మొన్నొకసారి చంద్రముఖి హీరోయిన్ల గురించి రాస్తున్నప్పుడు… చంద్రముఖి సీక్వెల్‌కు ఆ పాత దర్శకుడు వాసు దర్శకత్వం వహిస్తున్నాడనీ, చీప్ టేస్టున్న సదరు దర్శకుడు ఈ సినిమాను ఏం చేస్తాడో పాపం అని అభిప్రాయపడ్డాను… అనుమానించినట్టే జరిగింది… ఓ చెత్తా సినిమాను వదిలాడు ప్రేక్షకుల మీదకు… సీక్వెల్‌కూ స్పూఫ్కూ తేడా తెలియదు ఈ దర్శకుడికి… ఓ పాపులర్ కమర్షియల్ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే మరీ ఆ ఒరిజినలే పదే పదే గుర్తొచ్చేలా (పాతదే నయం అని గుర్తొచ్చేలా… […]
కంగనా రనౌత్ నార్త్ చంద్రముఖి… నాలుగు కాదు, ఆమె నంబర్ అయిదు…
సినిమా సైట్లు, యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది… చంద్రముఖిగా ఎవరు బాగా చేశారు అని..! సరదాగా బాగానే ఉంది కానీ చాలామంది కంగనా రనౌత్‌ను నాలుగో నంబర్ చంద్రముఖిగా చెబుతున్నారు… అదీ బ్లండర్… ఆమె త్వరలో విడుదల కాబోయే చంద్రముఖి-2 సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది… నటిగా ఆమె మెరిట్‌కు వంక పెట్టలేం… కాకపోతే ఆమె సౌత్ సినిమాల్లో నటించి ఎప్పుడూ పెద్దగా క్లిక్ కాలేదు… ఈ సినిమా రిజల్ట్ చూడాలిక… దెయ్యం, […]
ఈమె కాంచన కాదు, కంగనా… లారెన్స్, ఈమె మరీ జగమొండి చంద్రముఖి…
రజినీకాంత్ చంద్రముఖి సీక్వెల్లో కంగనా రనౌత్… ఇదీ వార్త… ఆమే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కూడా… కాబట్టి కన్ఫరమ్… ఫాఫం, రాఘవ లారెన్స్‌కు ‘‘కాంచన నష్టాలు కమ్ కంగనా కష్టాలు’’ తప్పేట్టు లేవు… ఈ చంద్రముఖిని తట్టుకోవడం కష్టమే… నిజానికి గత జూన్ నుంచే కాదు, అంతకుముందు నుంచే చంద్రముఖి సీక్వెల్ అని ఎవరెవరో చెబుతున్నారు… కానీ లారెన్స్ ప్రధానపాత్రలో నటిస్తాడు అని ప్రకటించాక క్లారిటీ వచ్చింది… కాంచనలోలాగే ఓ ఆడవేషం వేసుకుని, తనే రాజనర్తకి […]
చంద్రముఖి పేరు చెప్పుకుని… సీక్వెల్ కాయలు అమ్మేస్తున్నారు…
ఫాఫం చంద్రముఖి…! ఓ పోస్టర్ చూడగానే అనిపించింది ఇలాగే..! సదరు పోస్టర్ వార్తేమిటీ అంటే… లారెన్స్ ప్రధానపాత్రలో చంద్రముఖి-2 వస్తోందట… అది సీక్వెలా..? లేక వేరే కథకు ఈ పేరు పెట్టుకుని ‘కాయలమ్ముకుంటారా’ అనేది వేచిచూడాలి… కానీ ఎందుకు జాలేసిందో చెప్పుకోవడానికి మనం కేరళ వెళ్లాలి… రకరకాల కథలు, ప్రయోగాలు, చౌక ఖర్చు, వేగంగా నిర్మాణం, నో రిస్క్ ఇవన్నీ ఒకప్పటి మలయాళ సినిమా విశేషాలు… మణిచిత్రతాజు సినిమా కూడా ఆ కోవలోనిదే… 1993లో… మోహన్‌లాల్ హీరోగా, […]