ట్రోలర్స్‌కు టీవీ యాంకర్ కమ్ సినిమా నటి అనసూయ ఎక్కడైనా దొరికిందీ అంటే పండగే… ఆడేసుకుంటారు..! ఆమె డ్రెస్సింగ్ తీరు, ఆమె అప్పుడప్పుడూ పెట్టే ట్వీట్లు, ఆమె ఫేస్బుక్ లైవ్ ధర్మోపన్యాసాలు… చివరకు పుష్పలో ఆమె పాత్ర కూడా…! ఎప్పటికప్పుడు ఆమె ట్రోలర్స్ మీద విరుచుకుపడుతుంది, బెదిరిస్తుంది, తిట్టేస్తుంది… అదే స్థాయిలో ట్రోలర్స్ ఎదురుదాడి చేస్తుంటారు… ఆ సెగ ఆమెకే కాదు, జబర్దస్త్ షోకు, ఆమె మీద కాస్త ఎక్కువ ప్రేమ పంచులు వేసే హైపర్ ఆదికి, బాడీ షేమింగ్ సహజమైపోయిన జబర్దస్త్ కమెడియన్లకు కూడా తగులుతోంది…
కావాలని గెలుక్కుని మరీ తిట్లు తినడంలో అనసూయ తరువాతే ఎవరైనా… సైలెంటుగా ఉండటం ఆమె ఇంటా వంటా లేదు… వుమెన్స్ డే సందర్భంగా ఓ ట్వీట్ చేసింది… ఆమె ఏం ట్వీట్ చేస్తుందో, దాని అర్థం, పరమార్థం, ఉద్దేశం, సంకల్పం ఏమిటో ఆమెకైనా తెలుస్తుందో లేదో… సరే, ఆ ట్వీట్ సారాంశం ఏమిటయ్యా అంటే..?
‘‘ఓహ్, వుమెన్స్ డే కదా, ప్రతి ట్రోలర్, మీమ్ మేకర్ హఠాత్తుగా మహిళల్ని గౌరవించే రోజు ఇది… కాకపోతే 24 గంటల్లో ముగిసిపోతుంది లెండి… అందుకని మహిళల్ని మినహాయించి, మిగతావాళ్లకు హేపీ ఫూల్స్ డే… గుమ్మడికాయ దొంగల్ని కామెంట్స్‌లో చూడొచ్చు’’… అనసూయ మార్క్ ఆంగ్లంలో పెట్టబడిన ట్వీట్ సారాంశం ఇది…
Oh! Suddenly realised its the day every troller and meme maker suddenly starts respecting women.. of course it expires in 24 hours! So all you women out there! Happy fools day!! 🙄
— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 8, 2022
అనసూయకు అందరూ ఫూల్స్లాగే కనిపిస్తారు ఎందుకో..! పైగా గుమ్మడికాయల దొంగలే స్పందిస్తారట… (ఈరోజు షష్టి, అమావాస్య కూడా కాదు…) సరే, అనసూయ వర్సెస్ ట్రోలర్స్ ఎప్పుడూ నడిచే తిట్ల బాగోతమే గానీ… ఆమె చేష్టలకు సెగ ఎవరెవరికో తగుల్తోంది… అదీ అసలు విశేషం… ప్రత్యేకించి ఆమె యాంకర్‌గా ఉన్న జబర్దస్త్ షో మీద పంచుల వరద విరుచుకుపడుతోంది…
బూతుల షోగా ప్రసిద్ధికెక్కిన ఈటీవీ వారి జబర్దస్త్ షో మీద ఉన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు… కొంతకాలంగా బాడీ షేమింగ్, మింగుడు భాష కూడా వచ్చిచేరింది… అందులో నటించే లేడీ గెటప్స్ మాత్రమే కాదు, లేడీ కమెడియన్లు కూడా బాడీ షేమింగ్‌కు గురవుతున్నారు… కానీ కిక్కుమనరు… వాళ్ల బాధ వాళ్లది… ఆ స్కిట్ల స్క్రిప్టు రైటర్ల నీచాభిరుచి అలాంటిది… కొంతకాలంగా ఆ స్కిట్లు పరిశీలిస్తే రోహిణి స్థూలకాయం, ఫైమా నలుపురంగు, విష్ణుప్రియ ముక్కు సైజు… ఇలా ఎవరైనా సరే బాడీ షేమింగ్ బాధితులే… విష్ణుప్రియ ముక్కును మరీ క్లోజప్పులో ఎన్లార్జ్ చేసి చూపించడం అయితే ఆ షో నిర్వాహకుల చిల్లరతనానికి పరాకాష్ట…
అనసూయను ట్రోల్ చేస్తూ అందరూ ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ షోను తిట్టేస్తున్నారు… అందులో స్కిట్లకు పడీపడీ నవ్వే నువ్వు కూడా వుమెన్స్ డే గురించి మాట్లాడుతున్నావా వంటి కామెంట్స్ దగ్గర్నుంచి… గాలికిపోయే కంపను– వంటి కామెంట్ల దాకా..! సింపుల్‌గా ఓ ట్వీట్ పడేసి ఆమె వదిలేసింది… ఇక దానిపై తిట్ల వేడి మాత్రం అందరికీ తాకుతోంది… ఫాఫం, జబర్దస్త్ నిర్మాతలు, డైరెక్టర్లు…! అనసూయ ఆ షోకు పేరు తీసుకొస్తోందా..? మరింతగా ఆ షో పట్ల నెగెటివిటీని పెంచుతోందా..?! ఐనా, అది జబర్దస్త్ కదా… ట్రోల్స్ తగిలితే బాధపడే సున్నిత చర్ములు ఎవరూ లేరక్కడ…!!
Share this Article