Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

header-new-unit-muchata.com
  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బెడిసిన మోడీ ప్లాన్స్… శశికళను తొక్కేసి, తనూ మునిగాడు… లక్కీ స్టాలిన్…

January 19, 2021 by M S R

తమిళనాట బీజేపీ ఆట పూర్తిగా బెడిసికొట్టింది… తమిళ రాజకీయం బీజేపీకి ఏమాత్రం అంతుచిక్కదని మరోసారి తేటతెల్లం అయిపోతోంది… జయలలిత మరణించాక, అన్నాడీఎంకేను డిస్టర్బ్ చేసి, పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేసుకుని, అందులోకి జొరబడాలని ఆలోచించింది కానీ అడ్డంగా ఫెయిలైంది… ఇప్పటికిప్పుడు తను చేయగలిగేది కూడా ఏమీలేదు… ఏబీపీ-సీవోటర్ సర్వే చెబుతున్న నిజమిదే… ఇదేకాదు, ఈ సర్వే ఇంకొన్ని చేదు నిజాల్ని కూడా చెబుతోంది… కాస్త వివరంగా చెప్పుకుందాం… ఈ ఒపీనియన్ పోల్ నిజంగానే క్షేత్ర వాస్తవాన్ని చెబుతున్నదీ అనుకుందాం కాసేపు… వచ్చే ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి 162 సీట్లను, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి 98 సీట్లు సాధించవచ్చునని సర్వే చెబుతోంది… అంటే ఏమిటర్థం..?

stalin

స్టాలిన్ ముఖ్యమంత్రి కాబోతున్నాడూ అని అర్థం… బీజేపీ ప్రణాళికలు చిత్తయ్యాయని అర్థం… ఇప్పటికిప్పుడు శశికళ విడుదలై, యాక్టివ్‌గా తిరిగినా సరే, అన్నాడీఎంకేను మరింత బొందపెట్టడం తప్ప సాధించబోయేది ఏమీ లేదని అర్థం… అన్నింటికీ మించి కమల్ హాసన్ ఘోరంగా ఫెయిల్ కాబోతున్నాడని అర్థం… నిజానికి ఇక్కడ కొన్ని ఇంట్రస్టింగు పాయింట్స్ ఉన్నాయి…

  • గత ఎన్నికలతో పోలిస్తే డీఎంకే 39.4 నుంచి 41.1 శాతానికి వోట్లు పెంచుకోనుంది… కాంగ్రెస్, డీఎంకే, లెఫ్ట్ అన్నీ కాంక్రీటుగా కలిసినా సరే, వోట్లలో పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు… అంటే ప్రభుత్వ వ్యతిరేకత అంత బలంగా ఏమీలేదు… కానీ అన్నాడీఎంకే దురవస్థే స్టాలిన్‌కు కలిసి రానుంది… ఎలాగంటే..?
  • అన్నాడీఎంకే వోట్లు 43.7 నుంచి 28.7 శాతానికి పడిపోనున్నయ్… అంటే ఏకంగా 15 శాతం… బీజేపీ కలిసినా సరే ఈసారి తనకు ఫాయిదా లేదు సరికదా… నష్టం వాటిల్లబోతోంది… దేనివల్ల..? శశికళ పార్టీ ఏఎంఎంఏ నాలుగు సీట్లతో ఏకంగా 7.8 శాతం వోట్లను చీల్చబోతోంది… అదీ పడబోయే దెబ్బ…
  • నిజానికి పన్నీర్ సెల్వంకు గానీ, పళనిస్వామికి గానీ వ్యక్తిగత ఆకర్షణ ఏమీలేదు… జయలలిత మరణానంతర స్థితిని వాళ్లిద్దరూ వాడుకున్నారు… అంతే… పాలనలోనూ మెరుపుల్లేవ్, సొంత ముద్రల్లేవ్… కాకపోతే మోడీ, అమిత్ షా చెప్పినట్టల్లా ఆడుతూ, శశికళను వదిలేసి, ఇన్నేళ్లూ సేఫ్ గేమ్ ఆడారు…

sasikala

శశికళ అడమెంట్ ధోరణి నచ్చలేదో… బీజేపీ పెట్టిన షరతులకు ఒప్పుకోలేదో… ఏం జరిగిందో గానీ మోడీ శశికళ పట్ల తీవ్ర ఆగ్రహాన్ని కనబరిచాడు… సాయపడే అవకాశాలున్నా సరే వదిలేశాడు… ఆమె ఆస్తులు జప్తు… మొగడు చనిపోయాడు… తను జైలు పాలైంది… పార్టీకి దూరమైంది… వంగి వంగి బానిసల్లా దండాలు పెట్టినవాళ్లే కనీసం మొహాలు కూడా చూపించడం లేదు… తన వారసుడు దినకరన్ వేరే పార్టీ పెట్టి, కేడర్ కాపాడుకునే ప్రయత్నాల్ని చేసినా బీజేపీ తనకూ అడ్డుతగిలింది… ఆమె మీద కత్తి అలాగే వేలాడదీసి, ఆమెనే వాడుకుంటూ మోడీ పావులు కదిపితే కథ వేరేలా ఉండేదేమో… అన్నీ ఫెయిల్… చివరకు రజినీకాంత్‌ను ముందుపెట్టి కథ నడపాలని అనుకున్నారు… అదీ బెడిసికొట్టింది… ప్రస్తుతానికి ఇదీ స్థితి… ఇప్పుడు ఆమె బయటికి రాగానే ఆమె పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేస్తుందా అని అందరూ ఎదురు చూసే అంశం… కానీ కసికసిగా ఉన్న ఆమె మళ్లీ పళనిస్వామి, పన్నీర్ సెల్వం మొహాలు చూస్తుందా అనేది డౌటే… పైగా ఆమె స్వయంగా మరో అయిదేళ్లు పోటీచేయలేదు… ఇప్పటికే 66 ఏళ్లు… ఈ స్వల్ప వ్యవధిలో తన పాత కేడర్‌ను కూడగట్టుకోగలదా అనేదీ డౌటే… చాలా ఆస్తులు, ఆదాయమార్గాల్ని కూడా మోడీ ధ్వంసం చేసేశాడు… సో, ఆమె అడుగుల్ని వేచి చూడాల్సిందే…

kamal rajni

ఫీల్డ్‌లో పరిస్థితి తెలుసుకున్నాడు కాబట్టే రజినీకాంత్ రాజకీయాలకు ఓ పెద్ద నమస్కారం పెట్టేశాడు… పిచ్చోడేమీ కాదు… ఫాయిదా లేదని తెలిసి దూరం జరిగాడు… మీ ఇష్టమొచ్చిన పార్టీల్లో చేరండి అని తన అభిమానులకు చెప్పేశాడు… కానీ ఇంకా కమల్ హాసన్ తిరుగుతూనే ఉన్నాడు… ఈసారి ఎన్నికల్లో తనకు ఏ ఫాయిదా ఉండబోవడం లేదని ఒపీనియన్ సర్వే చెబుతోంది… అంటే ఏపీలో పవన్ కల్యాణ్ చేదు అనుభవమే కమల్ హాసన్‌కూ ఎదురుకానుంది… నిజానికి ఇది ఎన్టీయార్, ఎంజీఆర్, జయలలిత రోజులు కావు… నిత్యం రాజకీయాల్లో, ప్రజల్లో ఉండేవాళ్ల పట్ల మాత్రమే జనం మొగ్గు కనిపిస్తోంది… స్టాలిన్ చాలా ఏళ్లుగా తమిళ రాజకీయాల్లో ఉన్నాడు… తను పార్ట్ టైం పొలిటిషియన్ కాదు… తండ్రి మరణం తరువాత కూడా పార్టీని పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకుని, మరింత బలోపేతమయ్యాడు… పోనీ, స్టాలిన్ సోదరుడు అళగిరిని ముందుపెట్టి కొత్త డ్రామా ఆడాలని అనుకున్నా సరే, బీజేపీకి అదీ కలిసివచ్చే చాన్సులేమీ లేవు… తనూ పళనిస్వామి టైపే… మరిప్పుడు బీజేపీ ఏం చేయాలి..? రామసేతు వైపు తిరిగి దండం పెట్టాలి… ఈ రెండుమూడు నెలల్లో జరిగే అద్భుతాలేముంటాయి కనుక..!!

 

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • టార్గెట్ అంబానీ…! కేవలం మనీ కోసమేనా..? అంతటి మొసాద్‌కూ చిక్కని క్లూ..!!
  • కాక పెరుగుతోంది..! కానీ ఎవరు గెలిస్తే ఎవరికేం ఫాయిదా..?!
  • మట్టి మోసం చేయదు… ఉప్పెనలో తేలిపోయిన ఊక, ఉప్పు… అసలు కథ ఇదీ…
  • పాకిస్థాన్‌కు మోడీ రహస్య సందేశం… ఒకేమాట… అంతే, అభినందన్ వచ్చేశాడు…
  • నో డౌట్… పాట బంపర్ హిట్…! కానీ సుద్దాల ఎక్కడ ఎత్తుకొచ్చాడు దీన్ని..?!
  • కంగనా రనౌత్, ఆలియా భట్, దీపిక పడుకోన్… ఈ పాత్రకెవరు సూటబుల్..?
  • పోనీ… ప్రతి చందాకూ ఐటీ వారి ధ్రువపత్రం జతచేయాలా కామ్రేడ్..?!
  • మరీ ఎక్కువ చదివావోయ్… నువ్వు ఈ కొలువుకు పనికిరావు… గెటౌట్…
  • ప్రేమ ఖతం..! ప్రియుడి హత్యకు ప్రియురాలి సుపారీ… ప్లస్ ఒక పూట..?
  • ఇప్పుడిలా సాగిలబడ్డాయి గానీ… ఒకప్పుడు పొలిటికల్ కార్టూన్ అంటే…?!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now