‘తృణమూల్ కాంగ్రెస్, శివసేన, అకాలీదళ్, బహుజన సమాజపార్టీ, అఖిలేష్ పార్టీ, జగన్ రెడ్డికి చెందిన వైఎస్సార్సీపీ, తెలంగాణ నుంచి కేసీయార్, ఒడిశా నుంచి నవీన్ పట్నాయక్, కర్నాటకలో కుమారస్వామి… వీళ్లంతా బీజేపీ వ్యతిరేకులే… కానీ ఈ పార్టీలేవీ కాంగ్రెస్ కూటమిలో లేవు… వాళ్లను అర్జెంటుగా కాంగ్రెస్ కూటమిలోకి, అనగా యూపీయేలోకి తీసుకొచ్చి, బలమైన పోరాటాన్ని నిర్మిస్తే తప్ప లాభం లేదు…’’

………. ఇలా చెప్పుకుంటూ పోయింది ఆ సంపాదకీయం… హహహ… మహారాష్ట్రలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల అమలులో సరిగ్గా అడుగులు పడటం లేదు అని ఈమధ్య కాంగ్రెస్ అధినేత్రి సోనియా మహారాష్ట్ర సీఎం ఠాక్రేకు ఓ లేఖ రాసింది కదా… అప్పుడే మొదలైంది ముసలం… ఎహె, ఊరుకోవమ్మా, చెప్పొచ్చావు గానీ అని నేరుగా అనకుండా… ముందు నీ యూపీఏ సంగతి చూసుకో అన్నట్టుగా ఈ సంపాదకీయం రాయబడింది… వెంటనే ఈ సంపాదకీయానికి కాంగ్రెస్ స్పందించింది… మాజీ సీఎం అశోక్ చవాన్ ‘‘శివసేన అసలు యూపీఏ మెంబర్ కాదు, మరి అది ఎలా ఉంటే నీకెందుకోయ్ తీట’’ అని కామెంట్ చేశాడు… నసీం ఖాన్ వ్యాఖ్య ఏమిటంటే… ‘‘మీకు కేవలం ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఆధారంగా మద్దతు ఇస్తున్నామని గుర్తుంచుకొండి’…

సరే, వాళ్ల సంగతి వదిలేస్తే… ఈ పత్రిక బాధ్యులకు, శివసేన ముఖ్యులకు పలు రాష్ట్రాల రాజకీయాల్లోని సంక్లిష్టత ఏమాత్రం తెలియనట్టుంది… కేసీయార్ తన ప్రత్యర్థి బల్లేన్ని తెచ్చుకుని పక్కలో పెట్టుకుంటాడా..? జగన్ రెడ్డి అసలు కాంగ్రెస్‌ను మళ్లీ లేవనిస్తాడా..? అసలు వీళ్లిద్దరూ బీజేపీకి వ్యతిరేకంగా పోగలరా..? మరీ ప్రత్యేకంగా జగన్ బీజేపీతో విరోధం పెట్టుకునే స్థితిలో ఉన్నాడా..? ఆ బెంగాల్‌లో కాంగ్రెస్, లెఫ్ట్ కలిసి టీఎంసీ మీద పోరాటం చేయబోతున్నారనే సంగతీ తెలియదా..? హేమిటో, ఈ రాజకీయ అనుబంధ పత్రికలన్నీ ఇంతేనేమో… మన తెలుగు రాజకీయ పత్రికల్లాగే..!!