దగ్గుబాటి పురంధేశ్వరి ఇప్పుడు పూర్తి నైరాశ్యంలో ఉన్నట్టే కనిపిస్తున్నారు… తన రాజకీయ ప్రయాణంలో మొన్నమొన్నటివరకూ అనుభవించిన కేంద్ర మంత్రి పదవి మాత్రమే ఆమెకు దక్కిన అదృష్టం, అవకాశం… అంతకు ముందుగానీ, ఆ తరువాత గానీ పెద్దగా చెప్పుకోదగినన్ని అవకాశాలూ రాలేదు, పైగా ఆ దంపతులు తమ రాజకీయ కెరీర్ పై తీసుకున్న పలు నిర్ణయాలు వారిని అనిశ్చితికీ, అస్థిరత్వానికీ గురిచేశాయి… ఇప్పుడు మళ్లీ ఆమె కళ్లు శూన్యంవైపు!
రాష్ట్ర విభజన ఒకవైపు… దారుణంగా పడిపోయిన కాంగ్రెస్ గ్రాఫు… ఇవన్నీ గమనించే ఆమె, కావూరి వంటి నాయకులు బీజేపీలోకి జంపైపోయారు… రాయపాటి, జేసీ, టీజీ వంటి కొందరు సీనియర్లు తెలుగుదేశంలోకి దూకారు… కానీ చంద్రబాబుతో తీవ్ర వైరుధ్యాలున్న ఆమె ఎలాగూ అందులోకి వెళ్లలేదు… కాంగ్రెస్ లో ఉంటే ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలోనూ భవిష్యత్తు కనిపించడం లేదు… జగన్ పార్టీని దీర్ఘకాలం అంత స్థిరంగా ఉండగల పార్టీగా అంచనా వేసుకోలేదు… సో, బీజేపీ ఒక్కటే కనిపించింది… కేంద్రంలో మంచి సీట్లు సాధించి ఎలాగూ అధికారంలోకి వస్తుంది కాబట్టి తనకూ ఉపయోగకరమే అనుకుని అందులోకి దూకిపోయారు… ఏమీలేని చోట ఎవరొచ్చినా మేలే కదా అనుకున్న బీజేపీ పార్టీ కూడా ఆమెను స్వాగతించింది…
- ఇక ఇప్పుడు ఎవరైనా కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు వారి ప్రసంగాలను తెలుగులోకి అనువదించడం మినహా ఆమెకు పెద్ద పనేమీ లేదు
- చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయకూడదు, టీడీపీ నుంచి ఎవరు వస్తామన్నా ఎవరినీ బీజేపీలోకి చేర్చుకోవటానికి వీలు లేదు
- పదవుల విషయంలోనూ నిరాశే… సంఘ్ నుంచి ఎదిగిన నేతలకే సహజంగా బీజేపీలో కాస్త ఎక్కువ ప్రాధాన్యం, అవకాశాలు దొరుకుతుంటాయి
- ఇక ఇప్పుడు చేయటానికి ఏమీ లేదు… ఎటూ పోవటానికీ లేదు… ఉన్న పార్టీలోనే ఎప్పుడో ఏదో అవకాశం దక్కకపోతుందా అని నిరీక్షించడమే దిక్కు