Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చప్పుడు లేదు, చంపదు… నో ఫైర్, నో బుల్లెట్… అదే చైనా గన్…

November 20, 2020 by M S R

…. తుపాకీ కాలిస్తే… శబ్దం రావద్దు… సైలెన్సర్‌తో కాదు, సహజంగానే రావద్దు… మంట రావద్దు… అసలు పేలుడు అనేదే ఉండొద్దు… ఈ ట్రిగ్గర్లు నొక్కడాలు, క్వాడ్రిట్జ్ ఓపెనై బుల్లెట్ దూసుకుపోవడాలు… అబ్బే, మరీ ఓల్డ్ ఆయుధాలు… అదే చైనా వాడి మైక్రోవేవ్ గన్ చూడండి… ఎయిమ్ చేయడం, క్లిక్ చేయడం… అంతే… కిరణాలు ఎదుటి దేశం జవాన్ల మీదకు దూసుకుపోతయ్… వాళ్ల దేహాల్లో కలవరం… వాంతులు, నీరసం, కుప్పకూలడం ఉంటాయట… గాయాలు, నెత్తురు కారడం, అవయవాలు తెగిపడటం గట్రా తెలుగు సినిమా తరహా బీభత్సాలు ఏమీ ఉండవు… అంటే చంపదు, చావు దగ్గరకు తీసుకుపోయి నిలబడతయ్ ఈ గన్స్….

ఏమిటిది..? జేమ్స్ బాండ్ కొత్త సినిమా స్క్రిప్టా అనుకుంటున్నారా..? అవును మరి… ఏ యూకే డెయిలీ వాడో నోటికొచ్చింది ఏదో రాస్తే… మన పెద్ద పెద్ద మీడియా సంస్థలు కళ్లకద్దుకుని పబ్లిష్ చేయలేదా..? ప్రసారం చేయలేదా..? మనవాళ్లకు అమెరికా, ఇంగ్లండ్ మీడియా రాసేది వేదం… అదేదో సాధికార నివేదికల్లా, నిజనిర్ధారణల్లాగా చూస్తయ్… కాపీ చేసి రాస్తయ్… ఖరారు చేస్తయ్… మనవాళ్లూ నమ్మేస్తారు… ఈ చైనా మైక్రోవేవ్ గన్స్ కూడా అంతే…

నిజానికి మైక్రోవేవ్ గన్స్ ఆలోచన కొత్తదేమీ కాదు… ఇండియా సహా అందరూ ప్రయోగాలు చేస్తున్నవే… అవి ఓ కార్బయిన్‌లాగా లేదా ఓ రివాల్వర్ లాగా అరచేతిలో ఇమిడిపోయే స్థాయికి చేరలేదు ఆ ప్రయోగ ఫలితాలు… అవి సక్సెసయితే భవిష్యత్తులో యుద్ధాలే కాదు, సమాజంలో నేరాల రేంజ్, క్రైమ్ ప్రొఫైల్స్ కూడా మారిపోతయ్…

యూకే డెయిలీ వాడు ఎవరినో కోట్ చేస్తూ చైనా మైక్రోవేవ్ గన్స్ వాడి, ఇండియన్ సైనికులపై దాడి చేసింది అని ఓ స్టోరీ రాశాడు… మనవాళ్లు రెచ్చిపోయి ఆ వార్తను వాడేసుకున్నారు… కానీ ఇక్కడ చిన్న కామన్ సెన్స్ పాయింట్ ఏమిటంటే… నిజంగానే చైనా దగ్గర అలాంటి మోడరన్ వెపన్స్ గనుక ఉండి ఉంటే… ముళ్లబడితెలతో పాతరాతియుగం స్టయిల్ కొట్లాటలు దేనికి… ఆమధ్య గల్వాన్ లోయ దగ్గర వీటినే ప్రయోగించేవాళ్లు కదా…

ఆ పత్రిక ఏమంటుందీ అంటే… భారతీయ జవాన్లు వ్యూహాత్మకంగా ఆక్రమించుకున్న శిఖరాల్ని చైనా తిరిగి స్వాధీనం చేసుకుందట… మన జవాన్లు వాటిని వదిలేశారట… ఈ వార్తలు వచ్చాక మన ఆర్మీ ఖండించింది… అన్నీ బేస్‌లెస్ అని కొట్టిపారేసింది… ప్రస్తుతానికి చైనాకు అంత సీన్ లేదుఫో అని లైట్ తీసుకుంది… అవున్లెండి… అప్పుడు జీవాయుధాలు, వెదర్ వార్స్, వాటర్ వార్స్, బిజినెస్ వార్స్, స్టార్ వార్స్… కొత్తగా ఏదో ఒకటి రాసుకోవాలి… అలాగే మైక్రోవేవ్ వార్స్… లేకపోతే మజా ఏముంటుంది..? అది అసలే ఇంగ్లండ్ మార్క్ టిపికల్ జర్నలిజం.,. మైక్రోవేవ్స్‌ను మించిన ఆయుధాలు అవి…

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • సినిమాకు ఓ లేఖ ప్రాణం… ఆ లేఖ దగ్గరే తప్పుదొర్లితే…? అదే సీతారామం…!!
  • నిత్యమేనన్ చేసిన తప్పు…! ఆరేళ్ల క్రితమే వాడి వీపు పగలాల్సింది…!!
  • సింహాలు అమ్మబడును…! దివాలా తీసిన పాకిస్థాన్ సర్కారు పొదుపుపాట్లు..!!
  • నేషనల్ హెరాల్డ్ కేసు ప్రభావం వచ్చే కర్నాటక ఎన్నికల మీద…!
  • బాబ్బాబు… ప్లీజ్… మీరు వస్తుండండి..? పోనీ, నన్నే హైదరాబాద్ రమ్మంటారా..?!
  • టీవీ ప్రేక్షకుల్ని ఈటీవీ, మల్లెమాల పిచ్చోళ్లను చేసి, వెక్కిరించడమే ఇది…!!
  • మిస్సింగ్ గరల్ నంబర్ 166… తొమ్మిదేళ్ల ఓ అన్వేషణ కథ… ఓ పోలీస్ గ్రేట్‌నెస్…
  • ఓహ్… ఆత్రేయ రాసిన ఆ బర్త్‌డే పాటలో అంత ఫిలాసఫీ ఉందా..?
  • హీరోయిన్ కాదు, లేడీ డాన్… మాఫియా క్వీన్… గంగూబాయ్ మీద ఓ రీలుక్…!
  • కడువ..! ఓహ్.., ఇది మలయాళీ సినిమాయేనా..? ఆశ్చర్యంగా ఉందే…!

Archives

Copyright © 2022 · Muchata.com · Technology Support by CultNerds IT Solutions