జై నారాయణ.. జైజై నారాయణ.. ‘నిషేధం’ ఉద్యమం.. వర్థిల్లాలి.. వర్థిల్లాలి.. —————– మొన్న (శనివారం) సాయంత్రం టీవీ9 ఆన్ చేయగానే, సీపీఐ నారాయణ గారు ప్రత్యక్షమయ్యారు. బిగ్ బాస్ షో, దాని యాంకర్ నాగార్జునపై భగ్గుమంటున్నారు. ఒక్కోసారి ఆయన మాటలు తూటాల్లాగా పేలుతుంటాయి. ఇప్పుడు తూటా కాదు.. ఏకంగా ‘మిస్సైల్’ పేల్చేశారు. బిగ్ బాస్ హౌస్ కు తనదైన శైలిలో ‘బ్రోతల్ హౌస్’గా నామకరణం చేశారు. నారాయణ గారు టీవీ తెరపై అప్పుడప్పుడు ఇలా సడన్ గా […]
ఆ ఇద్దరి సంవాదం ముదురుతోంది… అందరూ సైలెంటుగా చదువుతున్నారు… అంతే…
సాధారణంగా సొసైటీలో అనామకులు ఎవరో సోషల్ మీడియాలో ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటే… వాళ్ల మిత్రవర్గం అటోఇటో స్టాండ్ తీసుకుని, సంవాదంలోకి దూరిపోతుంటారు… చిన్న చిన్న విషయాలు కూడా రచ్చ రచ్చ అయిపోతుంటాయి…. కానీ ఇది పూర్తి భిన్నంగా, కాస్త ఆసక్తికరంగా కనిపిస్తోంది… ఒకాయన దేవులపల్లి అమర్… జగన్ ప్రభుత్వంలో జాతీయ, అంతర్జాతీయ మీడియా వ్యవహారాల సలహాదారు… జాతీయ స్థాయిలో వేలాది మంది జర్నలిస్టులు సభ్యులుగా ఉన్న ఐజేయూ నాయకుడు… ఆమధ్య అధ్యక్షుడు కూడా… సో, సొసైటీలో ఓ […]
బిగ్‌బాస్ కంటెస్టెంట్లపై హేయమైన ముద్రలు..! నువ్వు ఒక జాతీయ నేతవా..?!
ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం కోణంలో భ్రష్టుపట్టిపోవచ్చుగాక… పార్టీ ఉనికే ఊగిసలాటలో ఉండవచ్చుగాక… కానీ సీపీఐకి ఈ దేశ రాజకీయ చరిత్రకు సంబంధించి ప్రాముఖ్యత ఉంది… ఈరోజుకూ ఆ పార్టీ జెండా కోసం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలున్నారు, అభిమానులున్నారు… ఒకప్పుడు పార్టీ ప్రవచించిన సిద్ధాంతాల కోసం, ఆదర్శాల కోసం ఎందరెందరో తమ ప్రాణాలకు తెగించి పోరాడిన చరిత్ర కూడా ఉంది… అలాంటి పార్టీకి నారాయణ జాతీయ కార్యదర్శి… ఆయన పిచ్చి కూతలు వింటుంటే, అసలు ఎలా ఆ హోదా […]
ఫాఫం… ఒకప్పుడు ఎంతగా వెలిగిన జెండా… ఇప్పుడు వ్యక్తి సంకీర్తనలకు అడ్డా…
పాపం, సీపీఐ… ఒకప్పుడు తెలంగాణ విముక్తి కోసం, పీడితుల భుక్తి కోసం సాయుధ పోరాటం చేసిన పార్టీ… వాళ్ల అసలు లక్ష్యాలు ఏమిటీ, ఇండియన్ యూనియన్‌లో కలిశాక కూడా పోరాటం ఎందుకు చేశారో, తరువాత ఎందుకు విరమించారో చరిత్ర… వేరే చర్చ.,. కానీ ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి చూస్తే నిజంగా జాలేస్తున్నది… తెలంగాణలో కాదు, మొత్తం దేశంలోనే అది ఆరిపోతున్న దీపం… కేరళ, తమిళనాడు గట్రా… ఎవడైనా ఎక్కడైనా రెండుమూడు సీట్లు దయతో ముష్టి విసిరేస్తే, […]
ఓహ్… చంద్రబాబు స్టూడెంట్ లీడర్‌గా ఉన్నప్పటి నుంచీ ఇంతేనా…!!
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కడుపులో ఉన్నది కక్కేస్తాడు… పలుసార్లు హిపోక్రటిక్, డిప్లొమాటిక్ వికారాలేమీ ప్రదర్శించడు… కనీసం ఆ పార్టీకి అలవాటైన పడికట్టు పదాల్ని కూడా వాడడు… ఎవడో ఏదో అనుకుంటాడనే భావన కూడా రానివ్వడు… ఇప్పుడేం చెప్పాడంటే..? పరోక్షంగా… చంద్రబాబు తన విద్యార్థి జీవితం నుంచీ కులం పర్టిక్యులర్ రాజకీయాలే ప్రదర్శించాడనీ… ఈ కమ్మ-రెడ్డి వైరం దశాబ్దాల క్రితమే తిరుపతిలో చూసిందేననీ చెబుతున్నాడు… ఓహ్, అంటే ఇదేమీ కొత్త కాదన్నమాట… ఓహ్, ఈ రెడ్డి రాజకీయాల్ని […]