ఎస్, కొందరు మేల్ ఆఫీసర్లు మాతో కలిసి పనిచేయటానికి విముఖంగా ఉండేవాళ్లు… కానీ మెజారిటీ ఆఫీసర్లు సేమ్, మేల్ ఆఫీసర్లలాగే మమ్మల్నీ ట్రీట్ చేసేవాళ్లు… ఎంకరేజ్ చేసేవాళ్లు… లింగవివక్ష కారణంగా ఏ ఆపరేషనూ, ఏ పనీ ఆగిపోలేదు… మా స్క్వాడ్రన్ కమాండర్ కూడా ప్యూర్ ప్రొఫెషనల్… మహిళలకు సపరేట్ టాయిలెట్స్ లేవు, బట్టలు మార్చుకునే ఫెసిలిటీ లేదు అనేవి చిన్న చిన్న కారణాలు… అప్పటిదాకా ఆ అవసరం వాళ్లకు కలగలేదు… అవసరం కనిపించాక అన్నీ ఏర్పాటు చేశారు… అంతేకాదు, సినిమాలో ఓ మగ ఆఫీసర్ గుంజన్ సక్సేనాను, కమాన్, నీ శారీరక బలం చూపించు అని సవాల్ చేయడం అబ్సర్డ్, అలాంటిదేమీ జరగలేదు… అలాంటి శారీరక బలప్రదర్శన పోటీలు ఏమీ జరగలేదు…

క్లైమాక్స్ కూడా అబద్ధమే… నిజానికి మా ఇద్దరి ట్రెయినింగ్ అయ్యాక, కార్గిల్ ఘర్షణలు స్టార్టయ్యాక నన్ను మొదట్లోనే శ్రీనగర్ పంపించారు… ఆపరేషన్స్ స్టార్టయ్యాయి… తరువాత బ్యాచులో గుంజన్ శ్రీనగర్‌ వచ్చింది… గాయపడిన వాళ్లను తరలించడం, సప్లయిస్, కమ్యూనికేషన్ సామగ్రి తరలింపు వంటివి మా పని… మేల్ ఆఫీసర్లకు దీటుగానే పనిచేశాం… కానీ ఈ దర్శకుడు శరణ్ శర్మ క్రియేటివ్ ఫ్రీడం పేరిట ఏమిటేమిటో తీశాడు… సరే, వాళ్లేదో తీశారు, సినిమా రిలీజ్‌కు ముందు గుంజన్ చూసి, తను పనిచేసిన ఎయిర్‌ఫోర్స్ పరువు తీసేలా ఉన్న సీన్లకు అభ్యంతరం చెప్పి ఉండాలి కదా…’’ ఇలా సినిమా మీద విరుచుకుపడింది…

అంతకుముందు రిటైర్డ్ వింగ్ కమాండ్ నమ్రత చండి కూడా ఈ సినిమాను ఉతికి ఆరేసింది… ఇలా అబద్దాల్ని ఎందుకు ప్రచారం చేస్తార్రా అని ప్రశ్నించింది… వీటికి ఆ గుంజన్ సక్సేనా తన బ్లాగులో ఏదో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది… ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కో రీతిలో ఉంటాయి… కొంత సినిమా నిర్మాతలు, దర్శకులు స్వేచ్ఛ తీసుకుంటారు… నిజంగానే కొందరు మేల్ ఆఫీసర్ల వల్ల వివక్షను ఎదుర్కున్నాను, అదే సినిమాలో చూపించారు, తప్పేముంది అంటూ ఎదురుసమాధానాలు సంధించింది… సరే, మొత్తానికి ఓ వివాదం క్రియేట్ చేసి, అందరూ ఓ సాదాసీదా సినిమాకు మంచి ప్రచారమే కల్పిస్తున్నారన్నమాట… కానివ్వండి… చివరగా ఒక్కమాట… మన రీసెంటు ఎన్టీయార్ బయోపిక్కు, మన సైరా బయోపిక్కు నిజచరిత్రకు ఎన్ని వందల కిలోమీటర్ల దూరంలో తీయబడ్డాయో గనుక తెలిసి ఉంటే… గుంజన్ సక్సేనాను విమర్శించేవాళ్లు ఏమయిపోయేవాళ్లో…!!

తాజా :: అసలే కరణ్ జోహార్ మీద విపరీతంగా ద్వేషం కురుస్తోంది… తన బంధుప్రీతి, వైఖరే సుశాంత్ హత్యకు కారణమని ప్రేక్షకలోకమంతా కస్సుమంటోంది… ఈ స్థితిలో గుంజన్ సక్సేనా సినిమా విడుదలైంది… వాళ్లదే ధర్మ ప్రొడక్షన్స్… అసలు ఆలియా భట్ నటించిన ఏదో సినిమా ప్రోమోపై లక్షల డిస్‌లైకుల వర్షం కురుస్తుంటే, ఇక కరణ్ జోహార్ సొంత సినిమాను కంగనా రనౌత్ వదులుతుందా..? ఎంటరైంది…

… జాతీయ వాదం పేరుతో ఓ దుకాణం తెరిచావు, దేశభక్తిని చూపించకుండా… ఒక్క ముక్క పాకిస్థానీ విలనిజం చూపించకుండా… దేశం కోసం పోరాడే ఎయిర్‌ఫోర్స్ హీరోలనే తలతిక్క చిన్న కారణాలతో విలన్లుగా చూపించావు, నీదో దిక్కుమాలిన ధోరణి అని విరుచుకుపడింది… ఆర్మీలో మూడో లింగం ఏమిటోయ్, నీ తలకాయ్ అన్నట్టుగా అస్త్రాలు సంధించింది… కానీ ఏమాటకామాట కడిగేయడంలో ఏ మొహమాటాలూ ఉండవ్ కంగనాకు… భయం, తొట్రుపాటు కూడా ఏమీ లేవ్… ప్రత్యేకించి కొన్ని సున్నితమైన అంశాలపై మిగతావారంతా భయంతోనో, మనకెందుకు లేనిపోని జంఝాటం అనుకునో సైలెంటుగా ఉంటే కంగనా మాత్రం గెలికి మరీ బురద పూసేస్తుంది… ఇంట్రస్టింగు కేరక్టర్…