.
అఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి ముస్లిం కంట్రీస్‌లో హిందువులు నిత్యనరకంగా బతుకుతున్నారు అని అందరికీ తెలిసిందే కదా… వాళ్లకు భారత పౌరసత్వం ఇవ్వాలనే ‘పౌరసత్వ సవరణ చట్టం’ బీజేపీ దయ అని కూడా తెలిసిందే కదా…
నో, దానికి గండికొట్టారు… దానికీ అత్యవసరమైన ఎన్ఆర్సీకి కూడా గండి కొట్టారు… ఇప్పుడు ‘సర్’ అనే వోటర్ల ప్రక్షాళనకూ గండికొడుతున్నారు… ఎవరు…?
Ads
పక్కా హిాందూ వ్యతిరేక పార్టీలు… సోకాల్డ్ కుహనా సెక్యులర్ పార్టీలు… లైక్… లెఫ్ట్ (ఎరుపు ఎప్పుడు హిందూ వ్యతిరేకమే…) టీఎంసీ, స్టాలిన్, బీఆర్ఎస్, ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు.., అఫ్‌కోర్స్, వైసీపీ, టీడీపీ సందర్భాన్ని బట్టి… తమ అవకాశవాదాన్ని బట్టి…
ఎటొచ్చీ సిగ్గులేకుండా వాటిని ఇంకా ఈ దేశ రాజకీయ తెర మీద బతికిస్తున్నది కూడా హిందువులే… ఇదొక సూసైడ్ టెండన్సీ… అక్షరాలా నిజం… ఓ తాజా ఉదాహరణ తీసుకుందాం… రాబోయే కాలంలో ఈ దేశంలోని హిందువులు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ దేశాల్లోని హిందువులకన్నా ఘోరంగా బతకబోెతున్నారని చెప్పటానికి…
ఈ పోస్ట్ ఓసారి చదవండి…. ఇంతకుముందే ముచ్చట అసలే దురవస్థను కూడా ప్రొజెక్ట్ చేసింది… ఇదీ లింక్…
నాడు పినరై… నేడు స్టాలిన్..! హిందూ వ్యతిరేకతలో దొందూ దొందే…!!
ఒక స్టాలిన్, ఒక పినరై విజయన్… హిందువులను ఎలా దెబ్బతీస్తున్నారో…. పేరుకు నాస్తికులు… కానీ ఎడ్జ్ హిందూయేతర మతాలు… వోట్లు కావాలి… రెచ్చగొట్టాలి… అంతిమంగా హిందువులను చావు దెబ్బ తీయాలి… అదే సంకల్పం, అదే ఉద్దేశం…
ఉపద్రష్ట పార్థసారథి…. 100 మంది ఎంపీలు సంతకాలు చేశారు!
మద్రాస్ హై కోర్ట్ న్యాయమూర్తి G.R. Swaminathan గారిని తొలగింపు చేయాలి అంటూ పార్లమెంట్‌లో మోషన్ సిద్ధం చేస్తున్నారు.
ఎందుకు తెలుసా?
డిసెంబర్ 1న మధురై తిరుప్పరంకుండ్రం కొండపై వేల ఏళ్లుగా జరుగుతున్న కార్తిక దీపం వెలిగించే పుణ్యకార్యాన్ని తమిళ్- హిందూ సంస్కృతిలో అభిన్నభాగం అని గుర్తించి భక్తులకు అనుమతి ఇచ్చినందుకు!
అనుమతి ఇచ్చినందుకు న్యాయమూర్తిని తొలగించాలా?
హిందూ ధార్మిక హక్కులను కాపాడటం ఇప్పుడు నేరమా?
హిందుస్థాన్‌లో హిందూ హక్కుల కోసం మాట్లాడితే అబద్దాలంటారా?
ఇప్పుడు ప్రాసెస్ ఏమిటి..?
– 100 మంది MPs సంతకాలు పూర్తి అయ్యాయి..
– మోషన్‌ను Lok Sabha/ Rajya Sabhaలో ప్రవేశపెడతారు..
– Speaker/Chairman అంగీకరిస్తే విచారణ కమిటీ ఏర్పాటు అవుతుంది..
ఈ కమిటీలో ముగ్గురుసభ్యులు ఉంటారు… ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి (లేదా CJI), ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అలాగే ఒక “ప్రఖ్యాత న్యాయ విద్వాన్” (eminent jurist)…
– Committee విచారణ తర్వాత రెండు సభల్లో 2/3 మెజారిటీ వోటింగ్ కావాలి..
– తర్వాత President ఆమోదిస్తేనే తొలగింపు..
స్వతంత్ర భారతదేశ చరిత్రలో — ఇంతవరకు ఏ సుప్రీం కోర్ట్/హైకోర్ట్ జడ్జి కూడా పూర్తిగా ఇంపీచ్ చెయ్యబడలేదు…
అంటే రాజకీయంగా గోల పెద్దది — ఫలితం అనుమానాస్పదం!
అసలు ఈ తీర్పులో న్యాయమూర్తి తప్పేమి లేదు , అయన అంతకు ముందు వున్న తీర్పులను ఉటంకిస్తూ మాత్రమే ఈ తీర్పు ఇచ్చారు ; సింగిల్ జడ్జి తీర్పుకు హై కోర్ట్ డివిజన్ బెంచ్ కూడా మద్దతు ఇచ్చింది , స్టే ఇవ్వలేదు…
ఇంత జరిగింది కాబట్టి రేపొద్దున కమిటీ వేసిన ఆ కమిటీ అన్ని న్యాయ అంశాలు పరిశీలించి తొలగింపు అవసరం లేదు అనే చెపుతుంది , కాకపోతే ఇది న్యాయస్థానాలకే ఒక హెచ్చరిక లాగా ప్రతిపక్షాలు వాడుకుంటాయి , ఈలోగా తమిళనాడులో ఎన్నికలు వస్తాయి , ప్రతిపక్షం వోట్ బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటాయి …
ఐక్యంగా వుంటారో లేదో హిందువుల ఇష్టము… ఉండరు, ఐక్యంగా ఉంటే హిందువులు అనిపించుకోరు కదా… ము- కింద స్వీయ మంటలు పెట్టుకుని అంతరించిపోవడమే కదా హిందూయిజం అంటే… అందుకే పదే పదే చెప్పేది, అడిగేది, కోరేది…. నాట్ మోడీ… ప్లీజ్ యోగీ… మోడీ పిరికి… యోెగీ నిజ సన్యాసి..!
అసలు ప్రశ్న మాత్రం ఇంకా నిలిచి ఉంది:
Sanatana Dharma నిలబెట్టడమే నేరమా? — ఉపద్రష్ట పార్ధసారధి
.
ఈమధ్య ఎవరో ఓ తెలుగు రాజసన్యాసి పదే పదే సనాతన ధర్మరక్షకుడిని అని చెప్పుకుంటున్నాడు… ఏమోయ్, విన్నావా, చదివావా…. మైండులో ఏమైనా వెలిగిందా…? అవునూ… ఓ హైకోర్టు జడ్జి ఇంట్లో వందల కోట్ల నోట్ల కట్టలు దొరికితే ఇప్పటికీ శిక్షించే సోయి, తెలివి, బాధ్యత మోడీకి లేదు, సుప్రీంకు లేదు…
ఇప్పుడు న్యాయంగా, ధర్మంగా వ్యవహరించిన ఓ జడ్జిని కమ్యూనిస్టులు, సోకాల్డ్ ఎథిస్టులు సమర్థించి, బహిష్కరిస్తారట... ఈ దేశాన్ని ఎవ్వడూ కాపాడలేడు...
.
#PardhaTalks #HinduRights #KarthigaiDeepam #Madurai #Thiruparankundram #JusticeGRSwaminathan #SanatanaDharma #ReligiousFreedom #India #HinduCulture
.
https://www.facebook.com/watch/?ref=saved&v=741998192267040
Share this Article