ఐబీ ప్లాన్ చేసిన ఓ ఖతర్నాక్ ఆపరేషన్‌ను కూడా విఫలం చేయడానికి ముంబై పోలీస్ బయల్దేరింది… అదీ ముంబైని ధ్వంసం చేసిన ఓ నరకాసురుడిని ఖతం చేసే ఆపరేషన్… బట్, ముంబై పోలీసులకు అవేవీ పట్టవు… వాళ్లను నడిపించే శక్తులు ఏది చెబితే అవి చేస్తారు… ఈ ధనంజయ్ నేరుగా ఢిల్లీ వెళ్లాడు… ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లోని ఓ గదిలో అజిత్ దోవల్ వాళ్లిద్దరికీ ఇంకా ఏవేవో జాగ్రత్తలు చెబుతున్నాడు… ధనంజయ్ గదిలోకి ప్రవేశించి, వాళ్లిద్దరినీ అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించాడు… పక్కాగా అరెస్టు వారెంటు ఉంది… ఆపరేషన్ లీకైపోయింది… దోవల్ అధికారికం కాదు, ఇదేమీ అఫిషియల్ ఆపరేషన్ కాదు, ఐబీ వాళ్లు జారుకున్నారు, దోవల్ ఏం చెప్పినా ధనంజయ్ వినలేదు, వినడు, వెల్ ప్లాన్డ్ కదా… చేసేదేముంది..? అబ్బే, ఆ ఇద్దరితో తనకేమీ సంబంధం లేదని దోవల్ చెప్పుకోవాల్సి వచ్చింది… చూశారు కదా, దావూద్‌ను రక్షించడానికి, ఏవో కొన్ని పెట్టీ కేసులు చూపించి, ఆ ఆపరేషన్‌లో ఉన్న ఆ ఇద్దరినీ అరెస్టు చేసి లోపలేశారు ముంబై పోలీస్… వాళ్లు ఏదైనా చేయగలరు… ఏదైనా…!!
ముంబై పోలీస్..! వాళ్ల రాజ్యాంగమే వేరు… ఈ ఒక్కటీ చదవండి చాలు..!!
సాధారణంగా పాలకుడిని బట్టి పోలీసులుంటారు, అందరికీ తెలిసిందే… కానీ ముంబై పోలీసులు చాలా టిపికల్… వాళ్లు ఏ అంచనాలకూ అందరు… చూస్తున్నాం కదా… వాళ్లలోనే అనేక గ్రూపులు, ఏ గ్రూపును ఏ శక్తి నడిపిస్తుందో ఓ అంచనాకు రావడం కష్టం… వాళ్లు ఏదైనా చేయగలరు… ఒక్క ముంబైలోనే నెలనెలా వందల కోట్ల వసూళ్లు చేయగలరు… వాళ్లే డాన్లు, వాళ్లే లీడర్లు, వాళ్లే జడ్జిలు, వాళ్లే అన్నీ… అంతెందుకు..? అంతటి అంబానీకే స్పాట్ పెట్టేంత సమర్థులు… శివసేన ఆత్మీయ ఆఫీసర్ ఏం చేశాడో చదువుతూనే ఉన్నాం కదా… నిజానికి ముంబై పోలీసులది ప్రత్యేక రాజ్యాంగం… నిష్ఠురంగా ఉన్నా అదే నిజం… సరే, సరే… ఓ ఉదాహరణ చెప్పుకుందాం… పెద్ద కథే గానీ, చిన్నగా చెప్పుకుందాం… ఈ ఒక్క ఎపిసోడ్‌తో మీకు కథ మొత్తం సమజైపోవాలి… ఏమంటారు..?
ఈయన పేరు అందరికీ తెలుసు కదా, వేరే పరిచయాలు అక్కర్లేదు… జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అంటారు గానీ ఆ పేరు తనకు సూట్ కాదు… అలాంటి చాలామంది బాండ్లకు బాస్ ఈయన… తనంటే పడని ప్రభుత్వాలు వచ్చి పక్కన పెట్టేసినా, రేంజ్ తగ్గించినా, నాన్-ఫోకల్ పాయింట్లలోకి తరిమేసినా సరే… దేశం కోసం వర్క్ చేస్తూనే ఉంటాడు… బోలెడు ఉదాహరణలు… 2005లోనే ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పోస్టు నుంచి రిటైర్ అయ్యాడు… ఐనా సరే, 76 సంవత్సరాల వయస్సులో కూడా మన దేశభద్రత, విదేశీ వ్యవహారాల్ని చూసుకుంటున్నాడు… అజిత్ దోవల్‌కు సెలవులు ఉండవు, రిటైర్‌మెంట్లు ఉండవు… ఆయన దావూద్ ఇబ్రహీంను వేసేయాలని ఫిక్సయ్యాడు ఓసారి… తను ఎక్కడున్నాడు..? పాకిస్థాన్ పారిపోయి ఆశ్రయం పొందాడు… పాకిస్థాన్‌లో రహస్య ఆపరేషన్ నిర్వహించి దావూద్‌ను కొట్టాలంటే మాటలా..? కానీ అజిత్ దోవల్ అంటే కూడా మాటలు కాదు మరి… తనకు ఓ సమాచారం వచ్చింది… జూలైలో దావూద్ ఇబ్రహీం కూతురైన మహరుఖ్ కు, క్రికెటర్ జావేద్ మియాందాద్ కొడుకు జునైద్ కు జూలై 9న మక్కాలో నిఖా అంటే వివాహము, జూలై 13న దుబాయ్ గ్రాండ్ హయత్ హొటల్ లో రిసెప్షను జరుగుతుందని…
ఈ అవకాశాన్ని వదులుకోవద్దని అనుకున్నాడు అజిత్ దోవల్… పాకిస్థాన్ నుంచి బయటికి వచ్చినప్పుడే దావూద్‌ను కొట్టేయడం ఈజీ… ఇప్పుడు వస్తున్నాడు, సో, చాన్స్ వదలొద్దు… బయట ఏ దేశంలోనైనా తనను ఖతం చేస్తే పెద్దగా ఇబ్బందులు కూడా ఏమీ ఉండవు, ఆల్‌రెడీ ఐరాస తనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి ఉంది… అందుకని ఓ ప్లాన్ వేశాడు… ఇది ఐబీ తరపున చేపట్టిందే… కానీ అధికారికంగా చేయరు కదా… మొత్తం సీక్రెట్ ఆపరేషనే… బయటపడితే అందరూ తప్పించుకుంటారు… అండర్ కవర్ ఆపరేషన్స్ అంటేనే అలా… ఈ బాధ్యతను దోవల్ స్వీకరించాడు… ప్రభుత్వ కమెండోలను వాడుకోవద్దు కదా, అందుకని గతంలో దావూద్ మనిషే అయినా సరే, తరువాత తన నుంచి విడిపోయిన గ్యాంగ్‌స్టర్ చోటరాజన్‌ను వాడుకోవాలని స్కెచ్ వేశాడు… దావూద్‌ను ఖతం చేయడం అంటే చోటాకు కూడా సంబరమే కదా… వెంటనే సరే అన్నాడు, మంచి మెరికల్లాంటి ఇద్దరు అనుచరులను దోవల్‌కు అప్పగించాడు… పేర్లు విక్కీ మల్హోత్రా… ఫరీద్ తనాషా…
వీళ్లిద్దరినీ దోవల్‌కు అప్పగించాడు… దోవల్ వీళ్లను ఓ రహస్య ప్రదేశానికి తీసుకుపోయి, తను వేసిన స్కెచ్ మీద శిక్షణ ప్రారంభించాడు… ఇంకొన్ని ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంది… దావూద్ పాకిస్థాన్ నుంచి బయటికి వచ్చే టైమ్ సమీపిస్తోంది… మూడు వారాలపాటు శిక్షణను స్వయంగా ఇచ్చాడు దోవల్… ఇలాంటి విషయాల్లో తను పెద్ద ముదురు… వాళ్లిద్దరూ సమగ్రంగా రెడీ అయ్యాక పేర్లు మార్చాడు… కొత్త పేర్లు ఇచ్చాడు… సూడాన్ దేశస్థులుగా పాస్‌పోర్టులు క్రియేట్ చేయబడ్డాయి… ఒక ఎయిరో ప్లేనులో బిజినెస్ క్లాసులో వాళ్లు ప్రయాణించడానికి సీట్లు కూడా రిజర్వ చేయబడ్డాయి… ఒకరకంగా ఇది సూసైడల్… ఎక్కడ చిన్న తేడా వచ్చినా వాళ్లు తిరిగి ప్రాణాలతో రారు… అవును మరి, చాలా అండర్ కవర్ ఆపరేషన్స్ అలాగే ఉంటయ్… వాళ్లు బయల్దేరడానికి మరో ఐదు రోజులు మాత్రమే ఉంది… ఈలోపు ముంబై (అప్పట్లో బొంబాయి) పోలీసులకు ఏదో ఉప్పందింది… నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్ ధనంజయ్ కమలాకర్ తన టీంను వెంటేసుకుని ఆ ఇద్దరూ ఉంటున్న ప్రదేశానికి బయల్దేరాడు…