Muchata

పుష్కర స్నానానికి వెళ్తారా? ఇది ఓసారి చదవండి!!

August 1, 2016

13891870_1270842292968305_7736650053098814454_n
>>>>>>>>>>>>>>>>>>>>>>>  Gopireddy Srinivas Reddy  <<<<<<<<<<<<<<<<<
 
నమ్మకం…మూఢనమ్మకం…
మొన్న పోస్ట్ లో పొలతలలో దెయ్యం వదిలించడమనే విషయం గురించి చదివారు…అంతే కాదు అప్పుడప్పుడూ టీవీల్లో కొన్ని వార్తా విశేషాలు చూస్తుంటాము..పాతబస్తీలో ఓ వైద్యుడు బ్లేడుతో గాట్లు పెట్టడం, మరొకచోట వేపమండలతో వీపు మీద బాదటం… ఇంకొకచోటా తలపైన గుడ్లు పగలగొట్టడం లాంటివి fast forward techinique లో చూపిస్తుంటే పగలబడి వారి మూఢత్వానికి నవ్వుకుంటాం….
మనమే నాగరీకులం అయినట్టు… కానీ మనం చేసే పనులో!?
అక్కడ పొలతల లాంటిచోట్ల వాళ్లు చదివే మంత్రాలకు అర్ధం చదివేవాడికి, వైద్యం చేయించుకునేవాడికి తెలియదు…. మన పూజగదుల్లో, గుళ్లలో చదివేవాటి అర్ధాలు మనకూ తెలియదు…
అక్కడ దయ్యాలు వదిలాక కోనేటి మురికినీళ్ల స్నానానికి నవ్వుకుంటాము… ఇక్కడ మనమూ పొర్లుదండాలు పెడతాము…
ఇక అక్కడి జంతుబలులను నిరసిస్తాము…. మన పూజా సమయాల్లో కట్టుకునే పట్టు వస్త్రాలకు ఎన్ని వందల, వేల పట్టుపురుగులు చస్తాయో చూసుకోము….
ఆ బలులకు సింబాలిక్ గా మనం కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కొట్టడం లేదా? ఏదైనా కొత్త వాహనం కొంటే వాటి చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి కసక్కున తొక్కించడం లేదా?
అంతెందుకు.. ఇంటికి కొత్తసభ్యులొస్తే రక్తానికి ప్రతీకగా ఎర్రనీళ్ల దిష్టి తీయడం లేదా???
ఇక అక్కడ మంత్రగాళ్లు అక్కదేవతల పేర అక్కమహాదేవి ఫోటో పెట్టి భారీగా డబ్బు గుంజుతూ మోసాలు చేస్తే మన ప్రభుత్వాలే మోసాలు చేసి దోచుకుంటుంటే చూస్తూ ఉంటాము…
ఎలాగంటారా?
మనిషి చచ్చాక ఎవడూ వచ్చి ఇదిగో ఇలా జరుగుతుందని చెప్పలేదు….
అయితేనేం చచ్చాక పెద్దదినం చేస్తాము… కొన్ని వర్ణాలోళ్లు తద్దినాలు, మరికొందరు మహాలయ అమావాస్య అని చేస్తారు…
ఇక అస్థినిమజ్జనం అంటూ గంగ దగ్గరొక క్రతువు… గయలో పిండం పెడితే ఆ తర్వాత పెట్టే అవసరం ఉండదని మరొక నమ్మకం….
ఇన్ని చేసినా పాపం ప్రేతాత్మల ఆకలి తీరదు…. మళ్లీ పుష్కరాలంటూ గోల….
ఈ పుష్కరాలకూ “మహా” అనే మాటొకటి తగిలించడం… 2015 గోదావరి పుష్కరాలు మహా పుష్కరాలు 144 ఏళ్లకొకసారొచ్చేవన్నారు… అంటే ఇంతకుముందు 1871 లో జరిగుంటాయి… మరి 1883 లో జరిగుంటాయి కదా.. అప్పుడు వచ్చే 2027 వి మహా పుష్కరాలు కావా?
మరి కృష్ణావి మహా కాదా?
అసలు మొన్న గోదావరి పుష్కరాల్లో లక్షలాది జనం రాజమండ్రిలో చేసిన స్నానాలు గోదావరి జలాల్లోనేనా?
పుష్కరాల పేర కోట్లాది రూపాయలు దోచుకోవడం చూడటం లేదా? మీరిప్పుడు పుష్కరాలు జరుగుతున్న జిల్లా ఎడిషన్లు చదివితే ప్రతీ చోటా 50% పనులకంటే జరగని విషయం గ్రహిస్తారు…. వేలాది కోట్లు తేరగా మింగటం మళ్ళీ వచ్చే పుష్కరాలకు తిరిగి మేయటం….
మొన్న కృష్నా కే వరద రాకుంటే చూడండి… మా సంగమేశ్వరంలో భవనాశిని అన్న సెలఏటిని త్రెంచులు తవ్వి ఘాట్ల దగ్గరికి తీసుకొస్తున్న దృశ్యాలు కనిపించాయి…. ఇక శ్రీశైలం లో ఫంగస్ చేరిన నీళ్లు నిలివున్నాయి… మరి దీన్లో స్నానాలు చేసి బావుకునేదేముందో…
ఒక ప్రాంత ప్రయోజనాలు దెబ్బతీసి పుష్కరాలకంటూ నీళ్లు దోచుకుపోయేదే పుణ్య కార్యమో మీకే తెలియాలి….
ప్రభుత్వం చేస్తున్న ఈ దోపిడీ పొలతల మంత్రగాళ్ల దోపిడీని మించినది కాదా?
ఇంతకూ నమ్మకం…మూఢనమ్మకానికి తేడా ఎంతంటారు??

Filed Under: off beat Tagged: andhrapradesh, belief, Godavari Pushkaralu, krishna pushkaralu, pushakarasnanam, pushkaralu, telangana

Recent Posts

  • పౌరసత్వ చట్టంపై ఏడుపులు సరే… ఓసారి పాకీ దురాగతాలు చదవండి..!!
  • పొలిటికల్ వ్యూహకర్తట… సొంత పార్టీలోనే చుక్కలు కనిపిస్తున్నయ్..!!
  • ఫాఫం జగన్..! నిర్ణయాల్లో భలే కౌంటర్లు కానీ చెప్పుకునేవాడు లేడు..!!
  • రెడ్డిరాజులు..! కమ్మశోకాలు..! నువ్వు కాకపోతే నేను… అంతేనా..?!
  • పాపం చంద్రబాబును సమర్థించబోయి… కించపరిచిన ఆంధ్రజ్యోతి..!!
  • చౌదరీలే కాదు..! కమ్మేతరులపైనా జగన్ సర్కారు దెబ్బలు..!!
  • పౌరసత్వ సవరణ మంటల్లో ఐక్యరాజ్యసమితి ఆజ్యం..!
  • ఈ రాహుల్ రేప్ కథేమిటి..? ఈ సుకన్యాదేవి ఎవరు..? అసలేం జరిగింది..?
  • ఈ విశృంఖల కేరక్టర్ మళ్లీ శబరిమల తెరపై ప్రత్యక్షం..!!
  • అనూహ్యం..! ఈనాడు నుంచి తప్పుకున్న రామోజీరావు..!
  • పౌరసత్వ సవరణ చట్టం… మరికొన్ని చిక్కు ప్రశ్నలు ఇవీ…
  • మర్దానీ-2…. బిగి సడలని కథనం… రాణిముఖర్జీ పర్‌ఫామెన్స్..!
  • టైమ్ పాస్ పల్లీ..! ఆ కాసేపూ నవ్వించి, కడుపు నింపే వెంకీ మామ..!
  • 8400 కోట్ల బంపర్ ఆఫరా..? ఏమిటా కథ..? దొరకని జవాబు..!!
  • చంద్రబాబును మించి చంద్రజ్యోతి శోకాలు..! విడ్డూరంగా ఉంది బాసూ..?!

Follow

Subscribe to notifications

Handcrafted with by All Tech Media. All Rights Reserved Muchata.