నిజానికి ఇప్పటి తెలుగు సినిమా ఇండస్ట్రీ పోకడల్లో దగ్గుబాటి రానాను చాలా విషయాల్లో మెచ్చుకోవచ్చు… తను హీరో మాత్రమే కాదు.., టీవీ షోల ప్రజెంటర్, నిర్మాత, గ్రాఫిక్స్-స్పెషల్ ఎఫెక్ట్స్‌తో పరిచయం ఎట్సెట్రా చాలా ఉన్నయ్… అన్నింటికీ మించి తనకు ఏ పాత్రలు సూట్ అవుతాయో తనకు బాగా తెలుసు… వాటివైపే మొగ్గుతాడు… ఘాజి, బాహుబలి, అరణ్య, విరాటపర్వం… ఇలా అన్నీ… తనకు నచ్చిన పాత్రలయితే మనసుపెట్టి వర్క్ చేస్తాడు… లవ్ స్టోరీలు, కామెడీ కథలు గట్రా తనకు పనికిరావు… పది ఆమడల దూరంలో ఉండిపోతాడు… సరసుడే కానీ తెర మీద దాన్ని నటించలేడు… నంబర్ వన్ యారీ టీవీ షోలో గెస్టులతో కామెడీగా ఆడుకోగలడు, కానీ వెండి తెర మీద కామెడీ చేస్తే ఆడ్‌గా ఉంటాడు… ఒకింత సీరియస్‌నెస్, డెప్త్ ఉన్న పాత్రలయితేనే సూటబుల్… అవసరమైతే హీరోయిన్ పాత్ర లేకపోయినా పర్లేదు… ఎలాగూ వాళ్లతో తిక్కపాటలు పాడుతూ, పిచ్చిగెంతులు వేయడు తను… అయితే..?
నేను కొన్ని కథల్ని చేయలేనురా బాబూ, ఆ పాత్రలకు నన్నడక్కండి అని బహిరంగంగానే చెబుతాడు తాను… దాపరికం ఏమీ లేదు… ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, తను ఏ పాత్రలకు సూట్ అవుతాడు అని..! కానీ అలాంటి RANA కూడా అకస్మాత్తుగా బండ్లగణేష్, కేఏపాల్ తరహాలో విచిత్రమైన వ్యాఖ్యలకు దిగాడు… చదివితే పక్కున నవ్వొచ్చింది… ‘‘ప్యూర్ ప్రేమకథలకు నేను దూరం, అందరిలా రెగ్యులర్ ప్రేమకథలు చేసే టైపు కాదు నేను… ఎందుకంటే నేను కాలేజీకి వెళ్లలేదు, నాకు కాలేజీ కథలతో ఎలాంటి కనెక్షనూ లేదు, అందుకని నేను లవ్ కథల్ని చేయలేను…’’ అనేశాడు… అదీ నవ్వొచ్చిన కారణం… హహహ… బాబూ రానా… కాలేజీలో చదివితేనే, కాలేజీ పిల్లల నడుమ మాత్రమే లవ్వు పుడుతుందా..? ఇదెవరు చెప్పారు నీకు..? నీకూ నీ భార్య మిహిక బజాజ్ నడుమ ప్రేమ ఎలా పుట్టింది మరి..? అది పెళ్లి దాకా వెళ్లింది కదా… అసలు ప్రేమకూ కాలేజీకి లింక్ ఏమిటి నాయనా..? నిజానికి కాలేజీ ప్రేమల్లో పరిపక్వత ఉండదు, అది ఉత్త ఆకర్షణ (Infatuation)… ఓ సోది గ్యాంగును వెంటేసుకుని, ఆడపిల్లలకు లైనేస్తూ, వేధిస్తూ, చివరకు తామే పడిపోవడమా ప్రేమంటే..? కాదు, ఆ వయస్సులో పుట్టే ప్రేమల్లో అధికశాతం ఫెయిల్యూర్లే… కాస్త స్థిరపడ్డాక కుదిరే ప్రేమల్లోనే ఆకర్షణతోపాటు ఆలోచన కూడా ఉంటుంది… లేటు వయస్సు ప్రేమలు కూడా బోలెడు… సో, తమరు అర్జెంటుగా తమరి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవడం బెటర్… ఇండస్ట్రీకి సంబంధించి ఏ రీజన్లు చెప్పినా రీజనబుల్‌గా ఉండాలి దగ్గుబాటి రానా బాబు గారూ…!! #RanaDaggubati