Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జగన్ ఆగడు… ఆ లిఫ్టు కట్టేస్తున్నాడు… శ్రీశైలం నీళ్లు మళ్లించేస్తాడట…

December 13, 2020 by M S R

‘‘దటీజ్ జగన్… తను అనుకున్న లక్ష్యం దిశలో సోనియాగాంధీనే ధిక్కరించి, జైలుకు కూడా వెళ్లొచ్చినవాడు… కేసీయార్‌కు భయపడతాడా ఏం..?’’….. ఇలా కొందరికి అనిపించవచ్చుగాక..!

‘‘అబ్బే, ఇదంతా లోపాయికారీ అవగాహన బాసూ… జగన్, కేసీయార్ ఒకరి ప్రయోజనాల కోసం మరొకరు సహకరించుకుంటున్నారు… కేసీయార్ జగన్ కోసం తెలంగాణ ప్రయోజనాల్ని కూడా వదిలేశాడు, పైగా జనం కళ్లకు గంతలు కడతారు ఇద్దరూ…’’. ఇలా ఇంకొందరు అర్థం చేసుకోవచ్చుగాక…!

‘‘వైఎస్ శ్రీశైలం నీటిని సగం దోచుకుపోతే, జగన్ మొత్తానికే ఎసరు పెడుతున్నాడు దేవుడోయ్… వ్యతిరేకించలేని తెలంగాణ దద్దమ్మ ప్రభుత్వం’’ అని ప్రతిపక్షాలు వీరంగం వేయవచ్చుగాక…!

……. కానీ జగన్ తను అనుకున్న దిశలో సంగమేశ్వరం (రాయలసీమ లిఫ్ట్) కట్టేస్తున్నాడు… సేమ్, వైఎస్‌లాగే ‘‘అనుమతుల కోసం ఆగడానికి ఇవేమైనా రసాయన పరిశ్రమలా’’ అనే ధోరణితోనే… బోర్డు ఏమంటున్నా..? ఎవరేం అంటున్నా సరే… పనులు స్టార్ట్ చేసేశాడు… ఒక్కసారి ఈ లిఫ్టు పూర్తయితే తనకు గ్రేటర్ రాయలసీమలో రాజకీయ లబ్ధి…

అందుకే వేగంగా పనులు సాగుతున్నయ్… అప్పట్లో ఈ ప్రాజెక్టు కట్టనివ్వబోమంటూ ఢాంఢూం అన్న లీడర్లు మళ్లీ అటువైపు తొంగిచూడలేదు… నిఘా వేయలేదు… కానీ ‘వెలుగు’ దినపత్రిక రిపోర్టింగ్ టీం ఆ పనిచేసింది… అఫ్ కోర్స్, ఇప్పుడు ఆ పత్రికది కాషాయ పాలసీ కాబట్టి, కేసీయార్‌ను ఇరుకునపెట్టే దూకుడు కనిపిస్తోంది… బట్, వార్త వార్తే కదా… (వేరే పత్రికలు పరిశోధన, నిఘా, ఫాలో అప్ వంటి పదాల్ని మరిచిపోయి చాలాకాలం అయిపోయింది)…

సంగమేశ్వరం పనులు మొదలయ్యాయి, నువ్వేం చేస్తున్నవ్ కేసీయార్ అని ప్రశ్నించడం ఆ పత్రిక ఉద్దేశం… పైగా ఎక్స్‌క్లూజివ్ స్టోరీ… దాంతో ఫస్ట్ పేజీలో బొంబాట్ చేసేసింది… మూడునాలుగు ఫోటోలు కుమ్మేసి, వివాదం ఏమిటో, అక్కడ ఏం జరుగుతుందో వివరంగా రాసుకొచ్చింది… ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి..? తన భూభాగంలోనే జగన్ లిఫ్టు కట్టుకుంటుంటే, వెళ్లి కేసీయార్ బుల్‌డోజర్లతో కూల్చేయలేడు కదా… కాదు, కాదు, గతంలోనే కేసీయార్ ఈమేరకు అంగీకరించాడు అనేవాళ్లూ ఉన్నారు… (మీవి మీరు కట్టుకొండి, మావి మేం కట్టుకుంటాం…)

అసలు మొన్నటి, అంతకుముందు అపెక్స్ కమిటీ భేటీల్లో ఏం తేలింది..? సుప్రీం కోర్టు ఏమంటోంది..? ట్రిబ్యునల్, బోర్డు, ఎన్జీటీలు ఏమన్నాయి..? ఇంతకీ కేంద్ర జలశక్తి శాఖ వైఖరి ఏమిటి..? అంతర్రాష్ట్ర నదీవివాదాలకు సంబంధించి తక్షణం స్పందించి, క్లియరెన్సుల్లేని పనులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు ముకుతాడు వేసే బాధ్యత, అధికారం ఎవరిది..? ఈ ప్రశ్నల్లో చిక్కుకుంటే ఇక తేలేది ఉండదు… ఈలోపు జగన్ లిఫ్ట్ ఆన్ చేసి, అవసరమైతే ప్రారంభోత్సవం రోజున తెలంగాణ పత్రికలకు కూడా యాడ్స్ ఇస్తాడేమో…

అవునూ… ఈ పనులు కూడా చేసేది మేఘా కంపెనీయే కదా..!! నిన్నటి కేసీయార్-మోడీ భేటీలో ఈ లిఫ్టు ప్రస్తావన, ఫిర్యాదు గట్రా ఏమైనా చోటుచేసుకుని ఉంటాయా కనీసం..?!

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • కరోనా రావచ్చు పోవచ్చు… కానీ కరోనా ట్యూన్ మాత్రం చస్తే వదలదు…
  • ఓహ్ బేబీ రజినీ చాంది..! నెట్ ట్రోలర్స్‌కు దొరికింది తాజా ‘ఏజ్ బార్ బకరీ’..!
  • ఫేస్‌బుక్ వేదికగా ఈ కలెక్టర్‌కు వేలాది మంది విభిన్న వీడ్కోలు..!
  • 2021లో మహావిపత్తులు..? డోన్ట్ వర్రీ..! ఆ రాతలన్నీ చదివి నవ్వుకొండి..!
  • చదివితే సింగిల్ కాలమ్ వార్త… వార్తాంశంలోని స్పూర్తి అంతులేనంత…!
  • సుమ..! కేవలం సోలో షో..! కాదంటే ఫ్లాపే… ఇదీ తాజా ఉదాహరణ…!!
  • KCR వేస్ట్, వేస్టున్నర… సరే… కానీ అది తేల్చాల్సింది ఈ దరిద్రపు సర్వేనా..?!
  • కంగనా భలే ఎంపిక..! ఆమె ఆ క్వీన్ కేరక్టరే ఎందుకు తీస్తున్నదంటే..?
  • కరోనా అనువాద వాణిజ్య ప్రకటనల్లో హాస్యం బాగా పండును…!
  • ‘చిన్నమ్మ పథకం’… సమయానికి జగన్‌ను గోమాతలా ఆదుకుంది…!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now