ఎందరు వచ్చినా, ఎవరెన్ని కామెంట్లు చేసినా, ఎంతగా కుళ్లుకున్నా, ఎందరు అనుకరించే విఫలప్రయత్నాలు చేసినా… తెలుగు వినోద చానెళ్లలో అత్యంత హిట్ పెయిర్ రష్మి, సుధీర్… అబ్బే, మామధ్య ఏమీ లేదు, కేవలం స్నేహమే, వృత్తిపరమైన బంధమే అని వాళ్లిద్దరూ ఎన్నిసార్లు ఎన్ని వేదికల మీద చెప్పుకున్నా సరే, ఆ జంట ఎప్పుడు కనిపించినా ప్రేక్షకులకు ఆసక్తే… దాదాపు తొమ్మిదేళ్లుగా వాళ్లను ప్రేమికులుగా చూపిస్తూనే ఉన్నారు… ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, స్పెషల్ ఈవెంట్స్… షో […]
ఫాఫం… పూర్ణ ప్లేసులో కొత్త కేరక్టర్… సుధీర్, రష్మిలకు ఆల్టర్నేట్స్ లేరు..!
శేఖర్ మాస్టర్ వెళ్లి చాలారోజులైంది… జడ్జి ప్లేసు నుంచి పూర్ణను తరిమేశారు… టాప్ పెయిర్ సుధీర్, రష్మిలను వెళ్లగొట్టారు.., చూడచక్కగా ఉన్న దీపిక పిల్లికి పొగబెట్టారు… వెరసి ఈటీవీ వాడి ఢీ షో కళతప్పింది… అదే ప్రియమణి, అదే ప్రదీప్, ఆమధ్య కొత్తగా వచ్చిన గణేష్ మాస్టర్… ప్చ్, వెలిసిపోయినట్టుంది షో… ముందొచ్చిన చెవులకన్నా కొమ్ములు వాడి అన్నట్టుగా, ఎన్నాళ్లుగానో ఉన్న సుధీర్ అల్లం అయిపోయాడు… ఆమధ్య కొత్తగా చేరిన హైపర్ ఆది బెల్లం అయిపోయాడు… ఒక్కసారిగా […]