ముందుగా అనుకున్నదే… పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ తమిళంలో తప్ప ఎక్కడా ఆడదని..! కారణం మణిరత్నం ఉన్నదున్నట్టుగా తమిళ ప్రైడ్ అన్నట్టుగా సినిమాను తీశాడు… ఎప్పటిలాగే ఇతర భాషల డబ్బింగ్ నాణ్యత పట్టించుకోలేదు, ఎస్, తమిళులకు అది గొప్ప చరిత్ర… అందులో కాల్పనికత కూడా ఉంది… ఫేమస్ తమిళ్ రైటర్ కల్కి కృష్ణమూర్తి పలు భాగాలుగా రాసిన పొన్నియిన్ సెల్వన్ నవలలోనే మూడునాలుగు సినిమాలకు సరిపడేంత సరుకుంది… కానీ అది ఇతర దక్షిణాది రాష్ట్రాల ప్రజలకే ఎక్కదు, […]
ఆ ముగ్గురి సొగసులే మణిరత్నం భారీ సినిమాకు ఇంధనం…
రోజూ వంద మంది స్టార్స్ వస్తుంటారు… పోతుంటారు… సినిమా ఇండస్ట్రీ ఓ దీపం… మిడతలు ఆకర్షింపబడుతూనే ఉంటాయి… ఒక లేడీ స్టార్ ఎన్నేళ్లు తెరపై తన సొగసును, తన పాపులారిటీని, తన మెరిట్‌ను, తన జీల్‌ను కాపాడుకుంటూ ఉండగలదు… మహాఅయితే ఆరేడేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్లు… అది చాలా ఎక్కువ పీరియడ్… కొన్ని మినహాయింపులు ఉంటాయి… వారిలో త్రిష ఉంటుంది… ఐశ్వర్యారాయ్ ఉంటుంది… సేమ్, అదే లుక్కు… ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎలాగో… అలాగే… వీరిద్దరిలోనూ ఐశ్వర్య భిన్నమైన స్టోరీ… […]