Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాగుంది సుధీర్..! ఆనాటి డాన్సర్లతో నీ ఆటాపాటా సక్కగుంది… ఆలోచనా సల్లగుంది..!!

May 3, 2021 by M S R

సాధారణంగా ఈటీవీలో వచ్చే మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ల ప్రోగ్రాములంటేనే ఓ చీప్ అభిప్రాయం ఉంది జనంలో… జబర్దస్త్ అదే… ఎంతసేపూ బూతులు, అక్రమ సంబంధాలు, పక్కింటి బాగోతాలు, పడక ముచ్చట్లు ఇవే… అసలు బూతు లేకుండా హాస్యం ఏముంటుంది అనేదే వాళ్ల పాలసీ… ఇక ఆ చెత్తా స్కిట్లకు జడ్జిల నవ్వులు సరేసరి… ఈమధ్య టీవీ చానెళ్ల నడుమ నాన్-ఫిక్షన్, రియాలిటీ ప్రోగ్రాముల పోటీ నెలకొని ఉంది కదా… మాటీవీ వాడు బిగ్‌బాస్ కేరక్టర్లతో కామెడీ స్టార్స్ అని ఓ కామెడీ ప్రోగ్రాం స్టార్ట్ చేశాడు… విపరీతంగా ఖర్చు పెట్టేస్తున్నాడు… కానీ అది అవినాష్ చెప్పుచేతల్లో నడుస్తున్నట్టుంది… అనేకచోట్ల అతి కనిపిస్తోంది… దీనికి దీటుగా ఈటీవీ వాడు శ్రీదేవి డ్రామా కంపెనీ అని అదే టైమ్‌లో ఓ కామెడీ షో స్టార్ట్ చేశాడు… జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, ఇంకేదో పాత జబర్దస్త్ గాకుండా ఇది అదనం… మొదట్లో దీనికి సుడిగాలి సుధీర్ వంటి స్టార్ కమెడియన్లను దూరం ఉంచి, ఇమాన్యుయెల్, వర్ష వంటి అప్ కమింగ్ కమెడియన్లతో చౌకగా కథ నడిపించేద్దామని అనుకున్నట్టున్నారు… అది ఎదురుతన్నింది… రేటింగుల్లో ఢమాల్…

etv4

సుధీర్, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, గెటప్ సీను వంటి ఆర్టిస్టులు అందుబాటులో ఉంటే వాడుకోలేని వాళ్ల దరిద్రమైన ప్లానింగ్ ఎదురుతన్నేసరికి, కొన్నాళ్లకు కళ్లు తెరుచుకున్నయ్… వేరే దిక్కులేక సుధీర్‌కే అప్పగించారు… తరువాత అది గాడిలో పడింది… స్పెషల్ ప్రోగ్రామ్స్‌కు సంబంధించి సుధీర్ అనుభవం, రాంప్రసాద్ స్క్రిప్టు ఉపయోగపడ్డయ్… ఈ దెబ్బకు మాటీవీ వాడి కామెడీ స్టార్స్ కిందకు వెళ్లిపోయింది… రేటింగుల్లో ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ పైకి వచ్చేసింది… సరే, జీతెలుగు వాడు ఈ కామెడీ షోలలో పూర్, పూరర్, పూరెస్ట్… ఇప్పటి విషయానికొస్తే… నిన్నటి షో సోసోగా ఉంది, కానీ ఇందులో ఆరుగురు అరవై ఏళ్లు దాటిన వృద్ధ మహిళలు ఓ డాన్స్ పర్‌ఫామెన్స్ ఇచ్చారు… వాళ్లంతా ఎవరో తెలుసా..? చెన్నై వాళ్లు… అప్పట్లో మళయాళ, తమిళ, తెలుగు, కన్నడ ఫిలిమ్స్ అన్నీ చెన్నైలోనే కదా… ఎన్టీయార్, ఏఎన్నార్, కృష్ణ, రజినీకాంత్ తదితరులతోపాటు గ్రూపు సాంగ్స్‌లో స్టెప్పులు ఇరగదీసిన డాన్సర్లే…

etv2

అసలు ఇండస్ట్రీలో ఏ పూట బతుకు ఆ పూటకే సరి, అప్పట్లో చెల్లింపులూ తక్కువే… తరువాత తమిళం మినహా మిగతా ఇండస్ట్రీలు వెళ్లిపోయాయి… ఇలాంటి డాన్సర్లు ఏం తిన్నారో, ఏం బతికారో ఏమిటో ఎవరికీ అక్కర్లేదు… వాళ్లను తీసుకొచ్చి ఓ పర్‌ఫామెన్స్ చేయించడం బాగుంది… ఒక కామెడీ షోలో దాన్ని సుధీర్ తెలివిగా ఇరికించి, వాళ్లతోపాటు ఆడి, పాడి, సరదాగా కలిసిపోయి ఆహ్లాదాన్ని పంచాడు… వాళ్లలో కూడా భలే గ్రేస్, భలే ఎనర్జీ, భలే టైమింగ్… కాకపోతే ఇలాంటివాళ్లను తీసుకొచ్చినప్పుడు కాస్త బెటర్ ప్లానింగుతో, మరీ ఇప్పటి వెకిలి, మాస్ పాటలకే గాకుండా కాస్త వినసొంపైన పాత పాటలూ చేయిస్తే ఇంకాస్త బాగుండేదేమో… మల్లెమాల టేస్టుకు తగినట్టు మాస్ మసాలా సాంగ్సే కావాలంటే మన తెలుగు పాత సినిమాల్లోనే ఎన్ని లేవు..? జబర్దస్త్‌కు సంబంధించి గతంలో రాకేష్ స్కిట్లలో కాస్త హ్యూమన్ యాంగిల్ కనిపించేది, అదిప్పుడు పోయింది… ఈ డ్రామా కంపెనీ అయినా కాస్త డిఫరెంట్‌గా వినోదాన్ని పంచితే, దాన్ని మించి కావల్సిందేముంది..?!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • మందుపాట ఘంటసాల పాడితేనే కిక్కు… వైరాగ్యపు మత్తు…
  • సినిమాకు ఓ లేఖ ప్రాణం… ఆ లేఖ దగ్గరే తప్పుదొర్లితే…? అదే సీతారామం…!!
  • నిత్యమేనన్ చేసిన తప్పు…! ఆరేళ్ల క్రితమే వాడి వీపు పగలాల్సింది…!!
  • సింహాలు అమ్మబడును…! దివాలా తీసిన పాకిస్థాన్ సర్కారు పొదుపుపాట్లు..!!
  • నేషనల్ హెరాల్డ్ కేసు ప్రభావం వచ్చే కర్నాటక ఎన్నికల మీద…!
  • బాబ్బాబు… ప్లీజ్… మీరు వస్తుండండి..? పోనీ, నన్నే హైదరాబాద్ రమ్మంటారా..?!
  • టీవీ ప్రేక్షకుల్ని ఈటీవీ, మల్లెమాల పిచ్చోళ్లను చేసి, వెక్కిరించడమే ఇది…!!
  • మిస్సింగ్ గరల్ నంబర్ 166… తొమ్మిదేళ్ల ఓ అన్వేషణ కథ… ఓ పోలీస్ గ్రేట్‌నెస్…
  • ఓహ్… ఆత్రేయ రాసిన ఆ బర్త్‌డే పాటలో అంత ఫిలాసఫీ ఉందా..?
  • హీరోయిన్ కాదు, లేడీ డాన్… మాఫియా క్వీన్… గంగూబాయ్ మీద ఓ రీలుక్…!

Archives

Copyright © 2022 · Muchata.com · Technology Support by CultNerds IT Solutions