అసలే ఇది టాలీవుడ్… పెద్ద హీరోలకు కోపమొస్తే క్షణం కూడా ఫీల్డ్ లో ఉండే పరిస్థితి లేదు… అలాంటిది నిన్నామొన్నటి దాకా టీవీల్లో కామెడీ వేషాలు వేసే ఓ ఆర్టిస్టు ఎక్స్ ట్రా వేషాలు వేస్తే ఎలా ఉంటుంది? అందులోనూ కాస్త తిక్కున్న పవన్ కల్యాణ్ ముందు వేషాలు వేస్తే ఇంకెలా ఉంటుంది?
ఈటీవీ జబర్దస్త్ తో ఫేమ్ అయిన షకలక శంకర్ నిజంగా మంచి ఆర్టిస్టు… మంచి టైమింగు, స్పాంటేనిటీ ఉన్నవాడు… పైగా పవన్ కల్యాణ్ కు వీరాభిమాని… ఓ దశలో గుడి కూడా కట్టాలని అనుకున్నాడు… అంతటి వీర, తీవ్ర, విపరీత అభిమానం అన్నమాట….
పవన్ కల్యాణ్ అభిమానే కాబట్టి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది… నాలుగు రోజులు జాగ్రత్తగా చేసుకోవచ్చు కదా…. తెలుగు మీడియాలోనూ, తెలుగు సినిమా ఫీల్డ్ లోనూ అభిమానంతో ఉంటే శంకరగిరి మాన్యాలు పట్టిస్తారనేది తెలుసు కదా… అవేమీ పట్టించుకోకుండా శంకర్ సర్దార్ షూటింగుకు ఆలస్యంగా రావడం, అసిస్టెంట్ డైరెక్టర్లపై నోరు పారేసుకోవడం జరుగుతున్నదట కొన్నాళ్లుగా…
మొదట్లో క్లాస్ పీకిన పవన్ కల్యాణ్ ఆతరువాత కూడా శంకర్ ధోరణి మారకపోయేసరికి… ఓసారి షూటింగ్ స్పాట్ లోనే శంకర్ పై చేయి చేసుకున్నాడని వినికిడి…
ఒక్కొక్క సీన్ ను శంకర్ కారణంగా పదే పదే చేయాల్సి రావడంతో డైరెక్టర్, యూనిట్ కూడా బాగా అసంతృప్తిగా ఉన్నారట… ఇవన్నీ తెలిసి పవన్ కల్యాణ్ తనదైన శైలిలో కాస్త పాఠం చెప్పేసరికి శంకర్ నేలమీదికి దిగొచ్చాడని అంటున్నారు… గతంలో ఇలా వ్యవహరిస్తేనే ఈటీవీ జబర్దస్త్ నుంచి వెళ్లగొట్టారనే అపప్రథ ఆల్ రెడీ శంకర్ పై ఉండనే ఉంది…