15TH_CITY_PARLIAME_1144100f

చదువుకునే దగ్గర, కొలువు చేసే దగ్గర లీవ్ లెటర్లు పెట్టడం పరిపాటే కదా… మన పార్లమెంటు సభ్యులు కూడా లీవ్ లెటర్లు పెడుతున్నారు… దయచేసి అనుమతించాలంటూ కోరుకుంటున్నారు… అదేంటి? మన ఎంపీలు కూడా లీవ్ పెట్టుకోవచ్చా? అసలు లీవ్ పెట్టాల్సిన అవసరం ఏముంటుంది. అంతా వాళ్లిష్టమే కదా… వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయా?

ఎస్… ఇష్టమొచ్చినన్ని రోజులు పార్లమెంటు సమావేశాలకు డుమ్మా కొట్టాలంటే కుదరదు… ఇది చాలా మందికి తెలియని నిజం

ఎవరైతే వరుసగా 60 రోజులపాటు సమావేశాలకు హాజరు కారో, వారిని వెంటనే అనర్హుడిగా గుర్తించటానికి రాజ్యాంగంలో ఓ నిబంధన (ఆర్టికల్ 101)  ఉంది… అదీ వాళ్ల లీవ్ లెటర్లకు కారణం… 60 రోజుల గైర్హాజరీ నమోదైతే వెంటనే ఆ స్థానం ఖాళీగా ఉన్నట్టు పార్లమెంటు ప్రకటించవచ్చు….

చాలా మంది పార్లమెంటుకు సరిగ్గా హాజరు కారు, హాజరైనా చర్చల్లో పెద్దగా పాల్గొనరు, పెద్దగా ప్రశ్నలు వేసేదీ లేదు…

ఇప్పుడున్న లోక్ సభలో మొదటి రెండేళ్లలో ఇలా 28 లీవ్ లెటర్లు దాఖలయ్యాయనేది ఈ వార్త సారాంశం… ఈ మొత్తం 28 లీవ్ లెటర్లలో కోరుకున్న సెలవు రోజులు 894

ఈ లీవ్ లెటర్లను స్పీకర్ పేరిట రాయాలి. అయితే ఒకేసారి 60 రోజులకు మించి సెలవు పెట్టడానికి వీల్లేదు…. ఈ లీవ్ లెటర్లను వీటికోసమే ఏర్పాటు చేసే ఓ కమిటీకి పంపిస్తారు… ఆ కమిటీ పరిశీలించి లీవ్ అనుమతించాలో వద్దో చెబుతుంది. అఫ్ కోర్స్ మామూలుగానైతే రిజెక్ట్ చేయరు… కాకపోతే కొన్ని సూచనలు చేస్తుంటారు… ఇప్పుడు ఈ కమిటీని నేతృత్వం వహిస్తున్నదెవరో తెలుసా? కేరళ నుంచి ఎంపికైన సీపీఎం సభ్యుడు పి.కరుణాకరన్

ఆ 28 లీవ్ లెటర్లలో వైసీపీ, ఎన్సీపీ, జేఎంఎం నుంచి ఒక్కొక్కటి రాగా, బీజేడీ, పీడీపీ నుంచి రెండేసి వచ్చాయి. కాంగ్రెస్ నుంచి 4,  తృణమూల్ కాంగ్రెస్ నుంచి 6, బీజేపీ నుంచి 11 లీవ్ లెటర్లు వచ్చాయి. చాలా లీవ్ అప్లికేషన్లు అనారోగ్యం పేరిట పెడుతున్నారు.