యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ… అలియాస్ మణిశర్మ… మొన్నామధ్య ఎంతసేపూ తమన్, డీఎస్పీయేనా… నాకూ చాన్స్ ఇస్తే వైవిధ్యం ఉంటుంది కదా అంటూ నిర్మాతలను కోరుతూ హఠాత్తుగా ప్రచారతెర మీదకు వచ్చాడు… నిజంగా ట్రాజెడీ… 30 ఏళ్లు తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన మణిశర్మ నాకూ చాన్సులు ఇవ్వండి సార్ అనడగడం బాగనిపించలేదు… అడగడం బాగా లేదని కాదు… అలా అడిగే సిట్యుయేషన్ బాగా లేదని… ఎస్, ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్, డీఎస్పీ టాప్ మ్యూజికల్ […]
ఒక షోకు జడ్జి కావడం అంత గొప్ప విజయమా..? ఆంధ్రజ్యోతికి ఇదేం దరిద్రం..!!
ఆంధ్రజ్యోతి ఫ్యామిలీ పేజ్ నవ్యలో కాస్త క్వాలిటీ కంటెంట్ ఉంటుందని అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు… ఆదివారం గీతామాధురి ఇంటర్వ్యూ ఎందుకు వేశారో, అది సండే స్పెషల్ ఎలా అయ్యిందో ఆ ఎడిటర్‌కు, ఓనర్‌కే తెలియాలి… నో డౌట్, అనేకమంది తెలుగు ఫిమేల్ సింగర్స్‌లో గీతామాధురి టాప్ టెన్ లేదా టాప్ ఫిఫ్టీన్లో ఉంటుంది… కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఎందుకయ్యా, సందర్భం ఏమిటయ్యా అంటే… ఆమె ఆహా ఓటీటీలో వచ్చే తెలుగు ఇండియన్ ఐడల్ షోలో జడ్జిగా […]
కాపీ ట్యూన్ రచ్చలోకి పరోక్షంగా డీఎస్పీని కూడా లాగిన థమన్…
మొత్తానికి థమన్ భలే చెప్పాడు… కాదు, అంగీకరించాడు… పాత సినిమాల్లోని ట్యూన్లను కాపీ కొట్టేస్తామని చెప్పేశాడు… జైబాలయ్య అనే పాటకు తను వాయించిన ట్యూన్ గతంలో వందేమాతరం శ్రీనివాస్ పాడిన ఒసేయ్ రాములమ్మ టైటిల్ సాంగ్‌తో పోలి ఉందని సోషల్ మీడియా ఆల్రెడీ థమన్ బట్టలిప్పింది… థమన్ ఏ పాట చేసినా సరే, క్షణాల్లో అది గతంలో ఏ సినిమాలో వచ్చిందో, ఎక్కడి నుంచి కాపీ కొట్టారో సోషల్ మీడియా బయట పెట్టేస్తోంది… గతంలోనైతే ‘నో, నో, […]
అవార్డులంటే అంతే బ్రదర్… కొన్నే మెరుపులు, అనేక పెదవివిరుపులు…
జాతీయ అవార్డుల ప్రకటన ప్రతిసారీ ఓ ప్రహసనమే… రాష్ట్రాలు, కేంద్రం ప్రకటించే అవార్డులంటేనే అదోరకం… బోలెడు పైరవీలు, లెక్కలు, విధేయతలు మన్నూమశానం… అందుకే ఆ అవార్డులు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తాయి… ఏ పైరవీలు అడ్డుపడని కేటగిరీల్లో మాత్రం ఎంపికలు బాగానే ఉంటయ్… ఉదాహరణకు అయ్యప్పనుం కోషియం సినిమాకు దక్కిన అవార్డులు… ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గాయని, ఉత్తమ యాక్షన్ డైరెక్టర్ అవార్డులన్నీ దానివే… సరైన ఎంపికలు కూడా… కానీ..? ఉత్తమచిత్రం సూరారై పొట్రు సంగతికొస్తే… […]
క్లాప్స్ టు కార్తీక్ అండ్ శ్రీరామచంద్ర..! మ్యూజిక్ షో అంటే ఇదీ…!
నిజానికి ముందుగా చెప్పుకోవాల్సింది వేరు… మామూలుగా టీవీల్లో వచ్చే మ్యూజిక్ షోలలో మీకు ఆర్కెస్ట్రాయే ఎప్పుడూ కనిపించదు… ఎక్కువగా ట్రాకులు ఉపయోగించి కథ నడిపించేస్తుంటారు… ఒకవేళ నామ్కేవాస్తే ఆర్కెస్ట్రా చూపించినా కీబోర్డ్, డ్రమ్స్ మాత్రమే ప్రముఖంగా కనిపిస్తాయి… ఇవేకాదు, ఫంక్షన్లలో కూడా అంతే… ట్రాకులు పెట్టి బండి నడిపించడమే… కానీ లైవ్ ఆర్కెస్ట్రా మజాయే వేరు… వీణ ఎప్పుడో మాయమైంది… వయోలిన్ అక్కడక్కడా కనిపిస్తోంది… సంప్రదాయ వాయిద్యాలు మాయమై పూర్తిగా కీబోర్డు ఆధిపత్యం పెరిగింది… బాలు సారథ్యంలో […]
కో-హోస్ట్ శ్రావణభార్గవి కాస్తా హోస్ట్ అయిపోయింది… శ్రీరామచంద్ర గాయబ్…
తనకు కో-హోస్టుగా హఠాత్తుగా శ్రావణభార్గవిని తెచ్చిపెట్టారని అలిగి శ్రీరామచంద్ర తెలుగు ఇండియన్ ఐడల్ షో నుంచి నిష్క్రమించాడా..? అందుకే కో-హోస్టు కాస్తా అకస్మాత్తుగా ఫుల్ టైమ్ హోస్టు అయిపోయిందా..? లేక శ్రీరామచంద్రను తప్పించడానికే ప్లాన్ చేసి, ముందస్తు ప్లాన్‌తో శ్రావణభార్గవిని కో-హోస్టుగా తీసుకొచ్చారా..? ఏమో… మొత్తానికి శ్రీరామచంద్ర సడెన్‌గా ఆదివారం ఎపిసోడ్ సీన్ నుంచి మాయమయ్యాడు… సరే, ఇవేవీ కారణాలు కావు, ఏదో పని ఉండి షూటింగుకు రాలేకపోయాడు అనే అనుకుందాం… కానీ దానికి ఓ చీప్ […]
ఔనా, థమన్ భయ్..? నువ్వు చెప్పేది నిజమా..? ఓహో, అలాగా..? అబ్బ ఛా..!
సర్కారువారి పాట మూవీ విక్టరీ పార్టీకి థమన్ ఎందుకు పోలేదు..? బీజీఎం సరిగ్గా లేదనీ, రెండు పాటలు కాపీ ట్యూన్లేననీ మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి కూడా విమర్శలొచ్చాయి… ఏపాట దేనికి కాపీయో కూడా సోషల్ మీడియా బట్టలిప్పేసింది… ప్రత్యేకించి సూపర్ హిట్ సాంగ్ కళావతి పల్లవి కొత్తగానే ఉన్నా, చరణాలన్నీ తన పాత పాటలకు కాపీయేననీ నెటిజనం విశ్లేషించింది… తనపై జరుగుతున్న కాపీక్యాట్ ప్రచారంతో డిస్టర్బ్ అయినందువల్లే థమన్ సర్కారువారిపాట పార్టీకి పోలేదని ఓ టాక్… […]
థమన్ నోట అంత పెద్ద వ్యాఖ్య వచ్చిందా..? రియల్లీ ‘ఆహా’శ్చర్యమే..!!
ఆ ఎపిసోడ్ చూస్తుంటే ఓచోట ఒక్కసారిగా హాహాశ్చర్యం ఆవరించింది… రామజోగయ్యశాస్త్రి గెస్టుగా పాల్గొన్న తెలుగు ఇండియన్ ఐడల్ తాజా ఎపిసోడ్ అది… సింగింగ్ కంటెస్టెంట్ వాగ్దేవి రంగ్‌దే పాటపాడింది… తరువాత తన అభిప్రాయం చెబుతూ థమన్… ‘‘వాగ్దేవీ, నువ్వు రాబోయే పదిహేను ఇరవై ఏళ్లు ఇండస్ట్రీని ఏలుతావు’’ అని వ్యాఖ్యానించాడు… ఆమె కూడా ఆశ్చర్యపోయింది ఆ అభినందన విని… ఎపిసోడ్ చూస్తున్న ప్రేక్షకులతోపాటు..! మ్యూజిక్ కంటెస్ట్‌కు సంబంధించిన బోలెడు టీవీషోలు ప్రతి భాషలోనూ వస్తూనే ఉంటయ్… కానీ […]