Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హమ్మయ్య… ఇలా డబుల్ బెడ్రూం భారం దింపేసుకుందాం ఇక…

December 10, 2020 by M S R

జనంలో విపరీతంగా ఆశలు పెంచి, ఆ ఆశలు భగ్నమై… కేసీయార్‌ పట్ల వ్యతిరేకతగా పరిణమిస్తున్న కొన్ని అంశాల్లో ప్రధానమైంది డబుల్ బెడ్‌రూం ఇళ్లు… ఈ హౌసింగ్ స్కీమ్ మీద కేసీయారే విపరీతమైన హైప్ క్రియేట్ చేశాడు… అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లను కట్టిన ఉమ్మడి దుష్ట పాలన రోజులంటూ తిట్టేసి.., పేదవాడు గర్వంగా, సౌకర్యంగా ఉండేలా ప్రభుత్వమే ఫ్రీగా కట్టించి ఇస్తుందని ప్రకటించాడు… ఎక్కడికి ఏ లీడర్ పోయినా ఈ ఇళ్ల ముచ్చట్లే… ఏ ఎన్నికలొచ్చినా ఈ వాగ్దానాలే… జనంలో బాగా ఆశలు పెంచారు… లక్షల దరఖాస్తులు వచ్చిపడ్డయ్…

కానీ ఏమైంది..? అలవిమాలిన భారం… అడ్డగోలు ఖర్చు… అంత డబ్బు లేదు… రాష్ట్రం మొత్తమ్మీద చూస్తే సిరిసిల్ల, గజ్వెల్, సిద్దిపేట… ఒకటీఅరా కాస్త నోరున్న ఎమ్మెల్యేల నియోజకవర్గాలు… అంతే… ఇంకెక్కడా పెద్ద ప్రగతి లేదు… ఇకపై ఉండే చాన్సూ లేదు… పైగా కంట్రాక్టు ఏజెన్సీలు మరీ నాసిరకం ఇళ్లను నిర్మిస్తున్నారనే ఆరోపణలు కూడా అక్కడక్కడా ఉన్నయ్… మొన్నటికిమొన్న గ్రేటర్ ఎన్నికల ముందు తలసాని ఏదో పిచ్చి సవాల్ విసిరి, కాంగ్రెస్ నాయకులు ఆ సవాల్ స్వీకరించేసరికి, పత్తాలేకుండా పోవడంతో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల అంశం కూడా టీఆర్ఎస్‌కు మైనస్ అయిపోయింది…

ఇక కేసీయార్ దీనికి ఎక్కడో ఓచోట, ఎప్పుడో ఓసారి ఫుల్ స్టాప్ పెట్టేయాల్సిన అవసరం ఏర్పడింది… ఇదుగో ఈ వార్త గనుక నిజమే అయితే… అది డబుల్ బెడ్రూం ఇళ్ల సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టినట్టే ఇక…

సింపుల్… జాగా మీదే… అయిదు లక్షలో, ఆరు లక్షలో ఇస్తాం… ఇళ్లు కట్టేసుకొండి… ఇదీ స్కీం… డబుల్ బెడ్రూం పెండింగ్ దరఖాస్తులన్నీ ఇటు మళ్లిస్తే ఇక సరి… అంటే ఒకరకంగా పాత బాపతు స్కీమే… కేంద్రం నుంచి ఇచ్చే హౌసింగ్ స్కీం నిధులకు కాసిన్ని రాష్ట్ర నిధులనూ కలిపస్తే ఓ పనైపోతుంది…

వాస్తవంగా ఇది కొత్తదేమీ కాదు… 2018 లోనే ప్రకటించింది ప్రభుత్వం… కానీ అనేక కారణాలతో దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయింది… అప్పట్నుంచే దీనిపై ఫోకస్ చేసి ఉంటే బాగుండేది… నిజానికి డబుల్ బెడ్రూం ఇళ్ల స్కీం వల్ల మొత్తం రాష్ట్రంలో పక్కా ఇళ్ల పథకాల ప్రోగ్రెసే ఆగిపోయింది… రాజీవ్ గృహకల్ప, స్వగృహల కింద నిర్మించిన కొన్ని వేల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి… హైదరాబాదులోనే వేల ఫ్లాట్లు… అవి సమీక్షించినవాడు లేడు, పంపిణీ చేసినవాడు లేడు… అంతకుముందు అవి కట్టించిన పార్టీలకు పేరొస్తుందని సందేహం… వస్తేనేం..? అది ప్రజల డబ్బు కాదా… పోనీ, అలా ప్రతిపక్షానికి పేరు రావొద్దూ అంటే… ధూంధాంగా వాటిని పంపిణీ చేసే కార్యక్రమాలు పెట్టేసి, ప్రచారం చేసేసి, పూర్తిగా హైజాక్ చేస్తే సరి… ఆ నివాసాల కోసం వెచ్చించిన వందల కోట్ల ప్రజాధనం వృథా చేయడం దేనికి..?!

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • కరోనా రావచ్చు పోవచ్చు… కానీ కరోనా ట్యూన్ మాత్రం చస్తే వదలదు…
  • ఓహ్ బేబీ రజినీ చాంది..! నెట్ ట్రోలర్స్‌కు దొరికింది తాజా ‘ఏజ్ బార్ బకరీ’..!
  • ఫేస్‌బుక్ వేదికగా ఈ కలెక్టర్‌కు వేలాది మంది విభిన్న వీడ్కోలు..!
  • 2021లో మహావిపత్తులు..? డోన్ట్ వర్రీ..! ఆ రాతలన్నీ చదివి నవ్వుకొండి..!
  • చదివితే సింగిల్ కాలమ్ వార్త… వార్తాంశంలోని స్పూర్తి అంతులేనంత…!
  • సుమ..! కేవలం సోలో షో..! కాదంటే ఫ్లాపే… ఇదీ తాజా ఉదాహరణ…!!
  • KCR వేస్ట్, వేస్టున్నర… సరే… కానీ అది తేల్చాల్సింది ఈ దరిద్రపు సర్వేనా..?!
  • కంగనా భలే ఎంపిక..! ఆమె ఆ క్వీన్ కేరక్టరే ఎందుకు తీస్తున్నదంటే..?
  • కరోనా అనువాద వాణిజ్య ప్రకటనల్లో హాస్యం బాగా పండును…!
  • ‘చిన్నమ్మ పథకం’… సమయానికి జగన్‌ను గోమాతలా ఆదుకుంది…!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now