Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

header-new-unit-muchata.com
  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఖడ్గతిక్కన..! చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలి తప్పుడు నిర్ణయం..!!

April 2, 2021 by M S R

ఒక రాజకీయ పార్టీగా ప్రజల్లో ఉన్నప్పుడు… ప్రజాస్వామిక ప్రక్రియలో పాల్గొనాలి… ఎన్నికల్లో పోటీచేయాలి… ఎన్ని వోట్లు వేస్తాయనేది జానేదేవ్… డిపాజిట్లు వస్తాయా, నోటాను మించి వోట్లు వస్తాయా అనేది కాదు… పోటీలో ఉ్ండటం స్పిరిట్… అది పాటించలేనప్పుడు పార్టీ ఉనికికే అర్థం లేదు… ఈ నీతివాక్యం టెక్నికల్…. ఇక రెండో రియాలిటీ పాయింటుకొస్తే… ఊళ్లల్లో గానీ, పట్టణాల్లో గానీ పార్టీ కేడర్ ఏదో ఒక యాక్టివిటీలో ఉండాలి… ప్రత్యేకించి ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ కేడర్ ప్రతిఘటన కార్యక్రమాల్లో హుషారుగా ఉండాలి… లేకపోతే కేడర్ నిలవదు… డీలాపడి పార్టీ క్రమేపీ బలహీనపడిపోతుంది…… ఈ రెండు అంశాలూ చంద్రబాబుకు తెలుసు… నలభై ఏళ్ల రాజకీయ జీవితం తనది… మానవరూపంలో కనిపించే Indian Political Text Book తను… అలాంటిది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయం తన మొత్తం రాజకీయ జీవితంలో తొలిసారిగా తీసుకున్న చిత్రమైన నిర్ణయం… Suicidal… తెలుగులో ఆత్మహత్యాసదృశం…

తన సుదీర్ఘ అనుభవం, తన రాజకీయ పరిజ్ఞానం ఏమీ అక్కరకు రాలేదేమో బహుశా ఈ నిర్ణయం తీసుకునే ముందు… ఆమధ్య ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన రాతల్లో సలహా ఇచ్చాడు కదా… ‘‘ఈ తొక్కలో ఎన్నికల్లో పోటీ చేస్తే ఎంత..? చేయకపోతే ఎంత..? ఈ స్థానిక ఎన్నికలు, ఈ ఉపఎన్నికలు వేస్ట్, గతంలో జయలలిత, జ్యోతిబసు కూడా అవాయిడ్ చేశారు…’’ అని..!!. అది అక్షరాలా పాటిస్తున్నాడు చంద్రబాబు… పైగా ఈ ఎన్నికల బహిష్కరణ వల్ల చంద్రబాబు ఓ కొత్త బదనాం మోయాల్సి వస్తుందనే నిజాన్ని కూడా మరిచిపోయాడు… అదేమిటంటే..? ‘‘పంచాయతీ ఎన్నికలు, పురపాలక ఎన్నికల్లో అడ్డంగా బోల్తాకొట్టిన చంద్రబాబు ఈ పరిషత్ ఎన్నికల్లోనూ దారుణమైన భంగపాటు తప్పదని గ్రహించి, ఈ కొత్త డ్రామాకు తెరలేపాడు’’ అనే నింద… ఇది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీతనానికే పెద్ద మచ్చ…

babu

తను చెబుతున్న కారణాలు కూడా లాజిక్కుకు అందవు… అన్నీ కుంటిసాకులే… ఈ బహిష్కరణలో వ్యూహం కూడా ఏమీ కనిపించడం లేదు… కొత్త ఎన్నికల కమిషనర్ రాగానే ఎన్నికలు ఎలా పెడుతుంది అనడుగుతున్నాడు చంద్రబాబు..? ఏం, ఎందుకు పెట్టకూడదు..? అప్పట్లో పరిషత్ ఎన్నికలు వాయిదా పడినప్పుడు ఆమె ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మొన్నమొన్నటిదాకా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిగాయి… సో, యంత్రాంగం అన్నిరకాల సన్నద్ధంగా ఉంది… ఆమెకు రాష్ట్ర పరిస్థితులు సమగ్రంగా తెలుసు… ఎస్ఈసీగా సాహ్నిది రాజ్యాంగబద్ధమైన ఎంపిక… దీనికి కూడా చంద్రబాబు ఆమోదముద్ర, విధేయముద్ర పడాలా ఏం..? బలవంతంగా వైసీపీ వాళ్లు ఏకగ్రీవాలు చేయించారు అనేది మరో ఆరోపణ… ఏవో లెక్కలు కూడా చెబుతున్నాడు… అవును, రాజకీయాలంటేనే దుర్మార్గం, దౌర్జన్యం కదా బాబయ్యా… పైగా ఇప్పుడు మీరు వైదొలిగితే… మరింత జోరుగా, హుషారుగా వైసీపీ ఏకగ్రీవాలు చేసుకుంటుంది కదా… ఇక తమరి ఆరోపణకు బహిష్కరణ ఎలా జవాబు అవుతుంది..? ఏం లాజిక్ ఉంది..? వచ్చే ఫాయిదా ఏముంది..?

ఏకగ్రీవాలు పోగా, ఆల్‌రెడీ టీడీపీ అభ్యర్థులు అధికారికంగా బరిలో ఉన్నారు… వాళ్ల పరిస్థితేమిటి ఇప్పుడు..? ఒకవేళ హైకోర్టు ఏకగ్రీవాలపై ఏదైనా తీర్పు వెలువరిస్తే, అప్పుడేం చేయాలి టీడీపీ..? పైగా ఎస్ఈసీ తీరుకు నిరసనగా బహిష్కరణ అనే ప్రకటన కూడా సరికాదు… అప్పట్లో వాయిదా పడిన ఎన్నికల్ని కొత్త ఎస్ఈసీ నిర్వహిస్తున్నదంతే… అది ఆమె డ్యూటీ… అంటే, మనకు నమ్మకస్తుడైన కమిషనర్ ఉంటేనేమో… ప్రజాస్వామిక ఎన్నికల వాతావరణం ఉన్నట్టు, జగన్ విధేయ కమిషనర్ వస్తే అప్రజాస్వామిక, అరాచక వాతావరణం ఏర్పడినట్టా..? అదెలా..? అన్నట్టు, తిరుపతి ఉపఎన్నికలోనూ ఉంటారా..? ఎలాగూ అది కూడా ఓడిపోతాం కాబట్టి, ఇంకేదో సాకు చెప్పి బహిష్కరిస్తారా..? ఆ ఉపఎన్నిక ప్రజాస్వామిక వాతావరణంలోనే జరుగుతుందని నమ్ముతున్నారు కదా… ఫాఫం, ఆ ఎన్నికైనా, ఈ పరిషత్ ఎన్నికలైనా నిర్వహించేది రాష్ట్ర అధికార యంత్రాంగమే బాబు గారూ… అదే చీఫ్ సెక్రెటరీ, అదే డీజీపీ…

చివరగా :: ఎన్నికలు అంటేనే ఓ ఫైట్… అంపైర్ పక్షపాతి, స్కోర్ సరిగ్గా ఉండదు, నేను బరిలోకే దిగను, పోటీపడను అని కూర్చుంటే… ఏమవుతుంది..? ఏమీ కాదు… ఎదుటోడు కప్పు చేతిలో పట్టుకుని వెక్కిరింపుగా నవ్వుతాడు…!! హహహ… విచిత్రం ఏమిటంటే…. నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేస్తే వైసీపీ తప్పుపట్టింది మొదట్లో, తరువాత ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ రెడీ అనగానే, నో, నో, కరోనా ఉంది, ఎన్నికలు వద్దు అని మొరాయించింది వైసీపీ… అప్పుడు ఇదే టీడీపీ వెక్కిరించింది… ఓటమి భయంతో జగన్ పారిపోతున్నాడహో అంటూ… ట్విస్టు ఏమిటంటే..? కరోనా సెకండ్ వేవ్ ఉన్నా సరే ఇప్పుడది చర్చనీయాంశం కావడం లేదు… హెహెహె అని వెక్కిరించిన చంద్రబాబే వెనక్కి తిరిగి పారిపోతున్నాడు… ఖడ్గతిక్కన..!!

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • తెలుగు నెటిజనం ఆడేసుకుంటున్నారు… పకపకా నవ్వేసుకుంటున్నారు…
  • ఏపీ పాలిటిక్స్..! మరీ కులం బురద రేంజ్ దాటి… అచ్చెన్నాయుడు స్థాయికి…
  • ట్యూన్ కాదుర భయ్… కంటెంటే అల్టిమేట్… కాదంటే వీళ్లను అడగండి…
  • జగన్ ఆ టార్గెట్ కొడితే… చంద్రబాబు ఇక రిటైర్ అయిపోవడమే బెటర్…
  • పీవీ మార్క్ ప్రశ్న… సమాధానం చెప్పలేక అంతటి అవధానీ చేతులెత్తేసి…
  • ఇదే ప్లవ ఉగాది… 60 ఏళ్ల క్రితం… నాటి ఆంధ్రపత్రిక ప్రత్యేక సంచిక అదుర్స్…
  • బీబీసీ..! మరీ తెలుగు మీడియా టైపు అంత ఏడుపు వద్దులేరా నాయనా…!!
  • గత్తర..! పీనుగుల్ని కాల్చీ కాల్చీ దహనయంత్రాలే పీనుగులవుతున్నయ్…
  • తెలుగులో మంచి కథకులు ఎవరూ లేరు..! తేల్చిపారేసిన ఈనాడు..!!
  • సారంగదరియా సరే… మరి ఈ బేట్రాయి స్వామి దేవుడి ఖూనీ మాటేమిటి..?!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now