తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2వ తేదీకి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అంగరంగ వైభవంగా రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎంతో మంది ప్రముఖులు అవార్డులతో పాటు రివార్డులను ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదగా అందుకున్నారు. అంతేకాదు హైదరాబాద్ నగరం మొత్తం ఈ వేడుకలకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నగరంలోని వేడుకలను దూంధాంగా నిర్వహించారు. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో వెలుగులు విరజిమ్మాయి.
యావత్ రాష్ట్రం మొత్తం అవతరణ వేడుకలను జరుపుకుంటే ఆ ఐదు గ్రామాలు మాత్రం ఈ వేడుకలకు దూరంగా ఉన్నాయి. అవును… మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు దూరంగా ఉన్నారు.
మెదక్ జిల్లా తొగుట మండలంలోని ఏటిగడ్డకిష్టాపూర్, వేములగట్, పల్లెపహాడ్, లక్ష్మాపూర్, కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు అవతరణ వేడుకలను బహిష్కరించారు. అంతేకాదు గ్రామాల్లో పలు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. వేములగట్ గ్రామంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మేల్యే రామలింగారెడ్డిల దిష్టిబొమ్మలను ఊరేగించి పంచాయతీ కార్యాలయం వద్ద దహనం చేశారు. 11 గంటల వరకు జాతీయ జెండాను ఎగురవేయకుండా అడ్డుకున్నారు. పల్లెపహాడ్ గ్రామంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. తొగుట మండలంలోని నాలుగు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు జాతీయ జెండాలు ఎగురవేయగా, కొండపాక మండలం ఎర్రవల్లి, సింగారం గ్రామంలో జెండా ఎగరవేయకుండా ప్రజలు అడ్డుకున్నారు. ఉపాధి కూలీలకు పంపిణీ చేసిన స్వీట్లను తిరిగి పంపించారు.
టీఆర్‌ఎస్‌కు, పదవులకు రాజీనామా చేస్తామని తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ ఎంపీటీసీ దామరంచ ప్రతాప్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మల్లేశం ప్రకటించారు. మిగతా 18 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డుసభ్యులు, పార్టీ నాయకులు రాజీనామాకు సన్నద్ధమవుతున్నారు….