Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గండరగండడు కేసీయార్… అందరూ తనను అండర్ ఎస్టిమేట్ చేశారు…

December 14, 2020 by M S R

సమకాలీన తెలంగాణ రాజకీయ నాయకుల్లో గండరగండడు కేసీయార్… ఏ అడుగు వేసినా, ఏం ఆలోచించినా అది పరులెవ్వరికీ అంతుపట్టని రాజకీయం… తను ఎవరికీ కొరుకుడు పడడు… చాలామందికి అసలు అర్థమే కాడు… బయట ప్రచారంలో ఉండేది వేరు… తన పయనించే బాట వేరు… తన ఢిల్లీ పర్యటన ఒక్కసారిగా పొలిటికల్ సర్కిళ్లను ఏం విశ్లేషించుకోవాలో అర్థం కాని అయోమయంలోకి నెట్టేసింది… కేసీయార్‌కు కావల్సింది కూడా అదే… జస్ట్, అలా సైలెంటుగా వెళ్లాడు… ప్రధానిని, అమిత్ షాను కలిసిన ఫోటోలు తప్ప, ఇతర వివరాలేమీ బయటికి రావు… రానివ్వడు…

ప్రధానిని, అమిత్ షాను కలిసిన ఫోటోలు జనంలోకి వెళ్లాలి కాబట్టి అవి అనుమతించాడు… అంతే ఇక… ఎవరు ఏమైనా రాసుకోనీ… తనకు చింత లేదు… రాజకీయాలు చాలా సంక్లిష్టం… అవి సోషల్ మీడియాలో లేదా మీడియాలో రాసే వ్యాసాలకు, వ్యాఖ్యలకు లోబడి ఉండవు…

ఒక్కటి మాత్రం క్లియర్… జాతీయ రాజకీయాలు వేరు… ప్రాంతీయ రాజకీయాలు వేరు… బీజేపీకి జాతీయ స్థాయి సమీకరణాలు, అవసరాలపై ఓ స్ట్రాటజీ ఉంది, అందులో కేసీయార్ సహకారం కావాలి… కానీ తనేమో కుమారస్వామి, తేజస్వి యాదవ్, హేమంత్ సొరెన్ అంటూ ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్లాన్ చేస్తున్నాడు… నిజానికి ఆ ప్లాన్ వెనుక నేపథ్యం బీజేపీకి తన అవసరం గుర్తుకురావాలనే… అంతే, ఈ చిల్లరగ్రహాలకు మద్దతునిచ్చి బీజేపీకి ఓ మెసేజ్ ఇవ్వడమే… తన తోవకు రప్పించుకోవడమే…

అది బీజేపికి అర్థమైంది… కాంగ్రెస్ రహిత జాతీయ రాజకీయాల దిశలో బీజేపీకి ఓ లాంగ్ టరమ్ స్ట్రాటజీ ఉంది… ఆ కార్యాచరణలోకి కేసీయార్‌ను లాగుతారు… దానికి కేసుల్ని చూపిస్తారా..? భయమో, భక్తో… ఏదో ఒకటి… దుబ్బాక, గ్రేటర్ ఫలితాలను ఆల్‌రెడీ రుచిచూపించారు… పిలిచారు… నిజమే, వాళ్లే పిలిచారు… మాట్లాడారు… వెంటనే బీజేపీ రాష్ట్ర నాయకుల గొంతులన్నీ సైలెంట్… అక్కడే కేసీయార్‌ను రాష్ట్ర నాయకులంతా అండర్ ఎస్టిమేట్ చేసింది…

చిన్న కామన్ సెన్స్ పాయింట్ ఏమిటంటే..? బాబ్బాబూ, నన్ను మళ్లీ కలుపుకొండి అంటూ చంద్రబాబు ఎంత లాబీయింగ్ చేస్తున్నా సరే, మోడీ తనను కలవటానికి కూడా ఇష్టపడటం లేదు రెండేళ్లుగా… తన క్రెడిబులిటీ కోల్పోయాడు… ఎప్పుడైతే ఏపీలో కూడా బాగా దెబ్బతిన్నాడో ఇక చంద్రబాబు వాళ్లకు అవసరం లేదు… తను జాతీయ రాజకీయాల్లోనూ ప్లే చేయగలిగిందేమీ లేదు… వాళ్లకు జగన్ కావాలి… తాము చెప్పిన ప్లాన్ జగన్ ప్లే చేయగలడు…

జస్ట్, గంటల్లోనే మోడీ, అమిత్ షా ఆఫీసులు కేసీయార్ అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేశాయంటేనే అర్థం చేసుకోవాలి, తెర వెనుక ఏదో జరుగుతోంది… చంద్రబాబు వాయిస్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తదితరులకు అంత త్వరగా అంతుపట్టకపోవచ్చు… కానీ చాలా లోతు రాజకీయం తెలంగాణపై పరుచుకుంది… అదీ అసలు వాస్తవం… ‘‘అయితే నువ్వు, లేదంటే నేను… నో కాంగ్రెస్…’’ ఫసాక్ చేయాలి ముందుగా…

అవసరమైతే ఇదే జగన్, ఇదే కేసీయార్ తదితరులు జేడీఎస్, డీఎంకే, జేఎంఎం తదితర పార్టీలన్నింటికీ తోవకు తీసుకురాగలరు… రహస్య స్నేహితుడు మజ్లిస్ ఒవైసీ సరేసరి… ఆ విస్తృత రాజకీయ కార్యాచరణ లోతు వేరు… అది ఇప్పుడప్పుడే బండి సంజయ్, కిషన్‌రెడ్డి తదితరులకు చెప్పాలనేమీ లేదు… తెరవెనుక కొందరు కార్పొరేట్ పెట్టుబడిదారులు వర్క్ చేస్తూ ఉంటారు… మైహోం, మేఘా, ఆదానీ ఎట్సెట్రా…

ఇప్పటికిప్పుడు కేసీయార్‌కు వచ్చిన ఫాయిదా ఏమిటంటే..? కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరకుండా అడ్డుకోవడం… బీజేపీ బలపడకూడదు, అదే సమయంలో కాంగ్రెస్ మన్నుతిన్నపాములా అలా పడి ఉండాలి… ఒకవేళ రేవంత్ గనుక పీసీసీ అధ్యక్షుడు గాకుండా సొంత ప్రాంతీయ పార్టీ పెడితే తనకు మరీ నయం… రెడ్ల వోట్లను గణనీయంగా చీల్చేయడం… సో, కేసీయార్‌ను అండర్ ఎస్టిమేట్ చేయొద్దు… అది మహా ముదురు రాజకీయ పిండం… అంత తేలికగా కొట్టడం అసాధ్యం…

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • కరోనా రావచ్చు పోవచ్చు… కానీ కరోనా ట్యూన్ మాత్రం చస్తే వదలదు…
  • ఓహ్ బేబీ రజినీ చాంది..! నెట్ ట్రోలర్స్‌కు దొరికింది తాజా ‘ఏజ్ బార్ బకరీ’..!
  • ఫేస్‌బుక్ వేదికగా ఈ కలెక్టర్‌కు వేలాది మంది విభిన్న వీడ్కోలు..!
  • 2021లో మహావిపత్తులు..? డోన్ట్ వర్రీ..! ఆ రాతలన్నీ చదివి నవ్వుకొండి..!
  • చదివితే సింగిల్ కాలమ్ వార్త… వార్తాంశంలోని స్పూర్తి అంతులేనంత…!
  • సుమ..! కేవలం సోలో షో..! కాదంటే ఫ్లాపే… ఇదీ తాజా ఉదాహరణ…!!
  • KCR వేస్ట్, వేస్టున్నర… సరే… కానీ అది తేల్చాల్సింది ఈ దరిద్రపు సర్వేనా..?!
  • కంగనా భలే ఎంపిక..! ఆమె ఆ క్వీన్ కేరక్టరే ఎందుకు తీస్తున్నదంటే..?
  • కరోనా అనువాద వాణిజ్య ప్రకటనల్లో హాస్యం బాగా పండును…!
  • ‘చిన్నమ్మ పథకం’… సమయానికి జగన్‌ను గోమాతలా ఆదుకుంది…!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now