అసలు సినిమారంగంలో ప్రముఖుల బయోపిక్స్ తీస్తే వాళ్ల కొడుకులే వాటిల్లో నటించాలా..? అది కూడా వారసత్వం సమస్యేనా..? ఈ చర్చ ఎందుకొస్తున్నదీ అంటే… సాధారణంగా సినిమా ప్రెస్మీట్లలో కొన్ని రొటీన్, కాజువల్, నాన్-సీరియస్ ప్రశ్నలు వేయబడుతూ ఉంటయ్… ఏదో ఒకటి అడగాలి… ఇంటర్వ్యూలలో కూడా హీరోయిన్లను అడిగే జనరల్ ప్రశ్న ‘‘పెళ్లెప్పుడు చేసుకుంటున్నారు..?’’… ఆమె పెళ్లి చేసుకుంటేనేం, చేసుకోకపోతేనేం అనకండి… సినిమా ప్రశ్నలు అలాగే ఉంటయ్… వాళ్ల పెళ్లిళ్లు కుదిరితే, కడుపులు పండి, కొడుకో బిడ్డో భూమ్మీద […]