Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ రథం ఎక్కడిదబ్బా… తేలుతూ ఎలా కొట్టుకొచ్చింది… ఏ దేశానిదో…

May 11, 2022 by M S R

పెద్ద పెద్ద తుపాన్లకు సముద్రం పొంగి, తీర ప్రాంతాల్లోని ఊళ్లను, ఇళ్లను, ఆస్తులను తనలోకి లాగేసుకోవడం చాలా పరిపాటి… అందులో పెద్ద హాశ్చర్యం ఏమీలేదు… అయితే నిన్న అసని తుపాన్‌తో సముద్రం అల్లకల్లోలంగా ఉన్న స్థితిలో ఏపీ, శ్రీకాకుళం, సున్నపల్లి తీరప్రాంతానికి కొట్టుకొచ్చిన రథం ఓ మిస్టరీగా మారింది… బంగారు కలర్ కోటింగ్ ఉన్న ఆ రథం మిస్టరీ కాదు, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక ప్రశ్న… అంత బరువైనది అలలపై మునుగుతూ తేలుతూ ఇంతదూరం కొట్టుకురావడం ఎలాగనేది మరో ప్రశ్న…

స్థానిక మత్స్యకారులు తాళ్లతో కట్టేసి, మెల్లిగా తీరానికి లాక్కొచ్చారు… ఇంతకీ అది ఎక్కడిదనే ప్రశ్నకు రకరకాల జవాబులు వినిపిస్తున్నాయి… ఇండొనేషియా, మయన్మార్, థాయ్‌లాండ్, మలేషియా వంటి దేశాల నుంచి కొట్టుకొచ్చి ఉంటుందని కొందరు అధికారుల అభిప్రాయం… పలు మఠాల్లో ఇలాంటి నిర్మాణాలు ఉంటాయని అంటారు… నో, నో, వేరే దేశాల్లోని తీర గ్రామాల్లో దేవుళ్ల ఊరేగింపుకు వాడే రథం అని మరికొందరి అభిప్రాయం… మొత్తానికి ఇంటలిజెన్స్ వాళ్లకు సమాచారం ఇచ్చారు…

#WATCH | Andhra Pradesh: A mysterious gold-coloured chariot washed ashore at Sunnapalli Sea Harbour in Srikakulam y'day, as the sea remained turbulent due to #CycloneAsani

SI Naupada says, "It might've come from another country. We've informed Intelligence & higher officials." pic.twitter.com/XunW5cNy6O

— ANI (@ANI) May 11, 2022

కొందరయితే అబ్బే, దానికి అంతసీన్ లేదు, ఏదో సినిమా కోసం వేసిన సెట్టింగ్ అది కొట్టిపడేశారు… ఇంకొందరు మన దేశంలోని తూర్పు తీరంలోని ఏదో గ్రామానికి సంబంధించిన దేవుడి రథం అయి ఉంటుందని తేల్చిపడేశారు… కానీ అది మన దేశంలోనే ఎక్కడో బాహుబలి వంటి పెద్ద సినిమాలకు వేసిన సినిమా సెట్టింగ్‌లాగా లేదు… దాని నిర్మాణ రీతి చూస్తే అది ఏదో తూర్పు దేశాలకు చెందినట్టుగా కనిపిస్తోంది… ప్రత్యేకించి మలేషియాలో చిన్న బౌద్ధ మందిరంలాగా ఉంది… (మలేషియన్ అక్షరాలు చెక్కి ఉన్నాయట…) సినిమా సెట్టింగ్ అయితే సముద్రం మధ్యలోనే తన చెక్కలను ముక్కలు చేసుకునేది… పైగా పెద్ద సినిమాలకు ఇంత పెద్ద సెట్టింగులు వేసేంత సీన్ ఒడిశా, బెంగాల్‌లలో లేదు…

chariot

తూర్పు దేశాలకు చెందిన దేవుళ్ల ఊరేగింపు రథాలను నెట్‌లో పరిశీలించినా సరే, దీంతో పోలిన రథాలేమీ కనిపించడం లేదు… పైగా నిక్షేపంగా, ఏ డ్యామేజీ లేకుండా… పైగా తేలుతూ ఇంత దూరం ఎలా వచ్చింది..? ఏ ఒడిశా, బెంగాల్‌కో చెందిన తీర గ్రామాల్లో ఊరేగింపులకు చెందిన రథం కావచ్చునని ఓ అంచనా… రథం అయితే చక్రాలు గట్రా ఉండాలి కదా… ఇది ఓ వేదికపై కట్టినట్టుగా ఉంది… నీటికి తడిసి, ఏ దుమ్మూ, చెత్తా లేకుండా, నీట్‌గా కడిగినట్టుగా… తళతళ మెరుస్తున్న అదేమిటో… ఎక్కడిదో మరి…!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • గుప్తగామిని..! 18 ఏళ్ల క్రితమే పవిత్ర హైదరాబాద్‌కు చక్కర్లు కొట్టేది… ఎందుకు..?!
  • ఒకప్పుడు పొట్టతిప్పల చిరుద్యోగం… ఈ ‘‘యాక్టింగ్ సీఎం’’ ప్రస్థానం ఇంట్రస్టింగ్…
  • హబ్బ… మక్కీకిమక్కీ ఆ కథ మొత్తం ఏం కొట్టేశావు బాసూ…
  • నక్సలైట్ల గురించి తెలియకుండా ఈ సినిమాలు ఏమిట్రా నాయనా..?!
  • మోడీ మళ్లీ ప్రధాని కాగానే 50 రాష్ట్రాలు… 50 united states of India..!
  • ఈ ఆనందం పేరేమిటంటారు ఆంధ్రజ్యోతి మహాశయా..?
  • నిరోధ్ వాడితే కేసు..! పిల్స్ దొరికితే జైలు..! కాపర్ టీ వేసుకుంటే అరెస్టు..!!
  • ఆనంద్ దిఘే..! ఏకనాథ్ షిండేకు పదునుపెట్టిన ‘పెదరాయుడు’…!
  • అరివీర కంపర పాత్రికేయం..! లోలోతుల్లోకి ఇంకా వేగంగా తెలుగు జర్నలిజం…!!
  • నాన్నా నరేషా… ఫాఫం నాలుగో పెళ్లాం పవిత్రకూ ఆ ప్రాప్తమేనా..?!

Archives

Copyright © 2022 · Muchata.com · Technology Support by CultNerds IT Solutions