఇస్తున్నదో కూడా కనిపెట్టలేరా..? ఫాఫం… ఆ ప్రొమో చూస్తే నవ్వొచ్చింది… అనేకానేక హిట్ సినిమాల్ని తీసిన బొడ్డు రాఘవేంద్రరావు పేరు సమర్పకుడిగా ఆ ప్రొమోలో చూస్తే నవ్వు రాలేదు, జాలేసింది… 78 ఏళ్ల వయస్సులో… అన్నీ చాలించుకున్న వేళ… మళ్లీ ఏదో తిరగబెడుతున్నట్టుంది… […]
సరికొత్త డ్రామా కంపెనీ… ఈటీవీ షో అంటేనే కామెడీ అయిపోయింది…
మీరు ఈటీవీ చూస్తుంటారా..? జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్… మరో నాలుగు రోజులు పోతే జబర్దస్త్ ఓల్డ్ రీమిక్స్, జబర్దస్త్ ఓల్డ్ గోల్డ్ వంటివీ రావచ్చు అది వేరే సంగతి… అన్నీ కామెడీ అనబడే బూతుపురాణాలే అనేదీ వేరే సంగతే… అవి గాకుండా క్యాష్… అది ఓ కామెడీ కిట్టీ పార్టీ… ఢీ… పేరుకు సర్కస్ ఫీట్లు అనబడే డాన్స్ షో, అందులోనూ కామెడీయే ప్రధాన సరుకు… వావ్, కంటెస్టెంట్లతో సాగించే కిట్టీ పార్టీ […]
రోజాతో ఢీకి ఓంకార్ సై..! వర్షిణికి భలే చాన్స్..! అసలేం జరుగుతున్నదంటే..?!
పాత్రలు ఒక్కసారిగా పల్టీకొట్టడం అంటే ఇదే… అసలు ఈటీవీ జబర్దస్త్ షో అంటేనే నేను, నేను లేకపోతే అది లేదు అనుకుని, జీతెలుగు వాడి కళ్లకు గంతలు కట్టి, అదిరింది అనే కాపీ కామెడీ షో స్టార్ట్ చేసి, ఏవేవో ప్రయోగాలు చేసి, చివరకు దాన్ని ఫ్లాప్ చేసి, సొంతంగా యూట్యూబ్ చానెల్‌కు పరిమితం అయిపోయాడు నాగబాబు… ఈ దెబ్బకు బజార్నపడిన కమెడియన్లను ఇప్పుడు కామెడీ స్టార్స్ పేరిట మాటీవీ ఓ కొత్త కామెడీ షో ద్వారా […]
సుమ..? ప్రదీప్..? అనసూయ..? నో, నో… రష్మి అంటేనేే ప్రేక్షకులకు లవ్వు..!
తెలుగు టీవీ టాప్ యాంకర్ ఎవరు..? అంటే, ప్రేక్షకుల్లో పాపులర్ ఎవరు అని..! సాధారణ పాఠకుడికి ఇది పిచ్చి ప్రశ్న… కానీ రెగ్యులర్‌గా టీవీ ప్రోగ్రామ్స్ చూసేవాళ్లకు కాస్త ఇంట్రస్టింగు ప్రశ్నే… ప్రశ్న చదవగానే వెంటనే… చాలామంది ‘‘ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏముంది..? ఏజ్ బార్ కనకాల సుమ ఫిమేల్ నంబర్ వన్ యాంకర్… సేమ్ ఏజ్ బార్ ప్రదీప్ మేల్ నంబర్ వన్ యాంకర్… మిగతావాళ్లు ఎవరూ వాళ్లను రీచ్ కాలేరు’’ అని తేలికగా చెప్పేస్తారు… […]
జీతెలుగు చానెల్‌కు పగిలిపోయింది… సంక్రాంతి వంటకాలు ‘స్టమక్ అప్సెట్’…
దొరుకుతున్నది కదాని ఆబగా తినేయాలని ప్రయత్నించకూడదు… అది ఎదురు తన్నే ప్రమాదముంది…! ఈ సత్యం చాలామందికి తెలుసు… కానీ జీటీవీ వాడికి తెలియదు… అందుకే అడ్డంగా బోల్తాకొట్టాడు… తలబొప్పికట్టింది… చేతులు, మూతులు కాలినయ్… ఇప్పుడు ఆకులు పట్టుకుంటాడేమో ఇక…! అర్థం కాలేదా..? సంక్రాంతి వేళ రెండురోజులపాటు రెచ్చిపోయి ప్రత్యేక షోలు ప్రసారం చేశాడు కదా… ఇప్పుడు విశేషం ఏమిటో తెలుసా..? రేటింగ్స్‌లో ఎక్కడో కొట్టుకుపోయాయి ఆ రెండు ప్రోగ్రాములూ… తాజా రేటింగ్స్‌లో టాప్ 30 జీ చార్ట్ […]
సుమ..! కేవలం సోలో షో..! కాదంటే ఫ్లాపే… ఇదీ తాజా ఉదాహరణ…!!
సుమ..! తెలుగు జగమెరిగిన గజ వ్యాఖ్యాత… ప్రస్తుత వెబ్ భాషలో అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే… టాప్ యాంకరిణి..! ఆమె పరిచయం చెప్పడం అంటే అదొక ఫూలిష్ ప్రయత్నమే… కానీ మరీ టాప్, టాపర్, టాపెస్ట్ ఏమీ కాదు… బోలెడు ఫెయిల్యూర్స్… తాజాగా జీటీవీ కోసం చేస్తున్న బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ అనే టీవీ షో..! సుమ ఏం చేసినా సక్సెసే అనేది పెద్ద అబద్ధం… ఆమె కొన్నింటికే పరిమితం… తన స్పాంటేనిటీ, తన ఎనర్జీ, తన ఫ్లూయెన్సీ, తన […]
సుధీర్- రష్మి బంధానికీ కత్తెర..! ఆల్టర్నేట్ జోడీని రుద్దుతున్నారు..!!
ఫాఫం, సుడిగాలి సుధీర్ మీద సానుభూతి ప్రవాహం ఇంకా ఆగడం లేదు తెలుగు నెటిజన్లలో…! మునుపెన్నడూ లేనిది, అకస్మాత్తుగా ఓ పండుగ స్పెషల్ షో నుంచి ఈటీవీ, మల్లెమాల కలిపి తప్పించారు కదా… అసలు సుధీర్ లేకుండా ఈటీవీలో స్పెషల్ షో ఏమిటని తెలుగు టీవీ ప్రేక్షక సమాజం బిత్తరపోయింది కదా… ఎవరెవరో ఏదేదో రాసేశారు… ఇక సుధీర్‌కు ఈటీవీలో కత్తెరే, మల్లెమాలకు కోపం వస్తే ఇక ఎక్కడికక్కడ పీలికలే అనే వార్తలు కూడా బోలెడు రాసేశారు […]
జీటీవీ రుచిమరిగింది..! ఎందుకు వదులుతుంది… వరుస దరువులు..!!
గతంలో పండుగ లేదా ప్రత్యేక సందర్భం ఏది వచ్చినా సరే… ఈటీవీ స్పెషల్ ప్రోగ్రామ్స్‌తో ముందంజలో ఉండేది… ఆ జబర్దస్త్ టీం కమెడియన్లకే తలా కొంత తాయిలం పెట్టేసి, ఓ మూడు గంటల ప్రోగ్రామ్ చేసి వదిలేది… దీనివల్ల ఈటీవీకి యాడ్స్ డబ్బులు ప్లస్ రీచ్ ప్లస్ రేటింగ్స్ ప్లస్ నాన్-ఫిక్షన్ కేటగిరీలో పైచేయి… ఇవన్నీ దక్కేవి… మాటీవీ చేస్తే బిగ్‌బాస్ వంటి పెద్ద పెద్ద రియాలిటీ షోలు తప్ప ఈ పండుగ స్పెషల్స్ గట్రా ఆనేవి […]
ఆశిక పడుకోన్..! ఈ త్రినయని తెలుగు టీవీని దున్నేస్తున్నది..!
త్వరలో కార్తీకదీపం ముగియబోతోంది… దీపా పాత్రధారి ప్రేమి విశ్వనాథ్ ఏ కారణాల చేత టాప్ టీవీ స్టార్ అయ్యిందో పక్కనపెడితే… ఇక ఆమె తెలుగులో ఇప్పట్లో వేరే టీవీ సీరియల్లో రాకపోవచ్చు… ఆమె సినిమాల్లో నటించనుంది… వదినమ్మలోని సుజిత పని అయిపోయింది… దాని రేటింగ్స్ ఘోరంగా పడిపోయినయ్… గృహలక్ష్మి కస్తూరి, దేవత సుహాసిని ఎట్సెట్రా ఒకరిద్దరు ఏ రేటింగుల మాయ పుణ్యమో వెలుగుతున్నారు… కానీ అశిక పడుకోన్ గురించి చెప్పుకోవాలి ఓసారి… ఒక సీరియల్లో నటిస్తూ… మొదటిసారి […]
మాటీవీని దాటిన జీటీవీ..? తెలుగు టీవీ చానెళ్ల ఫైట్ ఇప్పుడు రక్తికట్టింది..!!
మాటీవీని జీటీవీ దాటేసింది..! తెలుగు టీవీ సర్కిళ్లలో ఒక్కసారిగా విపరీతంగా ప్రచారం అవుతున్న వార్త ఇది… అంతేకాదు, జీ తెలుగు వాడు ఇదుగో ఇలా ఓ మెసేజ్ బాగా సర్క్యులేట్ చేస్తున్నాడు… డీజే పెట్టుకుని జీటీమ్స్ తీన్మార్ డాన్సులు చేస్తున్నయ్… ఫుల్ జోష్… నిజమే మరి… రేటింగ్స్ మాయగాడు మాటీవీని దాటేయడం అంటే మాటలా..? దాన్ని కొట్టేయడం అంటే మజాకా..? మాటీవీ మొహం పగిలిపోవడం అంటే పెద్ద వార్తే… అయితే..? ఇక్కడ కొన్ని తిరకాసులున్నయ్… అవి చెప్పుకుందాం.,. […]
థూమీబచె..! ఇదేం ఖర్మరా తండ్రీ… సంక్రాంతి పండుగ అంటే ఇదా..?
ఒక ఈటీవీ లేదా ఒక మల్లెమాల యాజమాన్యాలకో… లేదా ఇంకెవరో టీవీ చానెల్ ప్రబుద్ధుడికో… అంత లోతయిన అవగాహన ఉంటుందని అనుకోలేం కానీ…. పండుగపూట కాసిన్ని మంచి ముచ్చట్లు చెప్పుకోవాలనే మినిమం సోయి మాత్రం ఉండాలి కదా…! ఈమాట అనడానికిముందు ఓ సంగతి చెప్పాలి… ప్రపంచవ్యాప్తంగా పత్రికలు ఇప్పుడు ఓ ట్రెండ్ పాటిస్తున్నయ్… ఓ పెద్ద పేలుడో, ప్రమాదమో, విపత్తో… వంద మంది మరణించవచ్చుగాక, రక్తం ఏరులైపారవచ్చుగాక… ఫస్ట్ పేజీలో ఆ నెత్తుటివాసన కనిపించకూడదు… మనిషిని డిస్టర్బ్ […]
డాన్స్ ప్లస్..! అంటే సర్కస్ ఫీట్లే కాదు… తెలుగు భాషపై పోట్లు కూడా…!!
మొన్నమొన్నటిదాకా సాగిన బిగ్‌బాస్ గురించి చెప్పి మళ్లీ విసిగించడం కాదు… అందులో అమ్మారాజశేఖర్ అనే కంటెస్టెంటు తన కిలికిలి భాషతో తెలుగు ప్రేక్షకుల దుంపతెంచాడు… ఆ నీచ బిగ్‌బాసుడికి ఆ భాష తెలుగులా వినిపించేది, మోనాల్‌ను మాత్రం తెలుగు నేర్చుకో అని ఉరిమేవాడు… హారిక, అభిజిత్‌లపై అరిచేవాడు… మన ఖర్మ అనుకున్నాం… రాజశేఖర్ బిగ్‌బాస్ వదిలేరోజున యావత్తు తెలుగు ప్రేక్షకజనం ఆనందాశ్రువులతో వీడ్కోలు పలికి పండుగ చేసుకున్నారు… ఎవరో అడిగారు ఫేస్బుక్లో… ‘‘ఒరేయ్ బిగ్‌బాసూ, చాలా భాషల్లో […]