Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

header-new-unit-muchata.com
  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అయ్యా మోడీజీ… ఈ ఫాస్టాగ్ దరిద్రం మా నెత్తిన దేనికి తండ్రీ..?!

December 31, 2020 by M S R

అప్పుడెప్పుడో కేసీయార్ అన్నట్టు గుర్తు…! ‘‘మోడీ జనానికి కనెక్ట్ కాడు’’… అది అక్షరాలా నిజం… దేశప్రజలకు వీలైనంత రిలీఫ్ ఇవ్వాలనే ఆలోచన ఏ కోశానా ఉండదు మనిషికి… పక్కా కార్పొరేట్ ధోరణి… ఎవడెలా చస్తే మనకేంటి అన్నట్టుగానే ఉంటుంది… మరేం చేస్తాం, ఒక్క దీటైన నాయకుడూ ప్రతిపక్షంలో ఉంటే కదా.., తెలంగాణలో దీటైన ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం కేసీయార్‌కు బలం ఎలాగో… జాతీయ స్థాయిలో ఎవరూ లేకపోవడం మోడీ బలం… అంతే… కానీ అదే జనరంజక పాలనకు గుర్తు కాదు… అల్టిమేట్ నాయకత్వం అనడానికీ వీల్లేదు… జాతి అసహాయ దుస్థితి… అంతే…

fastag

ఉదాహరణకు ఫాస్టాగ్… అంటే టోల్ గేట్ల నుంచి వేగంగా వాహనాల్ని అనుమతించడానికి, జాప్యం లేకుండా చేయగల ఓ పద్ధతి… ముందే డబ్బులు ఏ బ్యాంకులోనో కట్టేసి, ఆ ట్యాగ్ వాహనాల ముందు అతికించుకుంటే… ఈ గేట్ల నుంచి డిజిటల్ పద్ధతిలో గమనించి, డబ్బు కట్ చేసుకుని, వేగంగా వెళ్లనిస్తారు… ఠాట్, జనవరి ఫస్ట్ నుంచి ఇది ఉండాల్సిందే, లేకపోతే తాటతీస్తాం, ఫాస్టాగ్ లేకపోతే డబుల్ చార్జీలు వసూలు చేస్తాం, అసలు వెళ్లనివ్వం అన్నట్టుగా బెదిరించింది మోడీ ప్రభుత్వం…

అసలే కరోనా కష్టాల్లో జనం ఉన్నారు అనే సోయి ఏమాత్రం లేనిది మోడీ ప్రభుత్వం… అది ప్రకటించే ఆత్మనిర్భరాలు జస్ట్, జనాన్ని మరిన్ని కష్టాల నుంచి నిబ్బరంగా నిలబడాలని బోధించేవే… అంతకుమించి ఎవడి కడుపు నింపేవి కావు, ఎవడినీ ఉద్దరించేవి కావు… ఇదీ అంతే… సేమ్, కేసీయార్ మార్క్ ఎల్ఆర్ఎస్…

అసలు టోల్ వసూళ్లే పెద్ద స్కాం… రోడ్డు వేయటానికి ఎంత ఖర్చయ్యిందనే లెక్కలు, వాటి వసూలు లెక్కలే ఒక్కొక్కటీ ఓ స్కాం… అదెవరికీ అంతుపట్టదు… నేషనల్ హైవే అధికారుల అవినీతి, బాధ్యుల అక్రమాలు, సదరు సంస్థల దోపిడీ… ఈ పీడ నుంచి జనాన్ని రక్షించాల్సిన మోడీ ఆ కార్పొరేటు దోపిడీకి మరింత మద్దతు పలుకుతూ… ఆ కంట్రాక్టు సంస్థలకే ఉపయోగపడేలా ఈ ఫాస్టాగ్ ఆంక్షలు…

అరె, ఆ సంస్థలు చేసేదే దోపిడీ, ఏదోలాగా దోచుకుంటాయి కదా… మళ్లీ మోడీ మార్కు మద్దతు దేనికి..? అసలే గడ్కరీ అనే బాసు… తనపై ఉన్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు… అవెందుకు మోడీ ఆలోచించడు..? ఎందుకంటే బేసిక్‌గా తనూ భిన్నం కాదు కాబట్టి… తనపై అవినీతి మరకలు లేవు, కానీ… ‘న ఖావుంగా’వరకూ కరెక్టే… కానీ… న ఖానే దూంగా అనేది ఎవరూ నమ్మరు…

ఇప్పుడు ఏం చేశాడు..? ఫిబ్రవరి 15 వరకూ ఈ డెడ్‌లైన్ సడలించాడు… సరే, మంచిదే, ఆ తరువాత అయినా కత్తి వేలాడుతూ ఉంటుందిగా… ఏ ప్రాజెక్టుకైన ఖర్చు ఎంత, వసూలైంది ఎంత, ఇంకా ఎంతకాలం ఉంచాలి అనే రివ్యూ జరుగుతోందా అసలు..? అదెందుకు పట్టించుకోడు మోడీ… గడ్కరీ అంటే భయమా..? కార్పొరేట్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలు అంటే ప్రేమా..? జనం మీద ఆ ప్రేమ అక్కర్లేదా..? ఈ అయిదారేళ్లలో లక్షల కోట్ల డబ్బు పెట్రో, డీజిల్ రేట్ల పేరిట సమకూరింది… ఈ టోల్ అనే తోలు తీసే ప్రక్రియను రద్దు చేయొచ్చు కదా…! అబ్బే, జనానికి వీసమెత్తు ప్రయోజనం కల్పించే ఆలోచన అంటేనే మోడీ ఆమడ దూరం పరుగుతీస్తాడు…! మరో నాలుగు ఫోటోఫోజులు పెట్టమనండి… రెడీ…!!

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • హిమ స్వర్ణం..! ఇండియన్ సోషల్ మీడియా సంబరం… చాలా అరుదు..!
  • సోప్ వేసిన సోప్ ప్రకటన..! తెల్లటి మాయకు తెలివైన ప్రయాస..!!
  • చెక్ నితిన్..! ఎంత ఏలేటి అయితేనేం… కమర్షియల్ లెక్కల్లో బోల్తా…!!
  • వజ్రాన్ని నేను…! నీరవ్ మోడీ అంతరాత్మ బహిరంగ లేఖ..!
  • ఇంట్రస్టింగు తీర్పు…! మహిళ పుట్టింటివారికీ ఆస్తిలో వారసత్వహక్కు..!!!
  • డంకీ బిర్యానీ… డంకీ కబాబ్స్… డంకీ బర్గర్స్… లొట్టలేస్తున్నారట ఏపీజనం..!!
  • లెఫ్ట్, రైట్ కలిసి… రైట్ రైట్..! బెంగాల్‌లో బద్ధవైరుల నయా దోస్తానా..!!
  • బాబోయ్… ఇదేం వార్తారచన తండ్రీ… ఈనాడును ఏదో పాము కాటేసింది…
  • రైల్వే ప్రయాణాలు తగ్గించండి… లేకపోతే చార్జీలు ఇంకా పెంచేస్తాం…
  • దక్షిణ కుంభకోణం..! పూజారుల భారీ మోసాల్ని పట్టేసిన కేరళ సర్కారు..!!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now