Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

header-new-unit-muchata.com
  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫ్యానిజం..! బుర్రలు మోకాళ్లలోకి దిగిపోతయ్… థియేటర్లనూ కాలబెడతారు..!!

April 1, 2021 by M S R

హీరో అంటే… దైవాంశ సంభూతుడు… ఎహె, కాదు… కాదు… దేవుడే… వ్యక్తిపూజలో భ్రష్టులైన వాళ్లకు ఇక చెప్పేదేమీ ఉండదు… వాళ్లంతే… ఒరేయ్, మీ హీరో పాటలో ఓ వాక్యం మొత్తం పాటే చెడగొట్టిందిరా నాయనా… ఆ గీతరచయిత మేన్షన్ హౌజు హ్యాంగోవర్‌లో పిచ్చి సాహిత్యం మీమొహాన కొట్టాడురా బాబూ… మీ హీరో స్టెప్పుల చిత్రీకరణలోె కొరియోగ్రాఫర్ ఫలానా తప్పు చేశాడురా… మీ హీరో పాటలోని సెట్టింగులో ఫలానా తప్పుందిరా… మీ హీరో సినిమా టైటిల్స్‌లో ఫలానా అక్షరదోషం పడిందిరా అన్నా సరే, ఫ్యాన్ అనేవాడు ఒప్పుకోడు… ఒప్పుకుంటే వాడు ఫ్యానే కాదు… అసలు ఫ్యాన్ అంటేనే తన మెదడును ఇంట్లో పదిలంగా దాచుకుని బయట తిరిగేవాడు… వాడికి మంచి చెప్పినా సమజ్ కాదు… ఇలాంటోళ్లే సమాజానికి హానికరం… నిష్ఠురంగా ఉన్నా సరే, ఇదే నిజం… ఈమధ్య కర్నాటకలో వాడెవడో ప్రముఖ పాత హీరో కొడుకు సినిమా విడుదల సందర్భంగా పెద్ద ఎత్తున ఊరేగింపు, గజమాలలు, బాణాసంచా…. కరోనా తన కోరలకు ఇంకాస్త పదును పెట్టుకుంది… అయితేనేం..? సదరు పాత హీరో కొడుకుగారు పదిలంగానే ఉంటాడు, ఎటొచ్చీ చచ్చేది సగటు అభిమాని… పోతేపోనీ, అభిమానే కదా, వాడు బతికితే ఎంత..? చస్తే ఎంత..?

fan

ఇదీ అలాంటిదే… అదే హీరో… Puneeth Rajakumar … Yuvaratna సినిమా రిలీజ్… థియేటర్‌లో ఫస్ట్ డే ఫ్యాన్స్ అనబడే మూర్ఖజాతికి అడ్డూఅదుపూ ఏముంటుంది..? థియేటర్‌లోనే బాణాసంచా కాల్చేశారు… చిచ్చుబుడ్లు, కేకలు, ఈలలు, డాన్సులు… ఎప్పటిలాగే పేపర్ కాగితాల ముక్కలు, చిల్లర నాణేలు, నినాదాలు…. పాత రాతియుగంలోకి వెళ్తున్నట్టుగా ఉంటుంది… కానీ హీరోకు ఆనందం… వాళ్లే తన బలం… ఇలాంటోళ్లే ఓటీటీలను వ్యతిరేకిస్తారు… ఆన్‌లైన్ వాచింగును అడ్డుకుంటారు… వాడికి ఫ్యాన్స్ కేకలు, మూర్ఖత్వమే కావాలి… అందుకే కరోనా ప్రబలుతున్నా సరే, థియేటర్లలో వంద శాతం యాక్యుపెన్సీ కావాలని అంటారు… సమాజం గురించి ఆలోచిస్తే సినిమా హీరో ఎందుకవుతాడు..? వాళ్లు ఫ్యాన్స్ ఎందుకవుతారు..? పైగా మేం ఫలానా ఫ్యాన్స్ అని ఘనంగా చెప్పుకుంటారు… థూమీబచె…

https://muchata.com/wp-content/uploads/2021/04/167214102_283258033172507_7438560540808063440_n.mp4

పైన వీడియో చూశారు కదా… అదీ సంగతి… రేప్పొద్దున తెలుగునాట… అదేలెండి, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ… పునరావృతం అయితే తప్పుపట్టకండి… ఫ్యాన్స్ ఎక్కడైనా ఒకేతరహా…! ఏదో ట్రెయిలర్ రిలీజ్ ఫంక్షన్‌కు అనుమతి ఇవ్వకపోతే దిల్ రాజు అనబడే ఇండస్ట్రీ రారాజుకు కోపం… తెలంగాణ పోలీసులపై అక్కసు… ఎస్, ఈ మూర్ఖ సామ్రాజ్యాలకు విరుగుడు ఓటీటీ వేదికలే… ఈ దిక్కుమాలిన ఫ్యాన్స్ ఆగడాలకు అదే విముక్తి… ఎవడింట్లో వాడు చూస్తాడు… రామజోగడు గారి చివరి వాక్యాల సాహిత్యపు పైత్యాన్ని గమనిస్తారు… మణిశర్మ ట్యూన్ ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చాడబ్బా అని ఆరాలు తీస్తారు… సోషల్ మీడియాలో చాకిరేవు పెడతారు…

చివరగా…:: దుమ్మురేగినప్పుడు నిజాలు కనిపించవు… ఫ్యాన్స్ కళ్లకు రియాలిటీ అర్థం కాదు… దుమ్ము నేలకు దిగిపోయాక, అన్నీ క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తాయి… థూ, చివరకు ప్రాణాలకు తెగించి వ్యవస్థ మార్పు కోసం పోరాడే నక్సలైట్లనూ చిల్లర తెలుగు కుమ్ముడు స్టెప్పుల హీరోలుగా దిగజార్చారు కదరా అని అసహ్యమేస్తుంది… కాకపోతే ఈ లిరికల్ సాంగులు, ప్రిరిలీజ్ హైపులు, స్వోత్కర్షలు, స్వచకుమర్దనాల ఘట్టాలు అయిపోవాలి అంతే… అన్నట్టు ఆఫీసర్, నేలటికెట్టు, అజ్ఙాతవాసి, బ్రహ్మోత్సవం, అంజి ఎట్సెట్రా చాలా సినిమాల ఫలితాలు గుర్తున్నాయి కదా… అదీ సంగతి… dont under estimate telugu viewer…

#PuneethRajkumar, #yuvaratna, #acharya, #vakeelsaab

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • తెలుగు నెటిజనం ఆడేసుకుంటున్నారు… పకపకా నవ్వేసుకుంటున్నారు…
  • ఏపీ పాలిటిక్స్..! మరీ కులం బురద రేంజ్ దాటి… అచ్చెన్నాయుడు స్థాయికి…
  • ట్యూన్ కాదుర భయ్… కంటెంటే అల్టిమేట్… కాదంటే వీళ్లను అడగండి…
  • జగన్ ఆ టార్గెట్ కొడితే… చంద్రబాబు ఇక రిటైర్ అయిపోవడమే బెటర్…
  • పీవీ మార్క్ ప్రశ్న… సమాధానం చెప్పలేక అంతటి అవధానీ చేతులెత్తేసి…
  • ఇదే ప్లవ ఉగాది… 60 ఏళ్ల క్రితం… నాటి ఆంధ్రపత్రిక ప్రత్యేక సంచిక అదుర్స్…
  • బీబీసీ..! మరీ తెలుగు మీడియా టైపు అంత ఏడుపు వద్దులేరా నాయనా…!!
  • గత్తర..! పీనుగుల్ని కాల్చీ కాల్చీ దహనయంత్రాలే పీనుగులవుతున్నయ్…
  • తెలుగులో మంచి కథకులు ఎవరూ లేరు..! తేల్చిపారేసిన ఈనాడు..!!
  • సారంగదరియా సరే… మరి ఈ బేట్రాయి స్వామి దేవుడి ఖూనీ మాటేమిటి..?!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now