Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

header-new-unit-muchata.com
  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం హిందూ..! ఈమె ఎదుట చేయిచాచి, చివరకు తనే బజారునపడింది…

December 27, 2020 by M S R

దిహిందూ దగ్గర ఏ ఆన్సరూ లేకుండా చేసిందీమె… అంతటి ప్రఖ్యాత పత్రికకు దిక్కతోచని స్థితి… తన రిపోర్టర్‌ను సమర్థించుకోలేదు, అలాగని ఈమెపై కక్షనూ ప్రదర్శించలేదు… లెంపలేసుకుంటుందా..? కిక్కుమనకుండా మూసుకుంటుందా..? ఇంట్రస్టింగు… విషయం ఏమిటంటే..? మాన్సాస్ ట్రస్టు కొత్త బాస్ సంచయిత గజపతిరాజు తెలుసు కదా… కొన్ని వేల కోట్ల సామ్రాజ్యానికి ధర్మకర్త ఆమె ఇప్పుడు… సోకాల్డ్, చంద్రబాబు, అశోకగజపతిరాజుల చట్రం నుంచి తమ తండ్రుల, తాతల బాపతు ట్రస్టును బయటికి లాగి… ఎవరేం మాట్లాడినా, బెదిరించినా, వణకకుండా, తొణకకుండా… విజయనగరం విడిచి పారిపోకుండా నిలబడ్డది…

అయితే ఆమె చేసిన ప్రతి పనీ కరెక్టే అని చెప్పడం లేదు ఇక్కడ… ఆఫ్టరాల్ ఓ ఆడపిల్ల అని తీసిపారేయడం ఈమె దగ్గర కుదరదు అని చెప్పడమే… కొన్నిసార్లు అనూహ్యంగా ఉంటుంది ఆమె పద్ధతి… టెంపర్‌మెంట్ రేంజ్ చాలా ఎక్కువ… రాజరక్తం కదా… ఏకంగా తనపై వ్యతిరేక వార్తలు రాస్తున్న హిందూ రిపోర్టర్‌‌ను బజారున నిలబెట్టింది… ఇలా…


బిజినెస్ కోసం చేసిన వాట్సాప్ మెసేజ్లు దిగువన అటాచ్ చేయబడ్డాయి@the_hinduకి తన పాత్రికేయ సమగ్రత తెలుసు. నీకిది నాకది అని నమ్ముకున్న కె. శ్రీనివాస్ రావు వంటి విలేకరులు ఈ వార్త లెజసీపై మచ్చ తీసుకు వస్తున్నారు. @suhasinih @SureshNambath(2/2) pic.twitter.com/AiyRT39WPF

— Sanchaita Gajapati (@sanagajapati) December 27, 2020


హిందూ రిపోర్టర్ తన భార్య పేరిట ఎల్ఐసీ బిజినెస్ అడిగాడు… నేరుగా మెసేజులే పెట్టాడు… ఆమె ఎందుకో చేయలేదు… అంతే, ఇక తనపై పక్షపాత రిపోర్టింగ్ స్టార్టయిందనేది ఆమె ఆరోపణ… ఆధారాల్ని కూడా పెట్టేసింది… అఫ్ కోర్స్, ఆ వ్యాపారానికీ, తన రిపోర్టింగుకూ లింకు లేదు, తాను రాసేవి అన్నీ నిజాలే అని సదరు రిపోర్టర్ చెప్పుకోవచ్చుగాక… కానీ ఎప్పుడైతే ఇవి బయటపడ్డాయో, ఆమె బయటపెట్టిందో ఇక హిందూలో ఆమె మీద వచ్చిన వార్తలకు విలువ లేకుండా పోయింది… అవి నిప్పులాంటి నిజాలు అయినా సరే, వాటికి క్రెడిబులిటీ లేదు…

అవి పబ్లిష్ చేసిన హిందూ కూడా ఇజ్జత్ కోల్పోయినట్టే… ఎందుకంటే… ఒక సంస్థ, ఒక వ్యక్తి, ఒక పార్టీ, ఒక గ్రూపు… ఎవరైనా సరే, వెంటపడి వార్తలు రాయడం అనేది హిందూ పద్ధతి కాదు… అన్నింటికీ మించి మరొకటి చెప్పుకోవాలి…

రిపోర్టర్లు అనుచిత లబ్ధి కోరుకోవడం అనేది కొత్తేమీ కాదు… అది జర్నలిజాన్ని తరతరాలుగా వీడని వైరస్… లీడర్లు, అధికార్లు కూడా విసుగొస్తే లోలోపల దాచుకుంటారు గానీ ఈ బాగోతాలను బయటపెట్టరు… పైగా అవేమీ లక్షలు, కోట్ల యవ్వారాలు కాదు… కానీ సంచయిత గజపతిరాజు దానికీ సందేహించలేదు… తను ఓ పెద్ద పత్రిక పరువు తీస్తున్నాను అని కూడా భయపడలేదు… ఆ టెంపర్‌మెంట్ ఎవరూ ఊహించలేదు…

ఇవన్నీ కామనే అంటున్నప్పుడు మరి ఇక ఇందులో చెప్పుకోవాల్సిన విశేషమేముంది అంటారా..? 1) దిహిందూ జిల్లా రిపోర్టర్లపై ఈ మరకలు మరీ అరుదు… 2) ఒక జిల్లా లెవల్ లీడర్, అదీ ఫిమేల్ లీడర్, ఏకంగా హిందూ రిపోర్టర్‌నే బజారున నిలబెట్టడం మరీ అరుదు… కాదు, అసాధారణం… 3) రేప్పొద్దున అదే పత్రిక తనపై కక్షకు దిగుతుందేమో అనే భయసందేహాలను పక్కన పెట్టేసి, ఏమైనా జరగనీ చూద్దాం అనే ధైర్యాన్ని కనబరచడం కూడా అరుదే… ఒకటి మాత్రం నిజం… పత్రిక పొలిటికల్ లైన్‌ను బట్టి వార్తల్లో భజనలు, దాడులు ఈరోజుల్లో సహజమే… కానీ హిందూ వంటి న్యూట్రల్ పేరున్న పెద్ద పత్రిక రాతల్లో అనుచిత పక్షపాతం కనిపించడం, అదీ సంచయిత వంటి లీడర్ బయటపెట్టడం ఊహించలేం… చేయి చాచడం అంటే ఇక అంతే… అక్షరం నేల మీదకు పడిపోయినట్టే… అది ఏం చెప్పినా ఎవరూ నమ్మరు… ఇక్కడా అంతే…!!

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • హిమ స్వర్ణం..! ఇండియన్ సోషల్ మీడియా సంబరం… చాలా అరుదు..!
  • సోప్ వేసిన సోప్ ప్రకటన..! తెల్లటి మాయకు తెలివైన ప్రయాస..!!
  • చెక్ నితిన్..! ఎంత ఏలేటి అయితేనేం… కమర్షియల్ లెక్కల్లో బోల్తా…!!
  • వజ్రాన్ని నేను…! నీరవ్ మోడీ అంతరాత్మ బహిరంగ లేఖ..!
  • ఇంట్రస్టింగు తీర్పు…! మహిళ పుట్టింటివారికీ ఆస్తిలో వారసత్వహక్కు..!!!
  • డంకీ బిర్యానీ… డంకీ కబాబ్స్… డంకీ బర్గర్స్… లొట్టలేస్తున్నారట ఏపీజనం..!!
  • లెఫ్ట్, రైట్ కలిసి… రైట్ రైట్..! బెంగాల్‌లో బద్ధవైరుల నయా దోస్తానా..!!
  • బాబోయ్… ఇదేం వార్తారచన తండ్రీ… ఈనాడును ఏదో పాము కాటేసింది…
  • రైల్వే ప్రయాణాలు తగ్గించండి… లేకపోతే చార్జీలు ఇంకా పెంచేస్తాం…
  • దక్షిణ కుంభకోణం..! పూజారుల భారీ మోసాల్ని పట్టేసిన కేరళ సర్కారు..!!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now