Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కంగ్రాట్స్ శిరీషా..! తొలి తెలుగు అంతరిక్ష యాత్రికురాలు..!

July 2, 2021 by M S R

అప్పుడెప్పుడో 1984లో… మన భారతీయుడు రాకేష్ శర్మ రష్యా స్పేస్ క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి వెళ్లివచ్చాడు..! ఇంకా..? సునీతా విలియమ్స్ కూడా అంతరిక్ష యాత్రికురాలే… కానీ భారతీయ తండ్రి, స్లొవేనియన్ అమెరికన్ తల్లి… ఈమె పుట్టింది, పెరిగింది అమెరికాలోనే, పెళ్లిచేసుకున్నది కూడా ఓ అమెరికన్‌నే… హర్యానాలో పుట్టిన కల్పనా చావ్లా మరో వ్యోమగామి… నాసాలో పనిచేస్తూ, అక్కడే ఓ అమెరికన్‌ను పెళ్లిచేసుకుంది… ఆమె స్పేస్‌లోకి వెళ్లిన తొలి భారతీయురాలు… తరువాత 2003లో, ఒక స్పేస్ ప్రమాదంలోనే మరణించడం ఓ విషాదం… మళ్లీ ఇన్నేళ్లకు ఒక భారతీయురాలు… అందులోనూ ఓ తెలుగు మహిళ పేరు వినిపిస్తోంది… పేరు శిరీష బండ్ల… తొలి తెలుగు అంతరిక్ష యాత్రికురాలు కాబోతోంది… ఆమె పనిచేసే వర్జిన్ గెలాక్టిక్ అనే కంపెనీ ప్రకటించిన తొలి యాత్రికుల జాబితాలో ఆమె పేరు కూడా ఉంది…

sirisha bandla

స్పేస్ ఎక్స్ గాకుండా స్పేస్ టూరిజంలో ఉన్న మరో కంపెనీ వర్జిన్ గెలాక్టిక్… కొన్ని ప్రయోగాలు చేసింది… వాణిజ్యపరంగా పూర్తి స్థాయిలో ఇంకా ఏమీ చేయలేదు… ఇప్పుడు ఓనర్ బ్రాన్సన్‌తోపాటు ఆరుగురు కంపెనీ ఉద్యోగులే స్పేస్‌లోకి వెళ్తున్నారు… (అమెజాన్ జెఫ్ మేజోస్ కన్నా ముందే స్పేస్ లోకి వెళ్లి రావాలని బ్రాన్సన్ పట్టుదల) కంపెనీ తరఫున ప్రభుత్వ వ్యవహారాలు చూసుకునే శిరీష కూడా ఈ ఫస్ట్ బ్యాచ్ యాత్రికుల జాబితాలో ఉంది… ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆమె హూస్టన్‌లో పెరిగింది… చిన్నప్పటి నుంచీ ఆస్ట్రోనాట్ కావాలనేదే ఆమె కోరిక… ఏరోనాటికల్ ఇంజనీరింగు చదువుకున్న ఆమె ఎంబీఏ కూడా చేసింది,.. మొదట్లో కమర్షియల్ స్పేస్ ఫ్లయిట్ ఫెడరేషన్‌లో పనిచేసిన ఆమె తానా యూత్ స్టార్ అవార్డు పొందింది కొంతకాలం క్రితం… గుంటూరు జిల్లా, తెనాలి ఈమె స్వస్థలం… తల్లి డాక్టర్ అనురాధ, తండ్రి డాక్టర్ మురళీధర్ రావు… వయస్సు 34 ఏళ్లు… కంగ్రాట్స్ శిరీషా… మీరు కదా స్ఫూర్తిదాతలు…

sirisha

Ads

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ మంత్రి చిల్లర వ్యాఖ్యలపై పార్టీ మౌనం ఏం సంకేతాలు ఇస్తున్నట్టు..!?
  • Decaplets..! ఒకే కాన్పులో పదిమంది… నెవ్వర్.., ఇప్పటికీ జరగలేదు…!!
  • *రెండు జెళ్ల’తో అర్జెంటుగా కుర్రాళ్ల మనసుల్ని పిచ్చెక్కించేసింది…!!
  • ఆ రాజ్ సీతారామ్ ఏమయ్యాడు చివరకు..? కృష్ణ ఎందుకు వదిలేశాడు..?!
  • బిగ్‌బాస్… బిగ్‌లాస్… కళ్లు నెత్తికి ఎక్కడం తప్ప వేరే ఫాయిదా లేదు..!!
  • ట్రంపు చెప్పాడని ఐఫోన్ గుడ్డిగా వినదు… అది పక్కా వ్యాపారం…
  • వాళ్ల మానాన వాళ్లు బతుకుతున్నా సరే… శ్రీముఖి వదిలేట్టు లేదు…
  • గుడ్డిగా నమ్మేయవద్దు… సోషల్ మీడియాలో కొందరుంటారు… జాగ్రత్త…!!
  • హీరోయిన్ బాత్‌రూం‌తో ఏం పనిరా..? వీటినే పిచ్చి కూతలు అంటారు…!!
  • ‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions